Biggest Discounts On Midsize SUVs in India Festive Season: భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభామైపోయింది. ఈ సమయంలో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలంటి వారి కోసం పలు కంపెనీలు గొప్ప డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం మొదలు పెట్టేశాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు జీప్ వంటి అనేక కంపెనీలు. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు కొనుగోలు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తుందని వివరాలు వివరంగా తెలుసుకుందాం..
జీప్ కంపాస్ (Jeep Compass)
అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ కంపెనీ తన ‘కంపాస్’ కొనుగోలుపైన ఏకంగా రూ. 3.15 లక్షల వరకు బెనిఫీట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్స్ ఉంది. ఇండియన్ మార్కెట్లో జీప్ కాంపస్ ధరలు రూ. 18.99 లక్షల నుంచి రూ. 28.33 లక్షల మధ్య ఉన్నాయి. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 170 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. టాప్ స్పెక్ జీప్ కాంపస్ యొక్క ఎస్ వేరియంట్ మాత్రమే 4×4 ఆప్షన్ పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)
కొత్త కార్లు కొనాలనుకునేవారి కోసం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా తన టైగన్ కారు మీద రూ. 3.07 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా 2023 మోడల్ టైగన్ 1.5 జీటీ మీద గరిష్ట తగ్గింపులు లభిస్తాయి. 1.0 లీటర్ ఇంజిన్ 2024 మోడల్ మీద రూ. 60000 నుంచి రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రూ. 11.70 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారు దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, టాటా కర్వ్ మరియు సిట్రోయెన్ బసాల్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయినప్పటికీ.. ఈ కారు ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతూనే ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400)
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ400 కొనుగోలు మీద కూడా రూ. 3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మహీంద్రా యొక్క ఏకైన ఎలక్ట్రిక్ మోడల్ అయిన ఈ కారు ధరలు రూ. 16.74 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మరియు ఎంజీ విండ్సర్ ఈవీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400.. 39.4 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 456 కిమీ రేంజ్ అందిస్తుంది.
జీప్ మెరిడియన్ (Jeep Meridian)
మెరిడియన్ కారు మీద కంపెనీ రూ. 2.8 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 30 లక్షల నుంచి రూ. 37.14 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న ఈ 7 సీటర్ జీప్ కారు దేశీయ మార్కెట్లో స్కోడా కొడియాక్ కారుకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలకు, సెలబ్రిటీలకు ఇష్టమైన జీప్ బ్రాండ్ ఈ మెరిడియన్ అని తెలుస్తోంది.
టాటా సఫారీ (Tata Safari)
భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ యొక్క సఫారీ కొనుగోలు మీద రూ. 1.65 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. సఫారీ యొక్క మిడ్ స్పెక్ ప్యూర్ ప్లస్ ఎస్ మరియు ప్యూర్ ప్లస్ ఎస్ డార్క్ వేరియంట్ల కొనుగోలుపైన అధిక ప్రయోజనాలను పొందవచ్చు. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతాయి. రూ. 15.49 లక్షల నుంచి రూ. 27.34 లక్షల ధర మధ్య అందుబాటులో ఉన్న సఫారీ ఇండియన్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
టాటా హారియర్ (Tata Harrier)
హారియర్ కారు కొనుగోలుపైన కంపెనీ రూ. 1.45 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. హారియర్ 5 సీటర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. 2023 మోడల్ మీద అదనంగా రూ. 25000 తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ధరలు దేశీయ విఫణిలో రూ. 14.99 లక్షల నుంచి రూ. 26.44 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ700, జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కియా సెల్టోస్ (Kia Seltos)
భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న కియా కంపెనీ యొక్క సెల్టోస్ మీద రూ. 1.3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా యాక్ససరీస్ ప్యాకేజ్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా కర్వ్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
కియా సెల్టోస్ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు సీవీటీ ఆప్షన్స్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఐఎంటీ మరియు డ్యూయెల్ క్లచ్ ఆప్షన్ పొందుతుంది. మార్కెట్లో సెల్టోస్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.37 లక్షల మధ్య ఉన్నాయి.
మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)
దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్న మారుతి గ్రాండ్ విటారా కొనుగోలుపైన కూడా కస్టమర్లు రూ. 1.28 లక్షల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు ధరలు రూ. 18.43 లక్షలు రూ. 19.93 లక్షల మధ్య ఉంటుంది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ మరియు CNG రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
హ్యుందాయ్ ఆల్కజార్ (Hyundai Alcazar)
ఆల్కజర్ కొనుగోలుపైన హ్యుందాయ్ కంపెనీ రూ. 90000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా కంపెనీ యొక్క ఆల్కజార్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.
హోండా ఎలివేట్ (Honda Elevate)
ఇక చివరగా హోండా కంపెనీ కూడా తన ఎలివేటర్ కారు కొనుగోలుపైనా రూ. 75000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ తగ్గింపులు 2024 ఏప్రిల్ ముందు వరకు తయారు చేయబడిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.51 లక్షల మధ్య ఉన్నాయి. హోండా ఎలివేట్ మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Don’t Miss: ఒలంపిక్ విజేత ‘మను భాకర్’కు ఖరీదైన గిఫ్ట్.. ఇది ఇండియాలోనే ఫస్ట్!
గమనిక: ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద మంచి తగ్గింపులు అందిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు లేదా డిస్కౌంట్స్ అనేవి నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే కంపెనీ యొక్క అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం.