29.2 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 13

ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

0

Sara Tendulkar Car Collection: సచిన్ టెండూల్కర్ గురించి తెలిసిన అందరికీ.. సారా టెండూల్కర్ గురించి తెలిసే ఉంటుంది. లండల్లో చదువుకున్న సారా ఇటీవల కొత్త బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయాన్ని సచిన్ అధికారికంగా వెల్లడించారు.

టీమిండియా క్రికెటర్ సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్.. లండన్‌లో చదువుకున్నప్పటికీ ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ (STF) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వైద్య రంగంకు అనుభవం ఉన్న సారా.. ఈ ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తోంది. వారికి మెరుగైన విద్యాప్రమాణాలను అందించడానికి కృషి చేస్తోంది.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ (STF Foundation)

చదువుతో పాటు.. క్రీడారంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడమే ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ ఫౌండేషన్ బాధ్యతలను సారా టెండూల్కర్ తీసుకున్నారు. ఈ ఫౌండేషన్‌లో యువ ఇండియా, హై 5 యూత్ ఫౌండేషన్, ఐఎన్‌జీఏ, ముకుందా హాస్పటల్స్, మన్‌దేశి ఛాంపియన్, బేసిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఏకం ఫౌండేషన్, పరివార్, విద్యా వికాస్ యోజన, శ్రీజ మరియు ది సొసైటీ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ క్రిపల్ట్ వంటి స్వచ్చంద సంస్థలు ఇందులో భాగస్వామిగా ఉన్నాయి.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. పేద పిల్లల కోసం ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి ఎస్‌టీఎఫ్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

సారా టెండూల్కర్ కార్లు (Sara Tendulkar Cars)

తండ్రి బాటలోనే సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి కంకణం కట్టుకున్న సారా టెండూల్కర్ ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తుంది. సారా ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8), బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) మొదలైనవి ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఐ8

భారతదేశంలోని అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లలో ఐ8 కూడా ఒకటి. ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 2.62 కోట్లు (ఎక్స్ షోరూమ్). చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ కారు 1499 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 357 Bhp పవర్ మరియు 570 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8) అత్యుత్తమ ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎం6

రూ. 1.75 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) కారు కూడా సారా టెండూల్కట్ ఉపయోగిస్తుందని సమాచారం. ఇది 4395 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 560 Bhp పవర్ మరియు 680 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

నిజానికి ఈ కార్లను సారా టెండూల్కర్ కొనుగోలు చేసిందా? లేక.. తన తండ్రి కార్లను ఉపయోగిస్తోందా? అనే విషయం మీద స్పష్టత లేదు. ఎందుకంటే సచిన్ గ్యారేజిలో లెక్కకు మించిన లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా సచిన్ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఈ కారణంగానే వీరి గ్యారేజిలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్ గ్యారేజిలోని కార్లు (Sachin Tendulkar Car Collection)

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ సీ36 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం5 30జహ్రే, బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, బీఎండబ్ల్యూ ఎం6 గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్ఐ, ఫెరారీ 360 మోడెన, నిస్సాన్ జీటీఆర్ మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ సచిన్ మొట్ట మొదటి కారు మారుతి సుజుకి 800 (Maruti Suzuki 800) అని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. ఫియట్ కారు కూడా సచిన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

0

PV Sindhu Cars And Married Details: పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు).. క్రీడారంగంలో ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే 2016లో జరిగిన రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పతాకాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారతీయ మహిళగా సింధు ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత 2020 టోక్యోలో జరిగి ఒలంపిక్ క్రీడల్లో కూడా ఈమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని సింధు తండ్రి రమణ అధికారికంగా వెల్లడించారు.

సింధు పెళ్లి

పీవీ సింధు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి.. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయి అని తెలుస్తోంది. ఈయన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చాలా కాలం పరిచయం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న (డిసెంబర్ 22) వీరి పెళ్లి ఉద‌య్‌పూర్‌లో జరుగుతుంది. ఆ తరువాత 24వ తేదీ హైదరాబాద్‌లోనే రిసెప్షన్ జరగనుంది.

కేవలం క్రీడాకారిణిగానే తెలిసిన చాలామందికి సింధు ఖరీదైన కార్లను ఉపయోగిస్తుందని.. బహుశా తెలిసుండకపోవచ్చు. ఈమె ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 320డీ మరియు మహీంద్రా థార్ వంటి కార్లు ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5)

ఎక్కువమంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఎక్కువగా ఇష్టపడే కార్ బ్రాండ్లలో బీఎండబ్ల్యూ ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఎక్స్5 కారు సింధు గ్యారేజిలో ఉంది. దీనిని నటుడు అక్కినేని నాగార్జున ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 75 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును సునీల్ శెట్టి, సచిన్ టెండూల్కర్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.

