Pushpa 2 Movie Telugu Review: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా తెరమీదకు వచ్చేసింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలలో టికెట్స్ రేట్లు భారీగా పెరికినప్పటికీ అభిమానులు మాత్రమే తగ్గేదేలే అన్నట్లు.. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారు. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
డైలాగ్స్ గూస్ బంప్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 బ్లాక్ బ్లస్టర్ సాధించింది. పార్ట్ 2 విషయానికి వస్తే.. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. భార్య మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ.. ఓ వైపు మహిళలకు కూడా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలో డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.
కథానాయకి పాత్రలో కనిపించిన శ్రీవల్లి.. కూడా ప్రేక్షకులను మెప్పించింది. పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అంటూ మాస్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ప్రత్యేకం అని చెప్పాల్సిందే. ఇక కిస్సిక్ అంటూ ఐటం సాంగులో కనిపించిన శ్రీలీల అభిమానులను ఉర్రూతలూగించింది. కనిపించింది ఒక్కపాటలో అయినప్పటికీ.. ఈమె డ్యాన్స్‌కి అందరూ ఫిదా అవుతారు.
అగ్ర తారలు మాత్రమే కాకుండా.. అనసూయ, సునీల్ మరియు కేశవ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఐటం సాంగ్ విషయంలో మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 కంటే.. పుష్ప 2లోని ఐటం సాంగ్ పెద్దగా మెప్పించలేదనే తెలుస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున ఖాతాలో మరో బ్లాక్ బ్లాస్టర్ ఖాయమని తెలుస్తోంది.