Akkineni Naga Chaitanya Buys New Porsche 911 GT3 RS: అక్కినేని నాగ చైతన్య.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు పొందటమే కాకుండా.. ఎప్పటికప్పుడు తనకు నుంచి ఖరీదైన సూపర్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు జర్మనీ సూపర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ధర
నాగ చైతన్య కొనుగోలు చేసిన సూపర్ కారు పోర్స్చే కంపెనీకి చెందిన ‘911 జీటీ3 ఆర్ఎస్’ (Porsche 911 GT3 RS) అని తెలుస్తోంది. దీని ధర రూ. 3.5 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే 911 మరియు ఫెరారీ 488 జీటీబీ వంటి కార్లు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ కార్ల జాబితాలోకి మరో సూపర్ కారు చేరింది.
అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కొత్త ‘పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్’ 3996 సీసీ 6 సిలిండర్ డీఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 518 Bhp పవర్ మరియు 6300 rpm వద్ద 465 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 296 కిమీ కావడం గమనార్హం.
డిజైన్ & ఫీచర్స్
కేవలం రెండు డోర్స్ కలిగిన ఈ కారు నాలుగు సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్ లైట్, డీఆర్ఎల్, ఫాగ్ లైట్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ సూపర్ కారు 10.9 ఇంచెస్ టచ్ స్క్రీన్ పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో జీపీఎస్ న్యావిగేషన్, అనలాగ్ టాకొమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
డైమెన్షన్స్
చూడటానికి చిన్నగా ఉన్నపటికీ ఇది పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పొడవు 4572 మిమీ, వెడల్పు 1900 మిమీ, ఎత్తు 1322 మిమీ మరియు వీల్‌బేస్ 2457 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు మంచి జర్నీలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
డీలర్‌షిప్ ఇన్‌స్టా పోస్ట్
కొత్త పోర్స్చే కారును అక్కినేని నాగ చైతన్య.. చెన్నై కంపెనీ డీలర్‌షిప్ వద్ద డెలివరీ తీసుకున్నారు. ఇందులో కారు పక్కన నాగ చైతన్య ఉండటం చూడవచ్చు. ఈ ఫోటోలను డీలర్‌షిప్ షేర్ చేస్తూ.. నాగ చైతన్యకు పోర్స్చే ఫ్యామిలీ స్వాగతం చెబుతోంది. పోర్స్చే 911 కారును డెలివరీ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఫిదా చేస్తున్నాయి. చాలామంది కొత్త కారు కొన్న సందర్భంగా నాగ చైతన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ కారుకు 2024 మే 17న రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది హైదరాబాద్‌లోనే మొదటి పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ అని తెలుస్తోంది. ఈ కారు నగరంలోని రోడ్ల మీద కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు గురించి తెలుసా?
నాగ చైతన్య గ్యారేజిలోని కార్లు మరియు బైకులు
నిజానికి నాగ చైతన్యకు కార్లు, బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇప్పటికే అనేక అన్యదేశ్య కార్లు మరియు బైకులను కలిగి ఉన్నారు. ఇందులో చెప్పుకోదగ్గ కారు రెడ్ కలర్ ఫెరారీ మరియు రేంజ్ రోవర్ డిఫెండర్ 110. వీటితో పాటు బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ (రూ. 1.30 కోట్లు), ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (రూ. 1.18 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్ జీ 63 ఏఎంజీ (రూ. 2.28 కోట్లు), ఎంవీ అగస్టా ఎఫ్4 మరియు బీఎండబ్ల్యూ 9ఆర్‌టీ (రూ. 18.5 లక్షలు) ఉన్నాయి.