పీవీ సింధు ఉపయోగించే ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 అద్భుతమైన డిజైన్ కలిగి.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. అయితే పీవీ సింధు ఉపయోగించే కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందనేది వెల్లడికాలేదు. ఈ కారు ప్రయాణికుల భద్రతకు కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

బీఎండబ్ల్యూ 320డీ (BMW 320D)

పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో బీఎండబ్ల్యూ కారు 320డీ. ఈ కారు ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. దీనిని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒలంపిక్స్ క్రీడలలో మెడల్ సాధించినందుకు సచిన్ ఈ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కృతి సనన్ కూడా ఒకరు. ఇప్పటికే ఈమె ఈ కారును రోజువారీ వినియోగం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎక్కువమంది ప్రముఖులు ఇష్టపడే కార్లలో బీఎండబ్ల్యూ ఒకటి. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇవి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ఇది అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. ఈ కారణంగానే చాలామంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

మహీంద్రా థార్ (Mahindra Thar)

పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో కారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కూడా ఒకటి. దీనిని దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అందించారు. భారతదేశంలో మహీంద్రా థార్ కారుకు అమితమైన ప్రజాదరణ ఉంది. ఇప్పటికే లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. అయితే సింధు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినందుకు ఆనంద్ మహీంద్రా థార్ కారును గిఫ్ట్ ఇచ్చారు.

మహీంద్రా థార్ రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. అద్భుతమైన పనితీరును అందించే మహీంద్రా థార్.. ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు 5 డోర్ రూపంలో (థార్ రోక్స్) కూడా అమ్మకానికి ఉంది. ఇది కూడా గొప్ప అమ్మకాలను పొందుతోంది.

ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఎంజీ మోటార్: కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

0

MG Cyberster Launch Confirmed India: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత పాపులర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించిన ‘ఎంజీ మోటార్’ (MG Motor) మార్కెట్లో ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త మోడల్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని 2025 జనవరిలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఆ కారు ఏది? దాని వివరాలు ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మొట్ట మొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కారు పేరు ‘సైబర్‌స్టర్’ (MG Cyberster). ఈ ఏడాది మార్చిలో ఆవిష్కరించబడిన ఈ కారు.. కంపెనీ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. దీనిని సంస్థ ప్రీమియం ఎంజీ సెలక్ట్ రిటైల్స్ ద్వారా విక్రయించనుంది. అంతే కాకుండా జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ప్రారంభంలో దేశవ్యాప్తంగా.. 12 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను కలిగి ఉండనుంది. ఆ తరువాత వీటి సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం.

నిజానికి సైబర్‌స్టర్ 2023 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ప్రారంభించబడింది. అంతకంటే ముందు ఇది 2021లో ఒక కాన్సెప్ట్ రూపంలో దర్శనమిచ్చింది. త్వరలో లాంచ్ కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు 4533 మిమీ పొడవు, 1912 మిమీ వెడల్పు, 1328 మిమీ ఎత్తు మరియు 2689 మిమీ వీల్‌బేస్ పొందుతుంది.

ప్రస్తుతం ఎంజీ సైబర్‌స్టర్ కారు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి ఉన్నట్లు సమాచారం. ఇది రెండు బ్యాటరీ ఫ్యాక్స్, రెండు మోటార్స్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ ఒకే రియర్ యాక్సిల్ మౌంటెడ్ 308 హార్స్ పవర్ అందించే మోటారును పొందుతుంది. ఇందులోని 64 కిలోవాట్ బ్యాటరీ 520 కిమీ రేంజ్ అందిస్తుంది.

సైబర్‌స్టర్ రేంజ్

టాప్ రేంజ్ మోడల్ సైబర్‌స్టర్ కారు రెండు మోటార్లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ 544 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారులోని 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్.. ఒక సింగిల్ ఛార్జీతో 580 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎంజీ మోటార్ కంపెనీ ఈ కారును భారతదేశంలో తయారు చేయదు. కాబట్టి దీనిని భారతదేశానికి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుంది. అంతే కాకుండా ఈ కారులో జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ఏ బ్యాటరీని పొందు పరుస్తుంది, అది ఎంత రేంజ్ అందిస్తుంది.. అనే విషయాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే ఈ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.

సైబర్‌స్టర్ రేంజ్ మాత్రమే కాకుండా.. ధరలు కూడా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 75 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. చూడటానికి చాలా కొత్తగా ఉన్న ఈ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న బ్రాండ్ యొక్క ఇతర కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే ఇది ఒక్క చూపుతోనే ఆకర్శించే గుణాన్ని కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫీచర్లకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా పంచుకోలేదు.

