గురువారం (24 ఏప్రిల్): ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

గురువారం (24 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. తిథి: ఏకాదశి 23వ తేదీ ఉదయం 11:50 నుంచి 24వ తేదీ ఉదయం 10:14 వరకు. ఆ తరువాత ద్వాదశి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..

మేషం

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. సన్నిహితులతో వివాదాలు. ముఖ్యమైన పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చుల విషయంలో మరోమారు ఆలోచించండం మంచిది. విద్యార్థులు కూడా మరింత కష్టపడాల్సి ఉంటుంది.

వృషభం

ఆకస్మిక ధన లాభం. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. కార్య సిద్ది ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, శ్రమకు తగిన ఫలితం లభించదు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.

మిథునం

ఇంటాబయట ప్రతికూల ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ కలహాలు, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కర్కాటకం

దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు.. సజావుగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ లభిస్తుంది.

సింహం

కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు, బంధు మిత్రులతో సైతం విభేదాలు తలెత్తుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య

అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. దూరపు బంధువుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఓ కీలక సమాచారం మీకు ఊరట కలిగిస్తుంది.

తుల

కార్యసిద్ధి ఉంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, పనికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంటాబయట సంతోషకరమైన వాతావరణం. విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు.

వృశ్చికం

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు ఉన్నాయి. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, అధికారులతో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు

ముఖ్యమైన పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభించదు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.

మకరం

మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ది ఉంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కీలక వ్యవహారాలలో విజయం మీదే. అయితే తొందరపాటు పనికిరాదు.

కుంభం

నిరుద్యోగులకు శుభయోగం, ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగంలో కూడా సంతృప్తికరమైన వాతావరణం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.

మీనం

ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్పా.. ఫలితం శూన్యం. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో తగిన గుర్తింపు ఉండదు. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పైన చెప్పినవన్నీ జరుగుతాయని గానీ.. జరగవు అని గానీ మనం నిర్దారిసంచలేము. ఎందుకంటే రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల మీద కూడా ఆధారపడి అంటాయి. పాఠకులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Leave a Comment