36.7 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 15

కేటీఎమ్ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌..10 కేటీఎమ్ కొత్త బైకులు వచ్చేశాయ్..

0

KTM New Bikes Launched in India: యువతను తన బైకులతో ఎంతగానో ఆకట్టుకునే ‘కేటీఎమ్’ (KTM) ఒకేసారి ఏకంగా 10 బైకులను మార్కెట్లో లాంచ్ చేసింది. ఒకదాన్ని మించి.. మరొకటి చూపరులను ఎంతగానో కనువించు చేస్తున్నారు. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..

కంపెనీ లాంచ్ చేసిన బైకులు:

  • కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్
  • కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్
  • కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్
  • కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్
  • కేటీఎమ్ 50 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 65 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 85 ఎస్ఎక్స్
  • కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్
  • కేటీఎమ్ 450 ఎస్ఎక్స్-ఎఫ్
  • కేటీఎమ్ 350 ఈఎక్స్‌సీ-ఎఫ్

కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ (KTM 1290 Super Adventure)

New Luxury Bikes in India

ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ 1290 సూపర్ అడ్వెంచర్. దీని ధర రూ. 22.74 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). లాంచ్ రైడ్ చేయడానికి లేదా కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి దీనిని కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రస్తుతం సింగిల్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తున్న ఈ బైక్.. బెంగళూరు మరియు పూణేలలో మాత్రమే విక్రయానికి ఉంది.

Also Read: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

23 లీటర్ల ఫ్యూయెల్ త్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ 1301 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద 160 హార్స్ పవర్, 6500 rpm వద్ద 138 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముందు భాగంలో 320 మిమీ డ్యూయెల్ డిస్క్ సెటప్, వెనుక 267 మిమీ డిస్క్ ఇందులో అమర్చబడి ఉన్నాయి.

కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్ (KTM 1390 Super Duck R)

KTM Big Bikes in India

కంపెనీ లాంచ్ చేసిన బైకులలో అత్యంత ఖరీదైన బైక్ ఈ 1390 సూపర్ డ్యూక్ ఆర్. దీని ధర రూ. 22.96 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ప్రస్తుతం కేటీఎమ్ యొక్క అత్యంత శక్తివంతమైన బైక్ ఏది అంటే.. 1390 సూపర్ డ్యూక్ ఆర్ అనే చెప్పాలి. ఇది డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్, బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ (KTM 890 Duke R)

890 Duke R of KTM Bike

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కేటీఎమ్ 890 డ్యూక్ ఆర్ ధర రూ. 14.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 889 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది బెంగళూరు, పూణేలలోని కేటీఎమ్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే కంపెనీ ఈ బైకును కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి అవుతుందని తెలుస్తోంది.

కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్ (KTM 890 Adventure R)

KTM motor sports 890 Adventure R

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ 890 అడ్వెంచర్ ఆర్. దీని ధర రూ. 15.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ, బీఎండబ్ల్యూ ఎఫ్ 900 జీఎస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ బైక్.. బరువు 200 కేజీలు. దీనిని కంపెనీ ప్రధానంగా ఆఫ్ రోడింగ్ కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది ఒక మిడ్ సైజ్ అడ్వెంచర్ బైక్.

కేటీఎమ్ డర్ట్ బైక్స్ (KTM Dirt Bikes)

Know the Price of KTM Dirt Bikes

ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ ఆరు డర్ట్ బైకులను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 50 ఎస్ఎక్స్. దీని ధర రూ. 4.75 లక్షలు. ఈ విభాగంలో లాంచ్ అయిన ఇతర బైకుల విషయానికి వస్తే.. అవి కేటీఎమ్ 65 ఎస్ఎక్స్ (రూ. 5.47 లక్షలు), 85 ఎస్ఎక్స్ (రూ. 6.69 లక్షలు), 250 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 9.58 లక్షలు), 450 ఎస్ఎక్స్ ఎఫ్ (రూ. 10.25 లక్షలు), 350 ఈఎక్స్‌సీ-ఎఫ్ (రూ. 12.96 లక్షలు).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఇండియా.

