Best Scooters For Daily Use in India: ఆధునిక కాలంలో బతుకు బండి నడవాలన్నా.. తప్పకుండా బండి (వెహికల్) ఉండాల్సిందే!. ఈ రోజుల్లో కార్లు మరియు బైకులు ప్రజల జీవన విధానంలో ఓ భాగమైపోతున్నాయి. దీంతో చాలామంది నడిచి వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చిన్న దూరాలకు కూడా వాహనాలను ఉపయోగించే స్థితికి చేరుకున్నారు. చిన్న దూరాలకు కూడా వాహనాలు ఉపయోగించడం బాగానే ఉంది. కానీ ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేస్తే.. రోజువారీ ఉపయోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ కథనంలో రోజువారీ వినియోగానికి సరసమైన ధర వద్ద లభించే స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం.
హీరో డెస్టినీ 125
నిజానికి రోజువారీ ఉపయోగానికి ఉత్తమైన స్కూటర్లు ఏవి అంటే.. అందులో తప్పకుండా డెస్టినీ 125 ఉండాల్సిందే. రూ. 81728 నుంచి రూ. 87518 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇది 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 9.12 పీఎస్ పవర్ మరియు 10.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
హీరో డెస్టినీ 125 స్కూటర్ 50 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బూట్ లాంప్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో డిస్క్ బ్రేక్స్ మరియు డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. 10-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్‌లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
హోండా యాక్టివా 125
భారతదేశంలో ఎక్కువ అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో చెప్పుకోదగ్గది హోండా యాక్టివా 125. రూ. 83084 నుంచి రూ. 92257 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.3 పీఎస్ పవర్ మరియు 10.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.
హోండా యాక్టివా 125 స్కూటర్ 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. 109 కేజీల బరువున్న ఈ స్కూటర్ 5.3 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఇది అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125
రూ. 82586 నుంచి రూ. 94082 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ కూడా రోజువారీ ఉపయోగానికి బెస్ట్ స్కూటర్. ఇందులో 124 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.7 పీఎస్ పవర్ మరియు 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి డిజైన్ కలిగిన ఈ స్కూటర్, ఆధునిక కాలంలో రోజువారీ ఉపయోగానికి కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 45 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, సెమీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్, సుజుకి రైడ్ కనెక్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడింగ్ సమయంలో ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ డిస్క్ బ్రేక్ మరియు డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో టెలిస్కోపిక్ పోర్క్ కూడా ఉంటుంది.
Don’t Miss: ఇండియాలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. దీని గురించే తెలిస్తే షాకవుతారు!
పైన చెప్పుకున్న బైకులు మాత్రమే కాకుండా.. ఇతర బైకులు కూడా ఉన్నాయి. కాబట్టి రోజువారీ వినియోగానికి ఓ మంచి స్కూటర్ కావాలనుకునే వ్యక్తులు తమకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. దీనికోసం మీ సమీపంలోని వెహికల్ డీలర్షిప్ లేదా వెబ్‌సైట్‌లలో కూడా తనిఖీ చేయవచ్చు. ఇందులో ఎక్కువ ధర వద్ద లభించే స్కూటర్లు, సరసమైన ధర వద్ద లభించే స్కూటర్లు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. అయితే ఏ స్కూటర్ కావాలనే విషయాన్ని కొనుగోలుదారు నిర్ణయించుకోవాలి.