బుధవారం (23 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. దశమి 22వ తేదీ మధ్యాహ్నం 1:03 నుంచి 23వ తేదీ ఉదయం 11:50 వరకు. ఆ తరువాత ఏకాదశి. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
వృషభం
అవసరానికి కావలసిన ఆదాయం చేకూరుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సన్నిహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.
మిథునం
శ్రమకు తగిన ఫలితం లభించదు. అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధిక పనిభారం. ఆర్ధిక సమస్యలు కనిపిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. ఓపికగా ఎదురు చూడటం ఉత్తమం.
కర్కాటకం
శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు గడిస్తారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలి తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
సింహం
స్థిరాస్తి వివాదాలు ఉన్నాయి, సన్నిహితులతోనే సమస్యలు. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో.. అవరోధాలు కలుగుతాయి. వ్యాపారంలో ఊహకందని నష్టాలు. సహోద్యోగులతో మాటపట్టింపులు. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
నిరుద్యోగులకు శుభయోగం, నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటాబయట సానుకూల వాతావరణం. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
తుల
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
వృశ్చికం
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట ప్రతికూల వాతావరణం, పాత ఋణాలను తీర్చడానికి.. కొత్త ఋణ ప్రయత్నాలు చేస్తారు.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం. ఇంటాబయట అదనపు బాధ్యతలు ఎక్కువవుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.
మకరం
శుభకార్యాలలో పాల్గొంటారు, బంధుమిత్రులతో.. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కుంభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటాబయట సానుకూల వాతావరణం, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
మీనం
ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిలో అనుకూల వాతావరణం. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్రీయ, సాంకేతికమైన అధరాలు లేదు. అయితే.. రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.