Also Read: ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా: సరికొత్త డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

ఎంజీ సైబర్‌స్టర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే ఈ కారుకు దేశీయ విఫణిలో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ధర పరంగా.. బీవైడీ సీల్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు కియా ఈవీ6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

మార్కెట్లోని ఎంజీ మోటార్స్ కార్లు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎంజీ మోటార్ కంపెనీ జెడ్ ఎస్ ఈవీ (ZS EV), కామెట్ ఈవీ (Comet EV) వంటి ఎలక్ట్రిక్ కార్లను.. హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్ మరియు గ్లోస్టర్ వంటి ఫ్యూయెల్ కార్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ స్పోర్ట్ కారును (సైబర్‌స్టర్) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా తప్పకుండా ఉత్తమ అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

‘పుష్ప 2’ మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..

0

Pushpa 2 Movie Telugu Review: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా తెరమీదకు వచ్చేసింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలలో టికెట్స్ రేట్లు భారీగా పెరికినప్పటికీ అభిమానులు మాత్రమే తగ్గేదేలే అన్నట్లు.. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నారు. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

డైలాగ్స్ గూస్ బంప్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1 బ్లాక్ బ్లస్టర్ సాధించింది. పార్ట్ 2 విషయానికి వస్తే.. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. భార్య మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ.. ఓ వైపు మహిళలకు కూడా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలో డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

కథానాయకి పాత్రలో కనిపించిన శ్రీవల్లి.. కూడా ప్రేక్షకులను మెప్పించింది. పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అంటూ మాస్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ప్రత్యేకం అని చెప్పాల్సిందే. ఇక కిస్సిక్ అంటూ ఐటం సాంగులో కనిపించిన శ్రీలీల అభిమానులను ఉర్రూతలూగించింది. కనిపించింది ఒక్కపాటలో అయినప్పటికీ.. ఈమె డ్యాన్స్‌కి అందరూ ఫిదా అవుతారు.

అగ్ర తారలు మాత్రమే కాకుండా.. అనసూయ, సునీల్ మరియు కేశవ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఐటం సాంగ్ విషయంలో మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 కంటే.. పుష్ప 2లోని ఐటం సాంగ్ పెద్దగా మెప్పించలేదనే తెలుస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున ఖాతాలో మరో బ్లాక్ బ్లాస్టర్ ఖాయమని తెలుస్తోంది.

శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

0

Rashmika Mandanna Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ పుష్ప 2 (Pushpa 2). రేపు తెరమీదకి రానున్న ఈ సినిమా కోసం అటు అల్లు అర్జున ఫ్యాన్స్, ఇటువైపు రష్మిక మందన్న అభిమానులు మాత్రమే కాకుండా ఐటమ్ సాంగుతో అదరగొట్టిన శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో నటి.. నేషనల్ క్రష్ రష్మిక గురించి.. ఆమె ఉపయోగించే కార్లను గురించి వివరంగా ఇక్కడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఛలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత భీష్మ, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల్లో నటిస్తూ లెక్కకు మించిన అభిమానులను సొంతం చేసుకుంది. పుష్ప సినిమాతో మరింత ఫేమస్ అయిన తరువాత.. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా రేపు (డిసెంబర్ 4) వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంది.

సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. రష్మిక మందున్నకు ఖరీదైన కార్లను ఉపయోగించడం పట్ల కూడా ఎక్కువ అభిరుచి ఉంది. ఈ కారణంగానే.. ఈమె ఎప్పటికప్పుడు తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రష్మిక గ్యారేజిలో రేంజ్ రోవర్ స్పోర్ట్స్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్, టయోట ఇన్నోవా మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్లను కలిగి ఉంది.

రష్మిక మందన్న కార్ కలెక్షన్ (Rashmika Mandanna Car Collection)

నటి రష్మిక ఉపయోగించే కార్లలో ఖరీదైన కారు.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport). దీని ధర రూ. 1.40 కోట్లు. ఈ కారును రష్మిక 2021లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారు లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఈ కారు చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఈ కారు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో మరో ఖరీదైన కారు ఆడి క్యూ3 (Audi Q3). దీని ధర దాదాపు రూ. 50 లక్షల వరకు ఉంటుంది. రష్మిక ఆడి కారు ఎరుపు రంగులో ఉంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. సరికొత్త డిజైన్ పొందుతుంది. 1984 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 187.74 Bhp పవర్ మరియు 320 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు యొక్క సీటింగ్ కెపాసిటీ 5. ఇది రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

Also Read: మనసులో మాట చెప్పిన పుష్ప 2 నటుడు: సమయం దొరికితే..

మెర్సిడెస్ బెంజ్ చెందిన సీ క్లాస్ (Mercedes Benz C Class) కూడా రష్మిక గ్యారేజిలో ఉంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షలు. చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే రష్మిక కూడా బెంజ్ కారును ఉపయోగిస్తోంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో చాలామంది తారలు బెంజ్ కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఇందులో రష్మిక మందన్న కూడా ఒకరు.

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కార్లు కూడా రష్మిక మందన్న గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా ధర రూ. 20 లక్షలు కాగా.. క్రెటా ధర రూ. 11 లక్షలు. ఇవి రెండూ కూడా భారతీయ మార్కట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్లు. రష్మిక మందన్న తొలి రోజుల్లో ఈ కార్లను ఉపయోగించేది సమాచారం.

రష్మిక నెట్‍వర్త్ మరియు రెమ్యునరేషన్ (Rashmika Mandanna Networth & Remuneration)

నటి రష్మిక మందన్న మొత్తం నెట్‍వర్త్ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈమె ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమె ఖరీదైన బంగ్లా వంటివి కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.

మనసులో మాట చెప్పిన పుష్ప 2 నటుడు: సమయం దొరికితే..

0

Pushpa 2 Actor Fahadh Faasil Car Collection: మలయాళం సినిమాల్లో మాత్రమే కాకుండా.. పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయిన నటుడు ‘ఫహద్ ఫాసిల్’ అందరికీ సుపరిచయమే. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలో కూడా నటించారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. కార్ డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టమని ఓ ఇంటర్వూలో స్వయంగా పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచే ఇతనికి కార్లంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టం తన తండ్రి వల్ల కలిగిందని పేర్కొన్నాడు. మమ్ముట్టి నడుపుతున్న టాటా ఎస్టేట్ మరియు ఫోర్డ్ ఎస్కార్ట్ వంటివి తన తండ్రికి చెందినవని కూడా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను పెరుగుతున్న కొద్దీ కార్ల మీద ప్రేమ కూడా మరింత ఎక్కువైందని ఫాసిల్ వివరించారు. అంతే కాకుండా చిత్ర పరిశ్రమలో ఎదగటానికి ముందు మారుతి ఎస్ఎక్స్4 (Maruti SX4) ఉపయోగించేవాడినని పేర్కొన్నారు.

సమయం దొరికినప్పుడల్లా..

చప్పా కురిషు సినిమా షూటింగ్ సమయంలో నటుడు వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి రోడ్ ట్రిప్‌లకు వెళ్లడం గురించి కూడా ఫాసిల్ వెల్లడించారు. ఒకప్పటి నుంచే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని, ఈ కారణంగానే ఎప్పుడుపడితే అప్పుడు.. సమయం దొరికినప్పుడల్లా.. స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాడినని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు లాంచ్ జర్నీ చేయాలంటే ముందుగానే ఓ ప్లాన్ వేసుకోవాలని ఆయన అన్నారు.

ఇప్పుడు నేను నా భార్య నజ్రియా (Nazriya)తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే.. తనకు కూడా లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికీ డ్రైవింగ్ పట్ల ఇష్టం ఉండటం వల్ల వీలు దొరికినప్పుడు లాంగ్ డ్రైవ్ వెల్తూ ఉంటామని ఫాసిల్ చెప్పారు. కొన్నిసార్లు అనుకోకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లడం మాకు మంచి థ్రిల్ ఇస్తుందని అన్నారు.

లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడే ఫాహిద్ ఫాసిల్.. ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఈయన గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే 911 కారేరా, మినీ కూపర్ కంట్రీమ్యాన్ మొదలైన కార్లు ఉన్నాయి.

ఫాహిద్ ఫాసిల్ కార్ కలెక్షన్ (Fahadh Faasil Car Collection)

నటుడు ఫాహిద్ ఫాసిల్ ఉపయోగించే కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG) ఒకటి. దీని ధర రూ. 4.6 కోట్లు. ఈ కారును ఇటీవలే తన భార్య నజ్రియాతో కలిసి డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనికి 6003 అనే ఒక వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వేయించారు.

అంబానీ వంటి ప్రముఖులు ఇప్పటికే ఈ తరహా కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కారు కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలోకి ఫాసిల్ కూడా చేరారు. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 585 Bhp పవర్, 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ కలిగి.. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం పొందుతుంది. కాబట్టి ఇది బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.

