Gold and Silver Price Today: ఏప్రిల్ నెల ప్రారంభం కాకముందు నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా ఊహకందని రీతిలో.. తగ్గుతూ ఉంది. ఈ రోజు (ఏప్రిల్ 05) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా 980 రూపాయలు తగ్గింది. అంటే రెండు రోజుల్లో పసిడి ధర రూ. 2720 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు బాగా తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో గోల్డ్ రేటు (Gold Rate) తగ్గుముఖం పట్టింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 90,660 వద్ద ఉంది. అంటే నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 900 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 980 (24 క్యారెట్స్ 10 గ్రా) తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. బెంగళూరు, ముంబై, మరియు చెన్నై వంటి నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ ధర రూ. 83,100 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 90,660 వద్దనే ఉన్నాయి. నిన్న కూడా బంగారం రేటు భారీగా తగ్గింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 83,250 (రూ. 900 తగ్గింది), 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 90,810 (రూ. 980 తగ్గింది) వద్ద ఉంది. నిన్న కూడా ఇక్కడ గోల్డ్ రేటు రూ. 1600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) మరియు రూ. 1740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. మొత్తం మీద రెండో రోజూ.. గోల్డ్ రేటు భారీగా పతనమవుతోంది. ఇదిలాగే కొనసాగితే.. బంగారం ధర మరింత తగ్గుతుందని స్పష్టమవుతోంది.
వెండి ధరలు
వెండి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ రోజు కేజీ వెండి రేటు (Silver Rate) ఢిల్లీలో మినహా రూ. 1,03,000 వద్ద ఉంది. అంటే కేజీ వెండి రేటు ఈ రోజు ఏకంగా రూ. 5000 తగ్గిందన్నమాట. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 94000 వద్ద ఉంది. ఢిల్లీలో బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం దేశంలోనే అత్యంత తక్కువ రేటుకు లభిస్తోంది.
Also Read: ఈ నెలలో (ఏప్రిల్ 2025) భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త కార్ల జాబితా ఇదే..
బంగారం ధరలు తగ్గడానికి కారణం
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారీఫ్స్ ఎఫక్ట్ అని తెలుస్తోంది. ప్రపంచ దేశాల మీద ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం కారణంగానే ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. యాపిల్ ఐఫోన్ ధరలు రూ. 2 లక్షలకు చేరే అవకాశం ఉందని.. పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఐఫోన్స్ మరింత ప్రియం అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆటోమొబైల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని భారతదేశం మీద డొనాల్డ్ ట్రంప్ 26 శాతం టారిఫ్ విధించాడు. చైనా వంటి దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది.