25.7 C
Hyderabad
Sunday, April 13, 2025

ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP Intermediate Results 2025 and Grading Details: పరీక్షల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి చెప్పింది. రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెల్లడి కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in సందర్శించడం ద్వారా స్కోర్‌కార్డ్‌లను పొందవచ్చు.

గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందంటే?

ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE)లో విద్యార్థులు సాధించిన స్కోర్ ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గ్రేడ్స్ కేటాయిస్తుంది. 91 నుంచి 100 మార్కుల మధ్య స్కోర్ చేసిన విద్యార్థులకు ఏ1 గ్రేడ్, 81 నుంచి 90 మధ్యలో మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఏ2 గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. 71 నుంచి 80 మధ్యలో మార్కుల తెచ్చుకున్న విద్యార్థులకు బీ1 గ్రేడ్, 60 నుంచి 70 మార్కులు మధ్య తెచ్చుకున్న విద్యార్థులకు బీ2 గ్రేడ్ లభిస్తుంది. 51 నుంచి 60 మార్కులు తెచ్చుకున్న వారు 11 గ్రేడ్ కిందకు, 41 నుంచి 50 మార్కుల వరకు స్కోర్ చేసిన వారు సీ2 గ్రేడ్ కిందికి వస్తారు.

➢A1 గ్రేడ్: 91 నుంచి 100 మార్కులు
➢A2 గ్రేడ్: 81 నుంచి 90 మార్కులు
➢B1 గ్రేడ్: 71 నుంచి 80 మార్కులు
➢B2 గ్రేడ్: 61 నుంచి 70 మార్కులు
➢C1 గ్రేడ్: 51 నుంచి 60 మార్కులు
➢C2 గ్రేడ్: 41 నుంచి 50 మార్కులు

డిజిలాకర్‌లో ఏపీ ఇంటర్ ఫలితాలు

ఇంద్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలను డిజిలాకర్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఎలా యాక్సెస్ చేయాలో ఈ కింద వివరంగా తెలుసుకుందాం..

➤అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్ (digilocker.gov.in) ఓపెన్ చేయండి లేదా మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.
➤హోమ్ పేజీలో ఎడ్యుకేషన్ విభాగాన్ని ఎంచుకోవాలి.
➤ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సంబంధిత బోర్డ్ ఎంచుకోవాలి.
➤ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2025 లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 ఎందుకుని అవసరమైన వివరాలతో ఫిల్ చేయాలి.
➤అవసరమైన వివరాలను ఎంటర్ చేసిన తరువాత ఫలితాలు కనిపిస్తాయి.

వాట్సాప్ నెంబరుకు ఫలితాలు

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని.. విద్యార్థులకు నేరుగా తమ వాట్సాప్ నెంబరుకు ఫలితాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితాలను నేరుగా వాట్సాప్ నెంబరుకు పంపించనున్నట్లు ఎడ్యుకేషన్ మినిష్టర్ నారా లోకేష్ స్పష్టం చేసారు. కాబట్టి పరీక్షల ఫలితాలు వాట్సాప్ నెంబరుకు నేరుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు హ్యాపీగా తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు.

Also Read: ఇంటర్ అర్హతతో జాబ్.. రూ.81000 జీతం!: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు సంఖ్య 5 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. కాగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీరందరి పరీక్షల ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు వెల్లడవుతాయి.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు