Anant Ambani and Radhika Merchant Car Collection: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త మరియు ఆసియాలోని అత్యంత ధనవంతులైన ప్రముఖ జాబితాలో ఒకరైన ముకేశ్ అంబానీ.. తన చిన్న కుమారుడు ‘అనంత్ అంబానీ’కి జులై 12న ‘రాధికా మర్చెంట్’తో వివాహం చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ జంటకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిపారు. కాగా వీరిరువురు త్వరలో ఒక్కటి కానున్నారు.
త్వరలో మూడుముళ్లతో ఒక్కటి కానున్న ఈ జంట (అనంత్ & రాధిక) ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో రోల్స్ రాయిస్, బెంజ్, ఆడి మొదలైన కార్లు ఉన్నాయి. ఈ కథనంలో అనంత్, రాధికా మర్చెంట్ ఉపయోగించే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
అనంత్ అంబానీ ఉపయోగించే కార్లు
రోల్స్ రాయిస్ కల్లినన్
అనంత్ అంబానీ ఉపయోగించే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.75 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 571 హార్స్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. తద్వారా వాహన వినియోగదారు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63
అనంత్ అంబానీ ఉపయోగించే మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ జీ63. దీని ధర రూ. 3 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 416 హార్స్ పవర్ మరియు 612 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ/గం వరకు ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఐ8
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ8 కూడా అనంత్ అంబానీ ఉపయోగించే కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 2.14 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో 11.6 కిలోవాట్ బ్యాటరీతో కూడిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 369 హార్స్ పవర్ మరియు 571 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 4.3 సెకన్లలో 0 నుంచి 96 కిమీ/గం వరకు వేగవంతమవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 250 కిమీ/గం కావడం గమనార్హం.
మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్
అనంత్ అంబానీ ఉపయోగించే మరో ఖరీదైన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ కంపెనీకి చెందిన ‘ఎస్-క్లాస్’. ఈ కారు ధర రూ. 1.77 లక్షల నుంచి రూ. 1.81 కోట్లు. ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలువురు ప్రముఖ సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఈ కారు ఉంది. దీనిని చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తారు.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ
ఇక చివరగా అనంత్ అంబానీ ఎక్కువగా ఉపయోగినే ఖరీదైన కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. సుమారు రూ. 2.12 కోట్ల ఖరీదైన ఈ కారు.. ఏకంగా 2.5 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ కారులో 4.4 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 523 హార్స్ పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 4.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతమవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 240 కిమీ/గం.
రాధికా మర్చంట్ ఉపయోగించే కార్లు
మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ
అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్న రాధికా మర్చెంట్ కూడా విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు. ఈమె వద్ద ఉన్న కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ. సుమారు రూ. 80 లక్షల ఖరీదైన ఈ కారు 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 192 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. గంటకు 240 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Don’t Miss: బర్త్‌డేకు చిన్న కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే మీరే కొనేస్తారు (ఫోటోలు)
బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ
నీతా అంబానీ, ముకేశ్ అంబానీ ఈ కారును రాధికా, అనంత్ అంబానీ నిశ్చితార్థం తర్వాత రాధికా మర్చెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ధర కోట్ల రూపాయలు ఉంటుంది. భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇది 6.0 లీటర్ డబ్ల్యు12 ఇంజిన్ పొందుతుంది. ఇది 659 పీఎస్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఎలక్ట్రినిక్ లిమిటెడ్ సల్పి డిఫరెన్షియల్ ఫీచర్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.