బర్త్‌డేకు చిన్న కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే మీరే కొనేస్తారు (ఫోటోలు)

Actress Namratha Gowda Buys MG Comet EV: సాధారణంగా సెలబ్రిటీ అంటే ఖరీదైన కార్లు, లగ్జరీ కార్లు లేదా సూపర్ కార్లు కొంటారని అందరికి తెలుసు. కానీ నేడు ట్రెండ్ మారిందా అనిపిస్తుంది. ఎందుకంటే బుల్లితెర నటుల నుంచి ప్రముఖ సినీ నటుల వరకు చాలామంది తక్కువ ధరలో లభించే కార్లను కూడా కొనుగోలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులకు ముందు సినీల్ శెట్టి.. ఎంజీ కామెట్ ఈవీ కొనుగోలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ కన్నడ నటి నమ్రత గౌడ కామెట్ ఈవీ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నమ్రత గౌడ కొత్త కారు

బుల్లితెర మీద పాపులర్ అయిన నమ్రత గౌడ (Namratha Gowda) సినిమాల్లో కూడా తనదైన రీతిలో నటిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది. అంతకంటే ముందు కన్నడ బిగ్‌బాస్ 10 సీజన్‌లో కూడా నటించారు. ఇటీవల ఈమె తన పుట్టిన రోజుకి ఓ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇది దేశీయ మార్కెట్లోని అతి తక్కువ ధర వద్ద లభిస్తున్న కార్లలో ఒకటి. అదే ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV).

కొత్త కారు కొనుగోలు చేసిన తరువాత దానిని డెలివరీ తీసుకోవడానికి.. తల్లిదండ్రులతో కలిసి డీలర్షిప్ చేరుకున్నారు. కారును డెలివరీ తీసుకునే సమయంలో ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు. బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి కారు చాలా ఉత్తమంగా ఉంటుందని ఈ కారును కొనుగోలు చేసినట్లు నమ్రత పేర్కొన్నారు.

ఎంజీ కామెట్ ఈవీ

భారతదేశం ప్రస్తుతం సరసమైన ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఇది ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 668800 (ఎక్స్ షోరూమ్). అయితే ధర అనేది ఎందుకుని వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇటీవల 100 ఇయర్స్ ఎడిషన్ రూపంలో కూడా లాంచ్ అయింది. అయితే నమ్రత గౌడ కొనుగోలు చేసిన కారు సాధారణ ఎంజీ కామెట్ ఈవీ అని తెలుస్తోంది. ఈ కారు ఎల్ఈడీ లైట్ బార్, ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ మరియు బ్రాండ్ లోగో వంటివి చూడవచ్చు. వెనుక భాగం కూడా చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారు లోపలి భాగం వైట్ అండ్ గ్రీ కలర్ పొందుతుంది. 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 10.25 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, లెదర్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకూండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో నిక్షిప్తమై ఉన్నాయి. ఎంజీ కామెట్ ఈవీలో ప్రధానంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. 3 పాయింట్ సీట్ బెల్ట్, పిల్లల కోసం ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవన్నీ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం రేంజ్. ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ రేంజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఈ కారు ఫుల్ ఛార్జ్ (0 నుంచి 100 శాతం) కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 42 పీఎస్ పవర్ 100 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు రోజు వారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: ఇలాంటి ల్యాండ్ రోవర్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

నిజానికి ప్రస్తుతం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. చాలామంది ప్రజలు కూడా వారి రోజువారీ వినియోగానికి ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం ధర తక్కువని మాత్రమే కాదు.. ఎక్కువ రేంజ్ అందిస్తుందని కూడా. రాబోయే రోజుల్లో ఈ కారు మరింత గొప్ప అమమకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే కంపెనీ భవిష్యత్తులో ఈ కారు రేంజ్ పెంచడానికి ఏమైనా అప్డేట్స్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.