Also Read: కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేయడానికి ముందు.. ఫాహిద్ ఫాసిల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 (Land Rover Difender 90) ఉపయోగించేవారు. దీని ధర రూ. 1.04 కోట్లు (ఎక్స్ షోరూమ్). 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 518 Bhp పవర్ 625 Nm టార్క్ అందిస్తుంది. సుమారు 2.5 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 టాప్ స్పీడ్ 240 కిమీ.

ఫాహిద్ ఫాసిల్ గ్యారేజిలోని మరో కారు లంబోర్ఘిని కంపెనీకి చెందిన ఉరుస్ (Lamborghini Urus). దీని ధర రూ. 4 కోట్ల కంటే ఎక్కువ. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ద్వారా 650 పీఎస్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఉన్నాయి.

నటుడు ఫాసిల్ గ్యారేజిలోని మరో కారు పోర్స్చే 911 కారేరా ఎస్ (Porsche Carrera S). దీని ధర రూ. 2 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇది 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 3.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ సిక్స్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 448 పీఎస్ పవర్ మరియు 530 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది.

బాబా రామ్‌దేవ్ మనసు దోచిన మహీంద్రా కారు ఇదే.. వీడియో

0

Baba Ramdev Driving Mahindra Thar Roxx: ప్రముఖ యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన ‘బాబా రామ్‌దేవ్’ (Baba Ramdev) గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. ఈయన యోగా గురువు మాత్రమే కాదు.. పతంజలి బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈయనకు కార్లు, బైకులు నడపడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే.. గతంలో చాలా సందర్భాల్లో ఖరీదైన కార్లను, బైకులను నడిపారు. ఇప్పుడు తాజాగా మరో కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇంతకీ బాబా రామ్‌దేవ్ డ్రైవ్ చేసిన కారు ఏది? దాని వివరాలు ఏమిటంటే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

వీడియోలో గమనించినట్లయితే.. బాబా రామ్‌దేవ్ కారును డ్రైవ్ చేయడం చూడవచ్చు. ఇక్కడ కనిపించే కారు మహీంద్రా కంపెనీకి చెందిన 5 డోర్ వెర్షన్ రోక్స్ అని తెలుస్తోంది. ఈ కారు నలుపు రంగులో చూడచక్కగా ఉండటం చూడవచ్చు. ఆశ్రమం కాంపౌండ్‌లోనే కారును డ్రైవ్ చేసినట్లు సమాచారం. కొంత దూరం డ్రైవ్ చేసిన తరువాత కారును ఆపడం చూడవచ్చు.

మహీంద్రా థార్ రోక్స్ కారును బాబా రామ్‌దేవ్ కొన్నారా?

మహీంద్రా కారును డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిని బాబా కొనుగోలు చేసారా? అనే సందేహం కలుగవచ్చు. కానీ ఈ కారును బాబా రామ్‌దేవ్ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. ఇది ఎవరో సన్నిహితులకు సంబంధించిన కారు అని సమాచారం. దానిని బాబా టెస్ట్ డ్రైవ్ చేశారు.

థార్ రోక్స్ గురించి (About Mahindra Roxx)

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన 5 డోర్ థార్ ఈ రోక్స్. ఇప్పటికే దేశీయ మార్కెట్లో విస్తృత ఆదరణ పొందిన మహీంద్రా థార్ కారును 5 డోర్ రూపంలో కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ దీనిని లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఆరు వేరియంట్లలో మార్కెట్లో విక్రయించబడుతున్న రోక్స్ కారు.. మొత్తం ఏడు రంగులలో లభిస్తోంది. మంచి డిజైన్, కాస్మొటిక్ అప్డేట్స్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా థార్ రోక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పనితీరు పరంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బాబా రామ్‌దేవ్ కారు (Baba Ramdev Cars)

యోగ గురువు బాబా రామ్‌దేవ్ రూ. 1.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 (Land Rover Defender 130) కారును కలిగి ఉన్నట్లు సమాచారం. దీనిని గత ఏడాది జులైలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారును రామ్‌దేవ్ బాబా గతంలో డ్రైవ్ చేస్తూ కనిపించారు. చూడటానికి అత్యద్భుతంగా ఉన్న ఈ కారు ఏ ఇంజిన్ ఆప్షన్ అనేది వెల్లడి కాలేదు.

Also Read: కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు రెండు ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. అవి 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (394 బీహెచ్‌పీ పవర్ మరియు 550 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 3.0 డీజిల్ ఇంజిన్ (296 బీహెచ్‌పీ & 600 ఎన్ఎమ్ టార్క్). ఇవి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి.

బాబా రామ్‌దేవ్ వద్ద ఉన్న మరో కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారును కొనుగోలు చేయడానికంటే ముందు.. బాబా ఈ కారును ఉపయోగించేవారు. ఈ కావు తెలుపు రంగులో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 13.99 లక్షల నుంచి రూ. 25.64 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి భద్రతను అందిస్తాయి.

బైక్ రైడ్ చేసిన బాబా రామ్‌దేవ్

కార్లను మాత్రమే కాకుండా.. బైకులను డ్రైవ్ చేయడానికి కూడా బాబాకు చాలా ఇష్టం. ఈ కారణంగానే అప్పుడప్పుడు బైక్ రైడ్ చేస్తూ ఉంటారు. గతంలో హీరో ఇంపల్స్ బైక్ రైడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. బాబా రామ్‌దేవ్.. సద్గురు (జగ్గీ వాసుదేవ్)తో కలిసి డుకాటీ బైకుపై కనిపించారు. దీన్ని బట్టి చూస్తే బాబాకు కార్లు మరియు బైకుల మీద ఎంత మక్కువో మనం అర్థం చేసుకోవచ్చు.

కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

1

Akkineni Nagarjuna New Car Lexus LM: ఓ వైపు పెద్ద కొడుకు (నాగ చైతన్య) పెళ్లి, మరో వైపు చిన్న కొడుకు (అఖిల్) నిశ్చితార్థం. కుటుంబం మొత్తం సంతోషంగా గడిపేస్తోంది. త్వరలో ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకి అడుగు పెద్దబోతున్నారని నాగార్జున దంపతులు కూడా సంబరపడిపోతున్నారు. ఈ తరుణంలో కోడళ్ళకంటే ముందు మరో అతిథి అక్కినేని ఇంట చేరింది. ఇంతకీ ఎవ్వరికీ తెలియని ఆ అతిథి ఎవరు? అనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.

నాగార్జున ఇంట చేరిన ఆ అతిథి ఎవరో కాదు.. లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎమ్ (Lexus LM) కారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింగ్ నాగార్జున.. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏ (RTA) కార్యాలకాయానికి వెళ్లారు. దీనికి TG9 GT/R4874 నెంబర్ తీసుకున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు కాబట్టి బహుశా దీనికి పెద్దగా ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది.

సీటింగ్ ఆప్షన్స్

నిజానికి లెక్సస్ ఎల్ఎమ్ లిమోసిన్ కారు 7 సీటర్ మరియు 4 సీటర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. 4 సీటర్ కారు ధర 7 సీటర్ కారు ధర కంటే తక్కువ. సాధారణంగా ఎక్కడైన 7 సీటర్ కారు ధర ఎక్కువగా ఉంటుంది, 4 సీటర్ ధర తక్కువగా ఉంటుంది. కానీ లెక్సస్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది.

డిజైన్

లెక్సస్ ఎల్ఎం అనేది టయోటా వెల్‍ఫైర్ మాదిరిగా జీఏ-కే మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో స్పిండిల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫాగ్‌లాంప్ కోసం వర్టికల్ హోసింగ్ మరియు వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో బ్రాండ్ లోగోను బదులుగా లెక్సస్ అనే అక్షరాలను చూడవచ్చు. వెనుక డోరు స్లైడింగ్ సెటప్ పొందుతుంది.

ఫీచర్స్

విశాలమైన క్యాబిన్ కలిగిన లెక్సస్ ఎల్ఎమ్ కారు 5130 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు, 1945 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. 4 సీట్ వెర్షన్‌లో ముందు మరియు వెనుక ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌ల మధ్య విభజన ఉంటుంది. ఎయిర్‌లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సరౌండ్ ఆడియో సిస్టం, పిల్లో స్టైల్ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

Also Read: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, మల్టిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్స్, రీడింగ్ లైట్స్, ఫ్రిడ్జ్, రియర్ గ్లోవ్ బాక్స్, యాక్టివ్ నాయిస్ కంట్రోల్ మరియు డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ మరియు ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ లెక్సస్ ఎల్ఎమ్ కారులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భద్రతను నిర్థారిస్తాయి.

ఇంజిన్ వివరాలు

లెక్సస్ ఎల్ఎం అనేది 2.5 లీటర్ 4 సిలిండర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 హార్స్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఈసీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. కాబట్టి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇప్పటికే ఈ కారు కొన్న సెలబ్రిటీలు

నాగార్జున 7 సీటర్ కారును కొన్నారా? లేక 4 సీటర్ కారును కొన్నారా అనేది వెల్లడి కాలేదు. అయితే ఇప్పటికే ఈ ఖరీదైన కారును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజయ్ కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఎమ్ కూడా ఒకటిగా మారినట్లు తెలుస్తోంది.

