కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

Audi RS6 Avant GT Limited Edition Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) విఫణిలో ‘ఆర్ఎస్6 అవంత్ జీటీ’ (RS6 Avant GT) ఆవిష్కరించింది. వైడ్ రీచింగ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సమయంలోనే సంస్థ ఈ కొత్త ఎడిషన్ ప్రారంభించింది. ఆడి కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

660 యూనిట్లు (660 Units Only)

ఆడి కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు కేవలం లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే లభిస్తుంది. అంటే ఈ కారును కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 660 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. చూడటానికి అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఏరో ట్వీక్‌లు, బెస్పోక్ కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లు, రెట్రో లివరీ వంటి వాటిని పొందుతుంది. కావున ఇది స్టాండర్డ్ కారు కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త ఆడి ఆర్ఎస్6 అవంత్ జీటీ కారు 1989 IMSA GTO రేస్ కార్ నుంచి ప్రేరణ పొందిన ఆడి అప్రెంటిస్‌ల బృందం 2020లో రూపొందించారు. ఇది ఆర్ఎస్6 యొక్క టాప్ రేంజ్ పెర్ఫామెన్స్ వెర్షన్‌పై ఆధారపడింది. బానెట్, వింగ్ మరియు వీల్స్ కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించిన మొదటి ఆడి ఆర్ఎస్6 జీటీ. ఇది చూడటానికి ఆర్ఎస్6 అవంత్ జీటీ జీటీఓ కాన్సెప్ట్‌కు వీలైనంత దగ్గరగా కనిపించేలా రూపొందించబడింది.

రూప్ రైల్స్ లేదు

ఆడి ఆర్ఎస్6 అవంత్ జీటీ లిమిటెడ్ ఎడిషన్ వైట్ అండ్ రెడ్, గ్రే కలర్ పొందుతుంది. డబుల్ వింగ్, ఫంక్షనల్ రియర్ డిఫ్యూజర్ మరియు మరింత దూకుడుగా ఉండే ఫ్రంట్ స్ప్లిటర్ వంటి ఏరో రివిజన్‌లను కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారులో ఇప్పుడు రూప్ రైల్స్ లేదు. 22 ఇంచెస్ వీల్స్ ఏరో ఆప్టిమైజ్ చేయబడ్డాయి. ఇంటీరియర్‌లోని వివిధ భాగాలలో RS6 GT ఇన్స్క్రిప్షన్ చూడవచ్చు.

సీట్లు స్వెడ్ లాంటి డైనామికాలో అపోల్స్టర్ చేయబడ్డాయి. సీట్లు, స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోర్ మ్యాట్‌లపై రెడ్ అండ్ బ్రాంజ్ స్టిచ్చింగ్ చూడవచ్చు. లోపలి భాగంలో మోడల్ నంబర్‌ను సూచించే ప్లేట్ ఉంటుంది. డైనమిక్ మోడ్‌లో కారును మరింత చురుకైనదిగా చేయడానికి సస్పెన్షన్ మరియు రియర్ డిఫరెన్షియల్ రీవర్క్ చేయబడ్డాయి. కాయిల్‌ఓవర్‌లు 10 మి.మీ తగ్గించి, స్టాండర్డ్ కార్ల కంటే బిగుతుగా ఉంటాయి.

ఇంజిన్ (Audi RS6 Avant GT Limited Edition Engine)

ఆర్ఎస్6 దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది పవర్ డెలివరీ చేస్తుంది. ఈ ఇంజిన్ 630 హార్స్ పవర్ మరియు 848 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కావు గరిష్ట వేగం గంటకు 305 కిమీ కావడం గమనార్హం.

Don’t Miss: మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేస్తూ.. వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో ఓ సుస్థిరమైన మరియు ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందింది. ఈ కారణంగానే ఆడి అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని ఆధునిక ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.