రూ. లక్షల విలువైన బైక్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో కోనేయండిలా..

Bajaj Bikes Available On Flipkart Now: దేశంలో వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా కావలసినన్ని డీలర్లను నియమిస్తూ.. ప్రజలకు దగ్గరవుతున్నాయి. అయితే కొందరు ఇప్పుడు ఆన్‌లైన్ కొనుగోళ్ళకు అలవాటుపడి డీలర్‌షిప్‌కు రావడానికి కొంత వెనుకాడుతున్నారు. ఈ తరుణంలో బజాజ్ ఆటో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ తన మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణిని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచింది.

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండే బజాజ్ బైకులు

బజాజ్ పల్సర్, డామినార్, అవేంజర్, ప్లాటినా మరియు సీటీ 100 బైకులు అన్నీ కూడా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి బజాజ్ బైక్ కావాలనుకునే కాష్ఠరమార్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు రూ. 69000 నుంచి రూ. 2.31 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సదుపాయం 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని మరిన్ని నగరాలకు చేరువ చేయడానికి బజాజ్ సిద్ధమవుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే త్వరలో కంపెనీ తన మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ ‘ఫ్రీడమ్ 125’ను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తుంది భావిస్తున్నాము.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడం ఎలా?

సాధారణంగా నిత్యావసర వస్తువులు, బట్టలు, మొబైల్స్ వంటి ఇతరత్రా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే.. నేరుగా హోమ్ డెలివరీ ఇస్తారని అందరికి తెలుసు. కానీ బైక్ బుక్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ అధీకృత డీలర్లకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ తరువాత డీలర్షిప్ సందర్శించి డెలివరీ తీసుకోవాలి. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయాలంటే ముందుగా ఎక్స్-షోరూమ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం.. అంటే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, కేవైసీ మొదలైనవాటికి అయ్యే మొత్తం డీలర్షిప్ వద్ద చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో బైక్ కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ వంటి వాటికోసం కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం డాక్యుమెంటేషన్ ప్రక్రియ 8 నుంచి 12 రోజుల్లో పూర్తవుతుంది. కస్టమర్లు రెండు వారాల తరువాత బైక్ డెలివరీ తీసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే లభించే ఆఫర్స్ ఏవంటే?

ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ బైక్ కొనుగోలు చేస్తే.. కస్టమర్లు రూ. 5000 స్పెషల్ లాంచ్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనితోపాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎమ్ఐ, కార్డు ఆఫర్ వంటివి కూడా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటయని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఆఫర్స్ గురించి ముందుగానే ఆరా తీయడం మంచిది.

కరోనా వైరస్ అధికంగా ప్రబలిన సమయంలో ప్రజలకు ఆన్‌లైన్ సేవలను అందించడానికి చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఆన్‌లైన్ సేవలు క్రమంగా విస్తరిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బైకులు అంద్భుతలోకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఆన్‌లైన్ బుకింగ్ మీద కస్టమర్లకు ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అర్థమైపోతోంది.

బజాజ్ ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడానికి కారణం

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా కీర్తించబడుతున్న బజాజ్ ఆటో కస్టమర్లకు మరింత చేరువ కావడానికి, సేవలను మరింత మెరుగుపరచడానికి ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కంపెనీ అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారానే విక్రయిస్తున్నాయి.

Don’t Miss: బైక్ మాదిరిగా ఉండే ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.2 లక్షలు మాత్రమే!

ప్రస్తుతం బజాజ్ కంపెనీ అత్యుత్తమ బైకులను విక్రయిస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ మరియు యువతకు ఇష్టమైన మోడల్ పల్సర్. ఒకప్పటి నుంచి గొప్ప అమ్మకాలు పొందుతూ మార్కెట్లో దూసుకెళ్తున్న ఈ బైక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ఆధునిక హంగులను పొందుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఇటీవలే ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్. ఈ బైక్ డెలివరీలు ఇప్పటికే మొదలైపోయాయి. సంస్థ ఈ బైక్ కోసం బుకింగ్స్ దేశవ్యాప్తంగా స్వీకరిస్తోంది.