ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం: ఇదిగో టాప్ 5 బెస్ట్ సైకిల్స్

Best Affordable Cycles Under Rs.10000 in India: ఆధునిక కాలంలో కార్లు మరియు బైకులను మాత్రమే కాకుండా ‘సైకిల్స్’కు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం ఆరోగ్యం మీద శ్రద్ద చూపడమనే తెలుస్తోంది. మెకానికల్ లైఫ్ గడిపేస్తున్న చాలామంది సైక్లింగ్ ద్వారా కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సైకిల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు మార్కెట్లో ఖరీదైన సైకిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఎన్నెన్ని లేటెస్ట్ సైకిల్స్ మార్కెట్లో లాంచ్ అయినా.. తక్కువ ధర వద్ద లభించే వాటిని కొనుగోలు చేయడానికే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10వేలు కంటే తక్కువ ధర వద్ద మార్కెట్లో లభిస్తున్న ఉత్తమ సైకిల్స్ గురించి తెలుసుకుందాం.

అర్బన్ టెర్రైన్ మల్టీస్పీడ్ సైకిల్ (Urban Terrain Multispeed Cycle)

రూ. 7499 ధర వద్ద లభించే ఈ అర్బన్ టెర్రైన్ మల్టీస్పీడ్ సైకిల్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది హై పర్ఫామెన్స్ సైకిల్. మంచి ఫ్రేమ్, షార్ప్ బ్రేక్స్ కలిగి పట్టణ ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సైకిల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కొత్తగా సైకిల్ నేర్చుకునేవారికి మాత్రమే కాకుండా.. సైక్లింగ్ చేసేవారికి కూడా ఇది ఉత్తమ ఎంపిక.

అర్బన్ టెర్రైన్ బోల్ట్ సైకిల్ (Urban Terrain Bolt Cycle)

రూ. 6500 వద్ద లభించే ఈ సైకిల్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ లేదా సైకిల్ అడ్వెంచర్ చేయాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. హై పర్ఫామెన్స్ కలిగిన ఈ సైకిల్ రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. మంచి ఫ్రేమ్ సెటప్ కలిగి, ఉత్తమ బ్రేకింగ్ సిస్టం పొందిన ఈ సైకిల్ డిజైన్ పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ ధరలో ఓ మంచి సైకిల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇది వినియోగదారులకు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

లీడర్ బీస్ట్ 26టీ మౌంటైన్ సైకిల్ (Leader Beast 26T Mountain Cycle)

నిజానికి లీడర్ బెస్ట్ 26టీ మౌంటైన్ సైకిల్ అనేది ప్రత్యేకించి పురుషుల కోసం రూపొందించబడిన మోడల్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 8150 అని తెలుస్తోంది. దృఢమైన ఫ్రేమ్ మరియు మంచి యాక్ససరీస్ కలిగిన ఈ సైకిల్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ సెటప్ కలిగిన లీడర్ బీస్ట్ సైకిల్ సౌకర్యవంతమైన రైడింగ్ అందిస్తుంది. పర్వత మార్గాల వంటి కఠినమైన భూభాగాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

అర్బన్ టెర్రైన్ బోల్ట్ స్టీల్ సైకిల్ (Urban Terrain Bolt Steel Cycle)

రూ. 6699 వద్ద లభించే అర్బన్ టెర్రైన్ బోల్ట్ స్టీల్ సైకిల్ మంచి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. రోజు వారీ వినియోగానికి / పట్టణ వినియోగానికి లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీక్ ఎండ్ సమయంలో అడ్వెంచర్ వంటివి చేయడానికి కూడా ఈ సైకిల్ పనికొస్తుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ కలిగిన ఈ సైకిల్ కఠినమైన భూభాగాల్లో కూడా సజావుగా ముందుకు సాగుతుంది. మన్నికైన ఫ్రేమ్ మరియు స్మూత్ రైడ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Don’t Miss: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

అర్బన్ టెర్రైన్ యూటీ1000ఎస్26 సైకిల్ (Urban Terrain UT1000S26 Cycle)

మన జాబితాలో రూ. 10000 కంటే తక్కువ ధర వద్ద లభించే మరో బెస్ట్ సైకిల్ ఈ ‘అర్బన్ టెర్రైన్ యూటీ1000ఎస్26 సైకిల్’. దీని ధర రూ. 9499 మాత్రమే. అడ్జస్టబుల్ సస్పెన్షన్, మన్నికైన ఫ్రేమ్, స్మూత్ రైడింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ సైకిల్ సులభంగా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లి సైకిల్. ఇది కూడా రోజువారీ వినియోగానికి లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

Note: పైన వెల్లడించిన ఐదు సైకిల్స్ ధరలు కేవలం సూచన ప్రాయం మాత్రమే. నగరాన్ని బట్టి లేదా డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పు ఏర్పడవచ్చు. అంటే ధరలు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. కాబట్టి ఈ సైకిల్ కొనాలనుకునే వారు సమీపంలోని షోరూమ్స్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లను సందర్సించి ఖచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.