Alia Bhatt in Auto Rickshaw: దేశంలో వాహన సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.. దీంతో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయిపోతోంది. సాధారణ ప్రజలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు రోజూ చాలా ఇబ్బందులు పడుతూ తమ ప్రయాణాలను కొనసాగుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల నటి ‘అలియా భట్’ (Alia Bhatt) ట్రాఫిక్ నుంచి బయటపడటానికి లగ్జరీ కారును వదిలేసి.. ఆటో రిక్షాలో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నటి అలియా భట్ ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సమయంలో.. అక్కడ నుంచి బయటపడి గమ్యాన్ని చేరుకోవడానికి, గేట్‌వే ఆఫ్ ఇండియా జెట్టీ నుంచి ఆటో రిక్షాలో ప్రయాణించింది. సాధారణ దుస్తులు ధరించిన అలియా భట్.. పక్కనే బాడీగార్డ్స్ కూడా ఉండటం చూడవచ్చు. ముఖానికి నల్లటి మాస్క్ వేసుకున్నప్పటికీ.. ఆమె అలియా భట్ అని స్పష్టంగా తెలిసిపోతోంది.
ఆటో రిక్షాలో అలియా భట్
ఆటో రిక్షాను సమీపించిన అలియా భట్.. ఆటోలో కూర్చుంది. ఆమె బాడీగార్డ్ కూడా ఆమె పక్కనే ఆటోలో కూర్చున్నాడు. అయితే అలియా భట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందన్న విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే ఈమె ధరించిన షర్ట్ మాత్రం జిగ్రా చిత్రంలో వేసుకున్నదే అని తెలుస్తోంది.
నిజానికి ట్రాఫిక్ అనేది.. ఆధునిక కాలంలో కూడా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. విలాసవంతమైన లేదా విశాలమైన కార్లలో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ను అధిగమించాలంటే కొంత కష్టమైన పనే. అయితే ఆటో రిక్షాలు, చిన్న కార్లు లేదా టూ వీలర్లలో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ను కొంత వేగంగా అధిగమించవచ్చు. అయితే సెలబ్రిటీలు టూ వీలర్లలో ప్రయాణించడం కొంత కష్టమైన పని. ఎందుకంటే.. సెలబ్రిటీలు బైకుల్లో తిరుగుతూ కనిపిస్తే.. అభిమానులు మీదపడతారు. అది ట్రాఫిక్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.
సెలెబ్రిటీలు ఆటో రిక్షాలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు
నటి అలియా భట్ ఆటో రిక్షాలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఆటోలో ప్రయాణించారు. మరికొందరు మెట్రో రైలులో కూడా ప్రయాణించారు. చేరుకోవాల్సిన గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి మెట్రో ట్రైన్ ఓ ఉత్తమ మార్గం. కాబట్టి పలువురు రాజకీయ నాయకులు కూడా గతంలో మెట్రో రైలులో ప్రయాణించారు.
అలియా భట్ ఉపయోగించే కార్లు
నటి అలియా భట్ తన రోజువారీ వినియోగానికి చాలా ఖరీదైన కార్లను వినియోగిస్తుంది. ఈ జాబితాలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8, ఆడి ఏ8 ఎల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఆర్8, మెర్సిడెస్ ఏఎంజీ జీ 63, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి క్యూ5 మరియు ఆడి క్యూ7, లెక్సస్ ఎల్ఎమ్ (రూ. 2.50 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.
అలియా భట్ మాత్రమే కాకుండా.. ఈమె భర్త రణబీర్ కపూర్ కూడా విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు. రణబీర్ కపూర్ ఉపయోగించే కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇది ప్రత్యేకమైన బెల్గ్రేవియా గ్రీన్ రంగులో ఉంది. ఈ కారంటే అలియా భట్‌కు కూడా చాలా ఇష్టమని సమాచారం.
Also Read: ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..
నటి అలియా భట్ ఉపయోగించే చాలా కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ ‘1500’గా ఉంటుంది. ఈ నెంబర్ తన ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, ఆడి క్యూ5, ఆడి ఏ6 మరియు బీఎండబ్ల్యూ 7 సిరీస్ వంటి వాటికి ఉంది. అయితే ఈ నెంబర్ ఎందుకు ఎంచుకుంది అనే విషయానికి సంబంధించిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వారు వెల్లడించలేదు.
అలియా భట్ రెమ్యునరేషన్
నటి అలియా భట్ బాలీవుడ్ ఫేమ్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఈమె సుమారు రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఈమె ఒక్కో సినిమాకు సుమారు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.
View this post on Instagram