నాగార్జున కార్ కలెక్షన్

కార్లంటే ఎక్కువ ఇష్టపడే సెలబ్రిటీలతో నాగార్జున కూడా ఒకరు. ఇప్పటికే కింగ్ నాగ్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ7, బీఎండబ్ల్యూ ఎం6, టయోటా వెల్‌ఫైర్, నిస్సాన్ జీటీ ఆర్, రేంజ్ రోవర్ వోగ్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్450, కియా ఈవీ6 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లెక్సస్ ఎల్ఎమ్ కారు చేరింది.

రూ.1.5 కోట్ల కారు కొన్న అలనాటి తార.. ఫోటోలు చూశారా?

0

Karishma Kapoor Mercedes Benz: సినీ ప్రపంచంలో ‘కరిష్మా కపూర్’ గురించి తెలియని వారు ఉండరు. ఈమె ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన ఆ లగ్జరీ కారు ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన జర్మన్ బ్రాండ్ లగ్జరీ కారు పేరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450. దీని ధర రూ. 1.5 కోట్లు. ఈ కారును ఉపయోగించడానికంటే ముందు ఈమె ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారులో తిరుగుతూ కనిపించేది. ఇప్పుడు బెంజ్ కారును కొనుగోలు చేయడంతో ఈ కారులో కనిపించింది.

కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుకు కూడా.. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ కారుకు మాదిరిగానే, అదే 7774 వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి ఉండటం చూడవచ్చు. అంటే ఈమె తన బెంజ్ కారు కోసం కూడా ఈ వీఐపీ నెంబర్ కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా ఇది ఆమె లక్కీ నెంబర్ అని కూడా అర్థమవుతోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన బెంజ్ కారు పోలార్ వైట్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు.. ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ (Mercedes Benz GLE 450 4MATIC) కారు ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అదే పరిమాణంలో ఉండే ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్, హ్యాండ్ ఫ్రీ పార్కింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, లెదర్ ర్యాప్డ్ సీట్లు, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

Also Read: టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

నటి కరిష్మా కపూర్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ యొక్క టాప్ వేరియంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కాబట్టి ఇది 3.0 లీటర్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 365 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 245 పీఎస్ పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్స్ మంచి పనితీరును అందిస్తాయని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కార్లను కలిగిన సెలబ్రిటీలు

నటి కరిష్మా కపూర్ మాత్రమే కాకుండా.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారును కొనుగోలు చేశారు. ఈ జాబితాలో టెలివిజన్ నటి మోనా సింగ్, బాలీవుడ్ స్టార్ ఫాతిమా సనా షేక్, సాయి తమ్‌హంకర్, రిచా చద్దా, బోమన్ ఇరానీ మరియు సోహా అలీ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.

సినీతారలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి కారణం

నిజానికి లగ్జరీ కార్లంటే ఎవ్వరికైనా ఇష్టమే. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా లగ్జరీ కార్లు వ్యక్తి యొక్క స్టేటస్ తెలియజేస్తాయి. ఈ కారణంగానే పలువురు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొంత తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేసి రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న సంగతి మరచిపోకూడదు. సింపుల్ లైఫ్ గడపడంలో భాగంగానే డబ్బు ఉన్నప్పటికీ.. వాహనాలు కోసం వీరు ఎక్కువ డబ్బు వెచ్చించరు.

ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా: సరికొత్త డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

0

Mahindra BE 6e And XEV 9e Launched: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన హవా నిరూపించుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ రోజు ‘బీఈ 6ఈ’ (BE 6e) కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 18.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

బీఈ 6ఈ డెలివరీలు ఎప్పుడంటే..

మహీంద్రా లాంచ్ చేసిన బీఈ 6ఈ ప్రొడక్షన్ మోడల్.. ఇది ఈ మోడల్ యొక్క మొదటి కారు. కంపెనీ త్వరలోనే దీని ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. డెలివరీలు 2025 మార్చి నాటికి ప్రారంభమవుతాయి. అయితే.. ఈ కారు చూడటానికి ఇప్పటికి మార్కెట్లో ఉన్న ఇతర మహీంద్రా కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

కొత్త డిజైన్..

బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు జే-షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ మరియు ఫ్రంట్ ఫాసియాపైన హెడ్‌ల్యాంప్‌ల మధ్య ఫ్లోటింగ్ ఏరోడైనమిక్ ప్యానెల్ వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు చూడవచ్చు. యాంగ్యులర్ రేక్డ్ రియర్ విండ్‌స్క్రీన్ వెనుక భాగంలో ఉన్నాయి. అంతే కాకుండా వెనుకవైపు సీ-షేప్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇంకా బ్రాండ్ లోగో, బీఈ 6ఈ బ్యాడ్జ్ వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు.