Also Read: ఒబెన్ రోర్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

కేటీఎమ్ డర్ట్ బైకులలో మూడు ప్రత్యేకంగా యువకులను దృష్టిలో ఉంచుకుని లాంచ్ అయ్యాయి. అవి కేటీఎమ్ 50 ఎస్ఎక్స్, 65 ఎస్ఎక్స్, 85 ఎస్ఎక్స్. ఇవి టూ స్ట్రోక్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి మంచి పనితీరును అందిస్తాయి. సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ మూడు బైకుల బరువు కూడా చాలా తక్కువే.

మరో మూడు (కేటీఎమ్ 250 ఎస్ఎక్స్-ఎఫ్, 450 ఎస్ఎక్స్-ఎఫ్ మరియు 350 ఈఎక్స్‌సీ-ఎఫ్) డర్ట్ బైకులను కంపెనీ ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా డిజైన్ చేసింది. ఇవన్నీ మొదటి మూడు డర్ట్ బైకుల కంటే ఉత్తమ పనితీరును అందిస్తాయి. అయితే వీటి బరువు కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇవి అత్యుత్తమ బైకులు అని చెప్పాల్సిందే.

రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం

0

Ratan Tata Car Collection: అందరూ పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు.. భరతమాత ముద్దుబిడ్డ ‘రతన్ టాటా’ (Ratan Tata). పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగి దేశం కోసం లెక్కకు మించి దానం చేసిన ఈ దానశీలి 2024 అక్టోబర్ 09న కన్ను మూసారు. ఈయన మరణం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కంటతడి పెట్టేలా చేశాయి. అయితే ఇప్పుడు రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది.

దివంగత దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 స్పోర్ట్స్ కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రతన్ టాటా కారును డ్రైవ్ చేస్తుంటే.. మరో కారులో ప్రయాణించే ఎవరో వీడియో రికార్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది. రతన్ టాటా డ్రైవ్ చేస్తున్న కారు సిల్వర్ కలర్ స్పోర్ట్స్ కారు. ఈయన కారును డ్రైవ్ చేస్తుంటే.. పక్కన ఎవరో సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 (Mercedes Benz SL500)

నిజానికి వీడియోలో కనిపిస్తన్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 కారును రతన్ టాటా కోసం ప్రత్యేకంగా డెలివరీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కారుకు స్టీరింగ్ వీల్ ఎడమ వైపున ఉండటం గమనిఉంచవచ్చు. సాధారణంగా ఇండియాలో కనిపించే కార్లన్నింటికీ.. కుడివైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇతర దేశాల్లో కారులో స్టీరింగ్ వీల్ ఎడమవైపున ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ కనిపించే బెంజ్ కారును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కారు వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ”500” కలిగి ఉండటం చూడవచ్చు.

ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 అనేది హార్డ్‌టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఒకప్పుడు ఇది అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప ప్రజాదరణ పొందింది. ఇందులో కొన్ని భారత్‌కు కూడా దిగుమతి అయ్యాయి. ఈ కారు 5.0 లీటర్ వీ8 మోటారు ద్వారా 306 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిల్వర్ రంగులో కనిపించే ఈ కారు రెడ్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రతన్ టాటా ఉపయోగించిన ఇతర కార్లు

పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉపయోగించిన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్500 మాత్రమే కాకుండా.. ఫెరారీ కాలిఫోర్నియా టీ (Ferrari California T), కాడిలాక్ ఎక్స్ఎల్ఆర్ (Cadillac XLR), క్రిస్లర్ సెబ్రింగ్ (Chrysler Sebring), మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యు124 (Mercedes Benz W124), మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes Benz S-Class), ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2 (Land Rover Freelander 2), హోండా సివిక్ (Honda Civic), టాటా ఇండిగో మరీనా (Tata Indigo Marina), టాటా నెక్సాన్ (Tata Nexon) మరియు టాటా నానో ఈవీ (Tata Nano EV) మొదలైనవి ఉన్నాయి.

టాటా నానో ఈవీ

రతన్ టాటా ఉపయోంచే కార్లలో ఎంత ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నప్పటికీ.. టాటా నానో ఎలక్ట్రిక్ కారుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దీనిని కంపెనీ ప్రత్యేకంగా రతన్ టాటా కోసం రూపొందించింది. రతన్ టాటా కూడా ఎక్కువగా ఈ కారు డ్రైవ్ చేస్తూనే కనిపించారు. నిజానికి టాటా నానో ఎలక్ట్రిక్ కారు అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాలేదు. అయితే కంపెనీ రతన్ టాటా కోసం ఒక్క కారును మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రాబోయే రోజుల్లో నానో ఈవీ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాము.

