తండ్రికి కారు గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.. ఆనందంతో గంతులేసిన తల్లి – వీడియో వైరల్

Actor Prasad Oak Received BMW Car As a Gift From His Son: పిల్లలకు తల్లిదండ్రులు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం స్పెషల్. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా అలాంటి మరో సంఘటన తెరమీదకు వచ్చింది. ప్రముఖ మరాఠీ నటుడు ‘ప్రసాద్ ఓక్’కు తన కొడుకు సార్థక్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. ప్రసాద్ ఓక్ నవనీత్ మోటార్స్ అనే బీఎండబ్ల్యూ షోరూమ్‌కు రావడం చూడవచ్చు. ఆయన వెంట ఆయన భార్య కూడా వచ్చింది. ప్రసాద్ ఓక్, ఆయన భార్య, కొడుకు ముగ్గురూ డీలర్షిప్ చేరుకుంటారు. అక్కడ కారు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేసిన తరువాత అక్కడి సిబ్బంది వారికి కారు తాళం అందిస్తారు. ఆ తరువాత ప్రసాద్ ఓక్.. ఆయన భార్య కారులో వెళ్తారు. ఇంతటితో వీడియో పూర్తవుతుంది.

కారు డెలివరీ చేసుకునే సమయంలో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేదు. ఈ వీడియోను ప్రసాద్ ఓక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కారు గిఫ్ట్ ఇచ్చిన కొడుక్కి.. ఆ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. ఖరీదైన కారు గిఫ్ట్‌గా పొందిన ఆ తండ్రి కొంత భావోద్వేగానికి కూడా గురవ్వడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

వీడియో షేర్ చేస్తూ ప్రసాద్ ఓక్ కుమారుడు ఈ విధంగా పేర్కొన్నాడు. ”నేను చాలా గర్వపడుతున్నాను. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీ కోరికలన్నీ తీరుస్తాడు. జన్మదిన శుభాకాంక్షలు”. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

బీఎండబ్ల్యూ ఎక్స్1 (BMW X1)

భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో బీఎండబ్ల్యూ యొక్క ఎక్స్1 కూడా ఒకటి. ఇక్కడ ప్రసాద్ ఓక్ పొందిన కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ క్లాసీ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ఇది హై-గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు బేజ్ ఇంటీరియర్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే ఈ కారు ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్ పొందింది. ముందు భాగంలో బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన రియర్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా చూడచక్కగా ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్1 కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్1 ఎస్‍డ్రైవ్ 18ఐ ఏం స్పోర్ట్ మరియు ఎక్స్1 ఎస్‍డ్రైవ్ వేరియంట్స్. అయితే ఇక్కడ ప్రసాద్ ఓక్ గిఫ్ట్‌గా పొందిన కారు ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియదు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

పెట్రోల్ వేరియంట్ 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 134 బీహెచ్‌పీ పవర్ మరియు 230 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ యూనిట్. ఇది 147 బీహెచ్‌పీ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దేశీయ విఫణిలో పెట్రోల్ మోడల్ ధర రూ. 49.5 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 52.5 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

బీఎండబ్ల్యూ కార్లకు ఎందుకంత డిమాండ్?

భారతదేశంలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నా.. లగ్జరీ కారు అంటే ముందుగా గుర్తొచ్చేది బెంజ్, బీఎండబ్ల్యూ. చాలామంది ప్రముఖులు బెంజ్ లేదా బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనికి కారణం లగ్జరీ డిజైన్, లగ్జరీ ఫీచర్స్ కలిగి.. లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చని. ఈ కారణంగానే ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లోని చాలామంది సెలబ్రిటీలు ఈ బీఎండబ్ల్యూ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు ప్రసాద్ ఓక్ కూడా చేరిపోయారు.

Don’t Miss: గణేష్ చతుర్థి ఆఫర్: ఈ స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్స్.. ఇంకా ప్రయోజనాలెన్నో

బీఎండబ్ల్యూ కంపెనీ కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్శించడమే కాకుండా, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల తాజాగా హైడ్రోజన్ కార్లను ఆవిష్కరించింది. అంతే కాకుండా.. బీఎండబ్ల్యూ 320ఎల్‌డీ ఎమ్ స్పోర్ట్స్ ప్రో కారును రూ. 65 లక్షల ధర వద్ద లాంచ్ చేసింది. ఇలా బీఎండబ్ల్యూ తనదైన రీతిలో తన ఉనికిని చాటుకుంటోంది.