ఫీచర్స్ & ఇంటీరియర్ డిజైన్

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఓ కొత్త అనుభూతిని పొందవచ్చు. ఎయిర్‌క్రాప్ట్ కాక్‌పిట్ క్యాబిన్‌కు మంచి ఆకర్షణను అందిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మరియు పనోరమిక్ డిస్‌ప్లే వంటివి కూడా ఇందులో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ మీద ప్రకాశవంతమైన బీఈ లోగోను కూడా చూడవచ్చు. రియర్ వ్యూ మిర్రర్ సమీపంలో ఓవర్‌హెడ్ స్విచ్‌లు ఉన్నాయి.

ఫీచర్స్ గురించి మాట్లాడితే.. హెడ్ ఆఫ్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, డాల్ఫీ అట్మోస్‌తో కూడిన 16 స్పీకర్ హర్మాన్ కార్టాన్ ఆడియో సిస్టం మరియు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS)వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్

మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 59 కిలోవాట్ బ్యాటరీ, మరొకటి 79 కిలోవాట్ బ్యాటరీ. 59 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 228 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుంది.

79 కిలోవాట్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 281 హార్స్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 682 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ రెండు వేరియంట్లు మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతాయి. అవి రేస్, రేంజ్ మరియు ఎవ్రిడే. కాబట్టి ఇవి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9e)

కంపెనీ లాంచ్ చేసిన మరో ఎలక్ట్రిక్ కారు ‘ఎక్స్ఈవీ 9ఈ’ (XEV 9e). కంపెనీ ఈ కారును ఐఎన్జీఎల్ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. దీని ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారును కంపెనీ 2025 మార్చిలోనే డెలివరీ చేసే అవకాశం ఉంది.

చూడటానికి కొత్తగా కనిపించే ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. ట్రై యాంగిల్ హెడ్‌ల్యాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, విశాలంగా కనిపించే బోనెట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ వంటివి పొందుతుంది. వెనుక భాగంలో రూఫ్‌లైన్ క్రమంగా తగ్గడం చూడవచ్చు. ఇది విండ్‌షీల్డ్‌తో ముగుస్తుంది. టెయిల్ లాంప్ ముందు భాగంలోని డీఆర్ఎల్ మాదిరిగానే ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ పరిమాణం విషయానికి వస్తే.. ఇది 4789 మీమీ పొడవు, 1907 మిమీ వెడల్పు, 1694 మిమీ ఎత్తు మరియు 2775 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. మొత్తం మీద ఇది బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 207 మిమీ వద్ద బీఈ 6ఈ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బూట్ స్పేస్ 663 లీటర్లు.

ఎక్స్ఈవీ 9ఈ ఫీచర్స్

ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఈ కొత్త మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కారులో ఉన్నాయి. వన్ టచ్ పార్కింగ్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ వంటి వాటితో పాటు.. మూడు స్క్రీన్‌లతో కూడిన వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఎంట్రీ ప్యాక్ వన్ డ్రైవ్ మోడ్స్, వన్ పెడల్ డ్రైవింగ్ ఫంక్షన్, సెమీ యాక్టివ్ సస్పెన్షన్, క్రూయిజ్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్ మరియు యాపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్స్, రియర్ ఏసీ వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు మల్టి స్టెప్ రిక్లైన్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఈ కారులో పొందవచ్చు.

బ్యాటరీ ఆప్షన్స్, రేంజ్ మరియు ఛార్జింగ్

ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు కూడా రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. అవి 59 కిలోవాట్ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ. వీటి రేంజ్ కొడాఆ బీఈ 6ఈ మాదిరిగా ఉంటుంది. చిన్న బ్యాటరీ ఒక ఛార్జీతో 542 కిమీ రేంజ్ అందిస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 656 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు 11 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్, 7.2 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ మరియు 175 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 7.2 kW ఏసీ ఛార్జర్ ద్వారా 59 కిలోవాట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8.7 గంటలు అయితే.. 140 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. 11 kW ఛార్జర్ ద్వారా చార్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.

Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

79 కిలోవాట్ బ్యాటరీని 11 kW ఛార్జర్ ద్వారా 8 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 7.2 Kw ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 11.7 గంటలు మాత్రమే. దీనిని 175 Kw డీసీ ఛార్జర్ ఉపయోగించి 20 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్లు.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ పనితీరును అందిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.