Don’t Miss: మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

ప్రతి ఒక్క కుటుంబం కారుకు కలిగి ఉండాలి అనే గొప్ప ఆలోచనతోనే.. రతన్ టాటా టాటా నానో కారుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో ఇది గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ.. ఆ తరువాత దీనికున్న ఆదరణ క్రమంగా తగ్గిపోయింది. కాబట్టి కంపెనీ ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

మీకు తెలుసా!.. 2025లో భారత్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే

0

Upcoming Electric Cars in India: భారతదేశంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎంజీ విండ్సర్, బీవైడీ సీల్, కియా ఈవీ6 వంటి ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది కూడా మార్కెట్లో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఈ-వితారా, మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, టయోటా అర్బన్ ఎలక్ట్రిక్, టాటా హారియార్ ఈవీ మరియు టాటా సఫారీ ఈవీ వంటివి ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

2025లో భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ ఒకటి. ఇది స్టాండర్డ్ హ్యుందాయ్ క్రెటా కంటే భిన్నంగా ఉంటుంది. క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి క్రెటా ఈవీలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ కారు 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది 138 బీహెచ్‌పీ పవర్ మరియు 255 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. క్రెటా ఈవీ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టాటా కర్వ్ ఈవీ, మారుతి ఈ-వితారా, టాటా హారియార్ ఈవీ మరియు బీవైడీ ఆట్టో 3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

మారుతి సుజుకి ఈ-వితారా (Maruti Suzuki E-Vitara)

దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న మరో ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఈ-వితారా. ఇది 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ-వితారా హార్ట్ టెక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలు మరియు ఇతర వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మహీంద్రా బీఈ 6ఈ (Mahindra BE 6E)

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ 26న తన ‘బీఈ 6ఈ’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ మరియు కాక్‌పిట్ వంటి ఇంటీరియర్ పొందుతుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 60 కిలోవాట్ బ్యాటరీ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇది ఒక ఛార్జీతో 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9E)

2025లో మార్కెట్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కూడా ఒకటి. ఇది కూపే మాదిరిగా ఉన్న ఏటవాలుగా ఉన్న రూఫ్, సి-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ప్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు ఏరో బ్లేడ్ స్టైల్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన చాలా వివరాలు నవంబర్ 26న జరగనున్న మహీంద్రా అన్‌లిమిట్ ఈవెంట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

టయోటా అర్బన్ ఎలక్ట్రిక్ (Toyota Urban Electric)

మారుతి సుజుకి మరియు టయోటా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ కారు లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది మారుతి ఈ-వితారా మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

టాటా హారియార్ ఈవీ (Tata Harrier EV)

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియార్ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారు 2025 ప్రారంభంలోనే మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుందని తెలుస్తోంది. యాక్టి.ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ కొత్త కారు 60 కిలోవాట్ బ్యాటరీ, 80 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది సింగిల్ ఛార్జీతో 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 2025 మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం.

Don’t Miss: 2024 మారుతి డిజైర్ లాంచ్ ఈ రోజే: ధర ఎంతంటే?

టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)

వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో టాటా ఎలక్ట్రిక్ కారు సఫారీ ఈవీ. ఇది యాంత్రికంగా హారియార్ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. ఇది 2025 మార్చిలో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. మార్కెట్లో టాటా సఫారీ ఈవీ లాంచ్ అయిన తరువాత మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్‌యూవీ.ఈ8 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడయ్యేరు అవకాశం ఉంది.

2024 మారుతి డిజైర్ లాంచ్ ఈ రోజే: ధర ఎంతంటే?

0
Maruti Dzire Launch Today in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) రేపు (నవంబర్ 11) భారతీయ మార్కెట్లో తన అత్యంత సురక్షితమైన కారు అప్డేటెడ్ ‘డిజైర్’ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే కంపెనీ ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్ కోసం రూ.11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

రేపు మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్‌లో వాహన వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్ ఉండనుంది. కాబట్టి మారుతి స్విఫ్ట్ మాదిరిగానే ఉత్తమ పనితీరును అందిస్తుంది.

