వచ్చేస్తోంది మరో బజాజ్ పల్సర్ బండి: ఫుల్ డీటైల్స్ ఇవే..

Bajaj Pulsar N125 Unveiled in India: బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్ బైక్. ఇప్పుడు కంపెనీ సరికొత్త పల్సర్ ఎన్125 మోటార్‌సైకిల్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతకంటే ముందు కంపెనీ ఈ బైకును ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో ఇప్పటికే లెక్కకు మించి ఉన్న 12 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌కు సరికొత్త జోడింపు అవుతుంది. అంతే ఈ బైక్ 125 సీసీ విభాగంలో చేరనుంది.

పల్సర్ ఎన్125 బైక్ అనేది ఎన్ లైనప్‌లో చేరనున్న కొత్త బైక్ అవుతుంది. ఇప్పటికే ఈ విభాగంలో ఎన్150, ఎన్160 మరియు ఎన్250 బైకులు ఉన్నాయి. ఈ విభాగంలోని బైకులు ఇతర బైకుల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటాయి. కాగా ఇప్పుడు ఈ విభాగంలోకి మరో బైక్ చేరనుంది. అయితే కంపెనీ ఈ బైక్ స్పెసిఫికేషన్‌లను మరియు పవర్‌ట్రెయిన్ వంటి వాటికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

కొత్త డిజైన్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్ ఎడ్జీ లుకింగ్ బాడీ ప్యానల్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది స్పోర్టి డిజైన్ పొందుతుంది. ఫ్రంట్ ఎండ్ కొత్త త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఇది రెండువైపులా ఉన్న బాడీ ప్యానెల్‌లతో చుట్టుముట్టి ఉంటుంది. ఈ బైకులోని ట్యాంక్ కవర్ ఫ్రంట్ ఫోర్క్ వైపు విస్తరించి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా పరిమాణంలో కొంత పెద్దదిగానే ఉంటుంది. ఈ బైకులోని అల్లాయ్ వీల్స్ చూడటానికి పల్సర్ పీ150 బైకులో ఉండే మాదిరిగానే ఉంటాయి. ఇది విభిన్న రంగులలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

పల్సర్ ఎన్125 బైక్ వెనుకవైపు సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ పొందుతుంది. అయితే టెయిల్ ల్యాంప్ మాత్రం బ్రాండ్ యొక్క ఇతర బైకులలో ఉన్న విధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైకులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పల్సర్ యొక్క ఇతర బైకులలో ఉన్నట్లుగానే ఉందని తెలుస్తోంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. ఈ బైకులో డిస్క్ బ్రేక్ మరియు డ్రమ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. బజాజ్ పల్సర్ ఎన్125 బైక్ 12 Bhp పవర్ మరియు 11 Nm తారక్ అందించే 125 సీసీ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ఇతర పల్సర్ బైకుల మాదిరిగానే మంచి పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ ఇదే: రేటెంతో తెలుసా?

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ రైడర్ 125 మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ వంటి 125 సీసీ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే కంపెనీ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది. ధర ఎంత ఉండొచ్చు అనే చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.