ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

Best CNG Car Under Rs.10 Lakh in India: కొంత తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి సీఎన్‌జీ వాహనాలు ఉత్తమ ఎంపిక. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా ఈ సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను సీఎన్‌జీ విభాగంలోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఎక్కువ ధర ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపే అవకాశం తక్కువ. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద.. అందుబాటులో ఉన్న బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Swift CNG)

భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. అలాంటి ఈ కారు ప్రస్తుతం సీఎన్‌జీ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఈ మోడల్ కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ.. జెడ్12ఈ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.58 పీఎస్ పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియయు 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది సీఎన్‌జీ రూపంలో.. 69.75 పీఎస్ పవర్, 101.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది.

స్విఫ్ట్ సీఎన్‌జీ 32.85 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే సీఎన్‌జీ కారు ధరలు, పెట్రోల్ మోడల్ ధరల కంటే కొంత ఎక్కువే. కాబట్టి మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ ధర.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ. కాబట్టి దీని ప్రారంభ ధర రూ. 8,19,500గా (ఎక్స్ షోరూమ్) ఉంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)

నిజానికి టాటా మోటార్స్ అంటేనే.. ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ. కాబట్టి ఈ బ్రాండ్ కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సీఎన్‌జీ విభాగంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మరియు అత్యంత సురక్షితమైన మోడల్ ‘పంచ్ సీఎన్‌జీ’. ఇది మైక్రో SUV అయినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం అద్భుతాలు సృష్టించింది.

టాటా పంచ్ కేవలం నాలుగు సంవత్సరాల్లో 500000 అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2024లో 202031 యూనిట్ల అమ్మకాలతో.. భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ క్రియేట్ చేసి.. హ్యుందాయ్ కంపెనీని సైతం వెనక్కి నెట్టింది.

ఇక పంచ్ సీఎన్‌జీ విషయానికి వస్తే.. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 87.8 పీఎస్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతాయి.

Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

టాటా పంచ్ కారు సీఎన్‌జీ రూపంలో 73.5 పీఎస్ పవర్, 103 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది. ఇది డ్యూయెల్ సీఎన్‌జీ సిలిండర్స్ పొందుతుంది. కాబట్టి బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. టాటా పంచ్ సీఎన్‌జీ 27 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7,29,990 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ (Hyundai Aura CNG)

భారతదేశంలోని అత్యుత్తమ సీఎన్‌జీ కార్లలో హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ కూడా ఒకటి. రూ. 7,54,800 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఆరా సీఎన్‌జీ.. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 పీఎస్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. సీఎన్‌జీ వేరియంట్ 69 పీఎస్ పవర్, 95.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది.

Also Read: జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

ఇండియన్ మార్కెట్లోని సీఎన్‌జీ బ్రాండ్స్

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు అన్ని కంపెనీలు సీఎన్‌జీ విభాగాలోకి ప్రవేశించాయి. ఇందులో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ వంటి కార్ల తయారీదారులతో పాటు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు టూవీలర్లను కూడా సీఎన్‌జీ విభాగంలోకి లాంచ్ చేస్తున్నాయి. సీఎన్‌జీ టూవీలర్స్ అమ్మకాలు కూడా ఇండియన్ మార్కెట్లో ఆశాజనకంగానే ఉన్నాయి.

సాధారణంగా సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే.. బూట్ స్పేస్ భాగంలో కంపెనీలు సీఎన్‌జీ సిలిండర్లను ఉంచడం వల్ల.. అక్కడ బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే బూట్ స్పేస్ పెంచడానికి.. కంపెనీ డ్యూయెల్ సిలిండర్లను అందిస్తుంది. వీటిని కారు యొక్క ముందు భాగంలో ఫిక్స్ చేయడం వల్ల బూట్ స్పేస్ సాధారణ కార్లలో లభించినట్లే.. లభిస్తుంది. మంచి మైలేజ్, ఎక్కువ బూట్ స్పేస్ వంటివి కలిగి ఉండటం వల్ల కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారిలో చాలామంది సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Leave a Comment