20.7 C
Hyderabad
Saturday, March 1, 2025

మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

Best Bikes Under Rs. 2 Lakh in India 2025: అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే బైకులను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి.. అందరికీ ఇష్టమే. అయితే కొన్ని అధిక ధరను కలిగి ఉంటాయి, మరికొన్ని ఓ స్థాయిలో ఉన్న ధరలో అందుబాటులో ఉంటాయి. ఈ కథనంలో రూ. 2 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద లభించే బెస్ట్ బైక్స్ గురించి తెలుసుకుందాం..

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 (Bajaj Pulsar RS200)

ఆర్ఎస్200 అనేది బజాజ్ కంపెనీ యొక్క చెప్పుకోదగ్గ బైక్. సుమారు 167 కేజీల బరువున్న ఈ బైక్ ధరలు రూ. 1.7 లక్షల నుంచి రూ. 1.8 లక్షల మధ్య ఉంది. విభిన్న రంగులలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ ద్వారా 9750 rpm వద్ద 24.5 హార్స్ పవర్, 8000 rpm వద్ద 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంచ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 (Bajaj Pulsar N250)

పల్సర్ ఎన్250 అనేది కూడా రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ బైక్. దీని ధర రూ. 1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్). 250 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 24 హార్స్ పవర్, 21.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 164 కేజీల బరువున్న ఈ బైక్ సిటీలో.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బజాజ్ డొమినార్ 250 (Bajaj Dominar 250)

మన జాబితాలో రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మరో బజాజ్ బైక్.. ఈ ‘డొమినార్ 250’. దీని ప్రారంభ ధర రూ. 1.8 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ బరువు 180 కేజీలు కాగా.. 250 సీసీ ఇంజిన్ ద్వారా 8500 rpm వద్ద 27 హార్స్ పవర్, 6500 rpm వద్ద 23.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ బైక్.. మంచి డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగి, అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 (Bajaj Pulsar NS200)

మరో బజాజ్ బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైక్. దీని ప్రారంభ ధర రూ. 1.42 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9750 rpm వద్ద 24.5 హార్స్ పవర్ మరియు 8000 rpm వద్ద 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 156 కేజీల బరువున్న ఈ బైక్ 10.98 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. పనితీరు దాని ప్రత్యర్థుల కంటే అద్భుతంగా ఉంటుంది.

హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ (Hero Karizma XMR)

ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించిన బైక్ ఈ ‘హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్’. దీని ధర రూ. 1.8 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 25.5 హార్స్ పవర్, 20.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. 163.5 కేజీల బరువున్న ఈ బైక్.. యమహా ఆర్15 కంటే 22 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Suzuki Gixxer SF 250)

జిక్సర్ ఎస్ఎఫ్ 250.. కూడా రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైక్. 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. 9300 rpm వద్ద 26.5 హార్ పవర్, 7300 rpm వద్ద 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 161 కేజీల బరువున్న ఈ బైక్ ధర రూ. 97720 మాత్రమే. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్.. రైడర్లకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతాయి. కాబట్టి ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

సుజుకి జిక్సర్ 250 (Suzuki Gixxer 250)

రూ.1.8 లక్షల ధర వద్ద లభించే.. ‘జిక్సర్ 250’ కూడా చెప్పుకోదగ్గ బైక్. 156 కేజీల బరువున్న ఈ బైక్.. 249 సీసీ ఇంజిన్ కలిగి.. 9300 rpm వద్ద 26.5 పీఎస్ పవర్, 7300 rpm వద్ద 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైకులకు అంత డిమాండ్ లేకపోవడం గమనార్హం.

ట్రయంఫ్ స్పీడ్ టీ4 (Triumph Speed T4)

ఎక్కువమందికి ఇష్టమైన బైకుల జాబితాలో ‘ట్రయంఫ్ స్పీడ్ టీ4’ ఒకటి. ఇది 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 31 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ బైక్.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, సుదూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆమె ఆస్తి రూ.4600 కోట్లు!

పైన చెప్పుకున్న బైక్స్ మాత్రమే కాకుండా.. రూ. 1.80 లక్షల వద్ద లభించే, హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250R), రూ. 1.85 లక్షల వద్ద లభించే బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ (Bajaj Pulsar NS400Z) మరియు రూ. 2.03 లక్షల వద్ద అందుబాటులో ఉన్న కేటీఎమ్ 200 డ్యూక్ (KTM 200 Duke) వంటివి కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైకులు (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles