Apple iPhone SE 4 Launch Date Revealed: ప్రపంచ మార్కెట్లో యాపిల్ కంపెనీ యొక్క ‘ఐఫోన్’లకు అధిక ప్రజాదరణ ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్లకు అభిమానుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త ఫోన్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు యాపిల్ మొబైల్స్ జాబితాలోకి మరో ఫోన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ టిమ్ కుక్ (Tim Cook) పరోక్షంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసాడు.
టిమ్ కుక్ షేర్ చేసిన ఏడు సెకండ్స్ వీడియోలో.. యాపిల్ లోగో మాత్రమే ఉంది. అయితే 2025 ఫిబ్రవరి 19వ తేదీ యాపిల్ కుటుంబంలో కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉందని అని ట్వీట్ చేసారు. దీన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే వారంలో యాపిల్ ఎస్ఈ 4 (Apple SE 4) లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విటర్)లో కూడా ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్ కూడా.
యాపిల్ ఎస్ఈ 4
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక యాపిల్ మొబైల్స్ ఉన్నాయి. కాగా కంపెనీ త్వరలో ఓ కొత్త మోడల్ తీసుకురావడానికి సిద్ధమైంది. బహుశా ఇదే ‘ఎస్ఈ 4’ అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఐఫోన్ మొబైల్స్ కన్నా.. తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు.
ఎస్ఈ లైనప్ కొత్తేమీ కాదు. కాబట్టి కొందరు రాబోయే ఎస్ఈ 4 మొబైల్ పాత డిజైన్ కలిగి ఉంటుందని భావించవచ్చు. కానీ కంపెనీ దీనికి కొత్త డిజైన్ అందించే అవకాశం ఉంది. బహుశా దీని డిజైన్ ఐఫోన్ 14 మాదిరిగా ఉండే అవకాశం ఉంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు కూలంకశంగా తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
డిజైన్
ఇప్పటికి అందుబాటులో ఉండే సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్ దాదాపు ఐఫోన్ 14 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో ఎస్ఈ 14 ఫోన్స్ విక్రయిస్తోంది. కానీ ఎస్ఈ 4 లాంచ్ తరువాత ఐఫోన్ 14 కనుమరుగయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎస్ 4లో బయోమెట్రిక్ కోసం పేస్ ఐడీ అందించనున్నారు. ఎస్ఈ 3లో జనిపించే 4.7 ఇంచెస్ స్క్రీన్ మాదిరిగా కాకుండా.. ఎస్ఈ 4లో 6.06 ఇంచెస్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుంది.
పవర్
కొత్త ఐఫోన్ ఎస్ఈ 4లో.. ఏ18 ప్రాసెసర్ ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్యాకేజీలో భాగమయ్యే అవకాశం కూడా ఎక్కువే అని తెలుస్తోంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా భారీగా పెరుగే అవకాశం ఉంది. ఇందులో ఒక ఫ్రంట్ కెమెరా, మరొకటి బ్యాక్ కెమెరా మాత్రమే ఉండండుంది. మొత్తం మీద కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
ధర & వివరాలు
త్వరలో లాంచ్ కానున్న యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ 128 జీబీ, 256 జీబీ మరియు 512 జీబీ వేరియంట్ల రూపంలో విక్రయానికి రానుంది. దీని ప్రారంభ ధర రూ. 50000 వరకు ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ మొబైల్ లాంచ్ చేసిన తరువాత ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. ఆ తరువాత డెలివరీలు మొదలవుతాయి.
Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?
తక్కువ ధరలో ఓ ఐఫోన్ కావాలనుకునేవారికి.. ఎస్ఈ 4 ఓ ఉత్తమ ఎంపిక. అయితే కొనుగోలుదారు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ధరలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది వివిధ రకాల స్టోరేజ్ ఎముకలతో వస్తుంది. కాబట్టి బేస్ వేరియంట్ ధర ఒకమాదిరిగానే.. టాప్ ఎండ్ మోడల్ కొంత ఎక్కువ ధరకు లభిస్తుందని సమాచారం. మొత్తం మీద ఎస్ఈ4 ఫోన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందా.. అని ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Get ready to meet the newest member of the family.
Wednesday, February 19. #AppleLaunch pic.twitter.com/0ML0NfMedu
— Tim Cook (@tim_cook) February 13, 2025