భారత్‌లో లాంచ్ అయిన ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ ఇదే.. ధర ఎంతో తెలుసా?

Audi Q8 Facelift Launched in India: జర్మన్ బ్రాండ్ అయినప్పటికీ దేశీయ విఫణిలో ఆడి కార్లకు మంచి డిమాండ్ ఉంది. చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్లను కొనుగోవులు చేయడానికి తెగ ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆడి ఇండియా క్యూ8 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అప్డేటెడ్ మోడల్.

ధర

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ (Audi Q8 Facelift) ప్రారంభ ధర రూ. 1.17 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది అప్డేటెడ్ మోడల్ కాబట్టి దాని మునుపటి మోడల్స్ కంటే కొంత తక్కువ ధర వద్ద లభిస్తుంది. ఆడి క్యూ8 స్టాండర్డ్ మోడల్ ధర రూ. 1.43 కోట్లు, సెలబ్రేషన్ వేరియంట్ ధర రూ. 1.07 కోట్లు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్

ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ అనేది అప్డేటెడ్ మోడల్. కాబట్టి చిన్నపాటి కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కానీ యాంత్రికంగా ఎటువంటి మార్పు చెందదు. అంటే క్యూ 8 స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఇంజిన్ పొందుతుందని స్పష్టమవుతోంది. ఇందులో చెప్పుకోదగ్గ అతిపెద్ద మార్పు ఏమిటంటే.. హై బీమ్ మరియు కాన్ఫిగర్ చేయదగిన హెచ్డీ మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్. అంతే కాకుండా బంపర్‌లోని ఎయిర్ ఇన్‌టేక్‌లు కూడా రీడిజైన్ చేయబడి ఉండటం గమనించవచ్చు. రియర్ ఫ్రొపైల్ పెద్దగా మారలేదు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

ఎక్స్టీరియర్ డిజైన్ మాదిరిగానే.. ఇంటీరియర్ డిజైన్ కూడా చెప్పుకోదగ్గ అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇంటీరియర్ డిజైన్ స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. అదే అపోల్స్ట్రే, కలర్ స్కీమ్ స్టిచ్చింగ్ కూడా చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్‌లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, హీట్ అండ్ వెంటిలేషన్ మసాజ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఈ కారులో ఉంటాయని స్పష్టమవుతోంది.

ఇంజిన్

మొదట్లో చెప్పుకున్న విధంగా ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ అనేది స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ 340 హార్స్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్ అనేది నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.

ప్రత్యర్థులు

ఆడి కంపెనీ లాంచ్ చేసిన కొత్త క్యూ8 ఫేస్‌లిఫ్ట్ మోడల్ దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు బీఎండబ్ల్యు ఎక్స్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.

ఆడి కార్లకు ఎందుకంత డిమాండ్

భారతదేశంలో లగ్జరీ కార్ల విభాగంలో చెప్పుకోదగ్గ బ్రాండ్లలో ఒకటి ఆడి. ఆడి కార్లు చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా అత్యుత్తమ పనితీరును అందిస్తూ.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. అయితే ఈ బ్రాండ్ కార్ల ధరలు అధికంగా ఉండటం వల్ల వీటిని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు వంటి వారు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

Don’t Miss: కొత్త జుపీటర్ 110 స్కూటర్: రూ. 74 వేలు మాత్రమే & ఫిదా చేసే ఫీచర్స్

ప్రస్తుతం ఆడి కంపెనీ కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కార్లను లాంచ్ చేసిన విక్రయించే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. మొత్తం మీద ఆడి కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందనేది మాత్రం అందరికీ తెలిసిన విషయం.