డిజైన్

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. 2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లతో అప్డేట్ చేయబడిన గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు బూట్ లిప్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటితో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా పొందుతుంది.

ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్

ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా.. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ బ్లాక్ మరియు లేత గోధుమ రంగులో ఇంటీరియర్ చూడచక్కగా ఉంటుంది. అక్కడక్కడా సిల్వర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇందులో క్లైమేట్ కంట్రోల్స్ అనేవి రౌండ్ డయల్స్ స్థానంలో టోగుల్ స్విచ్‌లను పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. సింగిల్ పేన్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా సిస్టం కూడా ఇప్పుడు మారుతి డిజైర్ కారులో చూడవచ్చు. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు రియర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

2024 మారుతి సుజుకి డిజైర్ కొత్త జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 పీఎస్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారు బహుశా CNG రూపంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

5 స్టార్ సేఫ్టీ రేటింగ్

సేఫ్టీ విషయానికి వస్తే.. మారుతి కొత్త డిజైర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటివి పొందుతుంది. ఈ కారు ఇటీవలే గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ సెడాన్ పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 39.20 పాయింట్లు స్కోర్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో లేదా పెద్ద సేఫ్టీలో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు స్కోర్ చేసింది. కాగా మొత్తం మీద ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటి వరకు మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ఏ కారు 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకోలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి డిజైర్ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Don’t Miss: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. కారుకు ఘనంగా అంత్యక్రియలు (వీడియో)

ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో మారుతి డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇతర కార్ల ధరలతో పోలిస్తే.. 2024 డిజైర్ ధర కొంత తక్కువగా ఉండటం వల్ల మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. కారుకు ఘనంగా అంత్యక్రియలు (వీడియో)

0

Hot Topic in Social Media Maruti Wagon R Burial Ceremony: సాధారణంగా ఎక్కడైనా మనిషి చనిపోతే సమాధి చేస్తాం. ఇంకా కొంతమంది ఇష్టమైన పెంపుడు జంతువులు చనిపోతే సమాధి చేస్తారు. కానీ కారుకు ఎవరైనా సమాధి చేస్తారా? ఇది చదవగానే.. కారుని సమాధి చేయడం ఏమిటి? అనే ప్రశ్న మీ మనసులో పుట్టే ఉంటుంది. ఈ కథనంలో మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. వచ్చేయండి.

కొన్ని నివేదికల ప్రకారం.. ఒక గుజరాతీ కుటుంబం తమకు ఎంతో ఇష్టమైన కారుకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి ఏకంగా 1,500 మంది హాజరు కావడం గమనార్హం. కారు అంత్యక్రియలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మారుతి వ్యాగన్ ఆర్ సిల్వర్ కలర్ కారును 15 అడుగుల గొయ్యిలో పెట్టడం చూడవచ్చు.

గులాబీ రేకులతో నివాళి

ఇక్కడ కనిపిస్తున్న కారు 2010 మోడల్ అని తెలుస్తోంది. కారును పువ్వులతో బాగా అలంకరించి.. రూఫ్ మీద గులాబీ రేఖలను పరిచారు. ఆ తరువాత దానిపైన ఆకుపచ్చ వస్త్రం కప్పి ఉండటం చూడవచ్చు. మొత్తం మీద మనిషికి చేసినట్లే.. కారుకు కూడా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాకు చెందిన సంజయ్ పోలారా అనే రైతు.. తన కారుకు ఈ విధంగా వీడ్కోలు పలికారు.12 సంవత్సరాలు తనకు సేవలందించిన కారుకు.. తన పొలంలోనే అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. పూజారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కారుకు ఘనంగా వీడ్కోలు

ఈ కార్యక్రమంలో సంజయ్ కుటుంబ సభ్యులు కారయు పూజలు చేశారు. ప్రజలు గులాబీ రేకుల వర్షం కురిపించారు. పూజారులు మంత్రాలను పఠించారు. చివరకు అందరూ కలిసి జాగ్రత్తగా కారుకు వీడ్కోలు పలికారు. అక్కడే ఉన్న ఎక్స్‌కవేటర్ మట్టిని ఆ కారుపై పోసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి ఈ కారు తనకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని.. కారు యజమాని పేర్కొన్నారు. 12 సంవత్సరాల క్రితం ఈ కారును కొనుగోలు చేసాను. అప్పటి నుంచి కూడా నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. అందుకే ఈ కారును అమ్మడానికి నాకు మనసురాలేదు. కాబట్టి నా పొలంలో పాతిపెట్టాను. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శం అవ్వాలని భావిస్తున్నాను. కారుకు అంత్యక్రియలు నిర్వహించడానికి సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. కారుకు సంప్రదాయ హిందూ పద్దతిలోనే అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. కారును పూడ్చిన తరువాత ఓ చెట్టును కూడా నాటడం జరిగిందని ఆయన అన్నారు.

లక్షల రూపాయల ఖర్చు

భారతదేశంలో ఇది చాలా అరుదైన సంఘటన అనే చెప్పాలి. ఒక మనిషికి అంత్యక్రియలు చెయడానికే వెనుకాడే ఈ రోజుల్లో కారుకు గంభీరంగా లక్షల రూపాలు ఖర్చు చేసి అంత్యక్రియలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కారు మీద.. యజమానికి ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.

మన దేశంలో చాలామంది వాహనాలను కూడా అదృష్టంగా భావిస్తారు. వాటితోనే మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడే పూజ చేసి, ఆ తరువాత ఉపయోగించే సంప్రదాయం మనది. కారును కొనుగోలు చేసిన తరువాత కూడా.. దసరా లేదా దీపావళి పండుగల సమయంలో కూడా వాటికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఏడాదికి ఒకసారి పూజ చేస్తే.. సురక్షితంగా మనల్ని కాపాడుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజగా.. ఉత్తమ భారతదేశంలో విశ్వకర్మ పూజ అని పిలుస్తారు. మొత్తం మీద భారతదేశంలో వాహనాలకు పూజ చేయడం కొత్తేమీ కాదని స్పష్టమవుతోంది. అయితే కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం అనేది.. మాత్రం ముమ్మాటికీ కొత్తే అని స్పష్టమవుతోంది.

ఒబెన్ రోర్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ధర తెలిస్తే కొనకుండా ఉండలేరు!

0

Oben Rorr EZ launched in India: ఓ బైక్ కొనాలంటే కనీసం రూ. లక్ష కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే. ఇలాంటి సమయంలో ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) మార్కెట్లో రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధర వద్ద తన రెండవ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘రోర్ ఈజెడ్’ (Rorr EZ). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బ్యాటరీ ఆప్షన్స్

మార్కెట్లో ఒబెన్ ఎలక్ట్రిక్ యొక్క రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ మూడు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. అవి 2.6 కిలోవాట్, 3.4 కిలోవాట్ మరియు 4.4 కిలోవాట్. ధర అనేది ఎంచుకునే బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. రేంజ్ అనేది కూడా బ్యాటరీ ఆప్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది.

ఎలక్ట్రిక్ బైక్ రేంజ్

ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న స్టాండర్డ్ రోర్ బైకు మాదిరిగానే ఉంటుంది. అదే రైడింగ్ మోడ్స్ (ఎకో, సిటీ, హవోక్) కొత్త బైకులో కూడా ఉంటాయి. సిటీ మోడ్ ఎంచుకున్నప్పుడు ఒబెన్ రోర్ ఈజెడ్ యొక్క 2.6 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 80 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 60 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 50 కిమీ రేంజ్ అందిస్తుంది.

3.4 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ఎకో మోడ్‌లో 110 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 90 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక చివరగా 4.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఎకో మోడ్‌లో 140 కిమీ రేంజ్, సిటీ మోడ్‌లో 110 కిమీ రేంజ్, హవోక్ మోడ్‌లో 90 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఛార్జింగ్ టైమ్

కొత్త ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు ధరతోనే స్టాండర్డ్ ఛార్జర్ లేదా ఆప్షనల్ ఫాస్ట్ ఛార్జర్ పొందే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. నార్మల్ ఛార్జర్ లేదా స్టాండర్డ్ ఛార్జర్ 2.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 4 గంటలు, 3.5 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 5 గంటలు మరియు 4.4 కిలోవాట్ బ్యాటరీ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది.

ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 2.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 3.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఛార్జ్ కావడానికి 1:30 గంటల సమయం పడుతుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 2 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.

