Amitabh Bachchan Buys BMW i7 Electric Car: ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గురించి అందరికీ తెలుసు. సినిమాల్లో నటిస్తూ తనదైన రీతిలో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయనకు ఖరీదైన / విలాసవంతమైన వాహనాల ఉపయోగించడం పట్ల కూడా అమితాసక్తి ఉంది. ఈ కారణంగానే బిగ్‌బీ ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.
నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల తన 82వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. బిగ్‌బీ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ కారు. ఈ సెడాన్ అత్యాధునిక డిజైన్ కలిగి..విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఈ మోడల్ కారును అజయ్ దేవగన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు.
బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)
భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లలో బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఒకటి. ఈ కారు ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేసేవారి సంఖ్య తక్కువే. ఆటోమోటివ్ టెక్నాలజీతో లాంచ్ అవుతున్న కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఒకటి. ఇది డ్యూయెల్ టోన్ ఆక్సైడ్ గ్రే మెటాలిక్ రంగులో ఉంటుంది. కాబట్టి ఇది ప్రీమియంగా కనిపిస్తుంది.
బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి పొందుతుంది. వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం 31.3 ఇంచెస్ 8కే రిజల్యూషన్ థియేటర్ స్క్రీన్ లభిస్తుంది. ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. అంతే కాకుండా రియర్ సీట్ ఫంక్షన్స్ కంట్రోల్ చేయడానికి 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా లభిస్తుంది. ఇది లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఇవి 544 హార్స్ పవర్, 754 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ 591 కిమీ నుంచి 625 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 239 కిమీ.
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580ఎం పోర్స్చే టైకాన్, ఆడి ఈ ట్రాన్ జీటీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందించబడింది. అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో ఇప్పటి వరకు అనేక విలవసవంతమైన ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ.. బీఎండబ్ల్యూ ఐ7 అనేది మాత్రం మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు.
అమితాబ్ బచ్చన్ గ్యారేజిలోని కార్లు
నటుడు అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో కొత్తగా చేరిన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 63 ఏఎంజీ, రేంజ్ రోవర్ 4.4డీ ఏబీ ఎల్‌డబ్ల్యుబీ, బెంట్లీ కాంటినెంటల్,లెక్సస్ ఎల్ఎక్స్ 570, మినీ కూపన్ ఎస్ మరియు పోర్స్చే కేమాన్ వంటివి ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కారణం ఇదేనా?
ప్రస్తుతం మార్కెట్లో ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి సుముఖత చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం కావచ్చు, వాతావరణ సమతుల్యతను కాపడం కోసం కావచ్చు.
Don’t Miss: Mahindra Thar Roxx బుక్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్!.. ఇక్కడ చూడండి
ఇప్పటికే ఢిల్లీ వంటి మహానగరాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేదించారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. ఫ్యూయెల్ కార్ల కంటే కంటే కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి లేదా మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు.