Akkineni Nagarjuna Focus On 100th Film: తెలుగు సినీ రంగానికి మూల స్తంభాలైనవారిలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కూడా ఒకరు. 1961లో వెలుగు నీడలు సినిమాలో బాల నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన నాగార్జున.. 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా తెరమీద కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 99 సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుని, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నాగార్జున త్వరలో 100వ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే డైరెక్టర్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు నటించిన సినిమాల కంటే.. వందవ సినిమా ప్రత్యేకమైనదిగా ఉండాలని, సినిమా దర్శకత్వాన్ని తమిళ డైరెక్టర్ ‘కార్తిక్’కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈయన గతంలో ‘నితం ఒరువానం’ అనే తమిళ సినిమాను ఆకాశం పేరుతో నాగార్జున హీరోగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. కానీ డైరెక్టర్ సినిమాను తెరమీద చూపించిన విధానం నాగార్జునకు తెగ నాచేయడంతో.. తన వందవ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశాన్ని మళ్ళీ అతని చేతిలోనే పెట్టాడు.
రూ.100 కోట్లతో పాన్ ఇండియా మూవీ!
తన వందవ సినిమా పాన్ ఇండియా రేంజిలో ఉండాలని.. దీనికోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ట్రెండ్ ఫాలో అవుతూ.. ప్రేక్షకులకు నచ్చేలా, సినిమా ఉండాలని నాగ్ కోరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
నిజానికి నాగార్జున 100వ సినిమా డైరెక్షన్ కోసం పూరీ జగన్నాధ్, తమిళ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్, బెజవాడ ప్రసన్న కుమార్ వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఆ అవకాశాన్ని కార్తిక్ సొంతం చేసుకున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
రెండు సినిమాలతో నాగార్జున బిజీ
ప్రస్తుతం అక్కినేని నాగార్జున్ కుబేర మరియు కూలీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆరు పదుల వయసు దాటినా.. మన్మధుడుగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అక్కినేని నాగార్జున త్వరలో 100వ చిత్రంతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇవన్నీ త్వరలోనే అధికారికంగా వెలువడతాయి.
Also Read: నయనతార రూ.100 కోట్ల ఇల్లు?: భూలోక స్వర్గమా అంటున్న నెటిజన్స్ (ఫోటోలు)
వంద సినిమాల్లో నటించిన తెలుగు హీరోలు
ఒక వ్యక్తి హీరోగా 100 సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి వంద సినిమాలను పూర్తిచేసుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఈ జాబితాలోకి త్వరలోనే అక్కినేని నాగార్జున చేరనున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలకృష్ణ అఖండ 2 సినిమాలో నటిస్తూ.. రాజకీయాల్లో కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతున్న నాగార్జున కూడా త్వరలోనే త్వరలోనే 100వ సినిమాలో కనిపించనున్నారు. ఇది నిజంగా కింగ్ నాగార్జున అభిమానులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.