కర్బ్ వెయిట్ ఎంతంటే?

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మూడు వేరియంట్లు 7.5 కేడబ్ల్యు మోటారు ద్వారా 52 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. ఒబెన్ రోర్ ఈజెడ్ కర్బ్ వెయిట్ బ్యాటరీ ప్యాక్‌లను బట్టి మారుతూ ఉంటుంది. 2.6 కిలోవాట్ వేరియంట్ బరువు 138 కేజీలు కాగా.. 3.4 కిలోవాట్ వేరియంట్ బరువు 143 కేజీలు, 4.4 కిలోవాట్ బ్యాటరీ బరువు 148 కేజీల వరకు ఉంటుంది.

ధరలు

ఒబెన్ రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ధరల విషయానికి వస్తే.. 2.6 కిలోవాట్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ ధర రూ. 89,999, మిడ్ స్పెక్ వేరియంట్ లేదా 3.4 కిలోవాట్ వేరియంట్ ధర రూ. 99,999 మరియు టాప్ స్పెక్ వేరియంట్ లేదా 4.4 కిలోవాట్ వేరియంట్ ధర రూ. 1.10 లక్షల మధ్య ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

Don’t Miss: రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఇవే.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఫోటోలు

మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరాలైన.. బైకుల ధరలైన కొంత ఎక్కువే ఉన్నాయి. అయితే ఒబెన్ రోర్ ఈజెడ్ అనేది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. మంచి రేంజ్ కూడా అందిస్తోంది. కాబట్టి ఇది తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఇవే.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ఫోటోలు

0

Royal Enfield Bike in EICMA 2024 Event: మిలాన్‌లో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఈఐసీఎంఏ 2024’ (EICMA 2024) ఈవెంట్‌లో దిగ్గజ కంపెనీలన్నీ కూడా లెక్కకు మించిన బైకులు లాంచ్ చేసి.. చూపరులను కనువిందు చేశాయి. ఈ జాబితాలో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కూడా ఉంది. ఈ కంపెనీ ఈఐసీఎంఏ వేదికపై లాంచ్ చేసిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మార్కెట్లో పాపులర్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా అవతరించిన.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈఐసీఎంఏ 2024 వేదికగా.. మూడు కొత్త మోడల్స్ ప్రారంభించింది. అవి బేర్ 650, క్లాసిక్ 650 మరియు ప్లయింగ్ ఫ్లీ సీ6 వంటివి ఉన్నాయి. ప్లయింగ్ ప్లీ సీ6 అనేది బ్రాండ్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్.. కాగా మిగిలిన రెండూ 650 సీసీ విభాగంలో అడుగుపెట్టిన లేటెస్ట్ బైక్స్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6)

ఈఐసీఎంఏ వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ ‘ప్లయింగ్ ఫ్లీ సీ6’. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కంపెనీ లాంచ్ చేసిన బైకు డిజైన్ కలిగిన ప్లయింగ్ ఫ్లీ సీ6.. రెట్రో లుక్, బాబర్ స్టైల్ సీటు, ఫ్రంట్ రేక్ యాంగిల్, గిర్డర్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది.

ప్లయింగ్ ఫ్లీ సీ6 అనే అల్యూమినియం ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, టచ్‌స్క్రీన్ TFT డ్యాష్‌బోర్డ్, లో రెసిస్టెన్స్ టైర్లు, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, రిఫైన్డ్ స్విచ్‌గేర్ వంటి వాటిని పొందుతుంది. ఈఐసీఎంఏ కార్యక్రమంలో కంపెనీ ప్రదర్శించిన బైక్ సింగిల్ సీటును కలిగి ఉంది. ఈ బైక్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన తరువాత పిలియన్ సీటును కూడా అందించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్.. ఎంత సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుతుంది. రేంజ్ ఎంత ఇస్తుందనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ బైక్ 150 కిమీ నుంచి 200 కిమీ మధ్య రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ బైక్ ధర రూ. 4 లక్షల కంటే ఎక్కువ ఉండవచ్చని సమాచారం. అయితే ధరలకు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఈ బైక్ 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్లయింగ్ ఫ్లీ ఎస్6 (Royal Enfield Flying Flea S6)

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈఐసీఎంఏ వేదికగా ప్రదర్శించిన మరో ఎలక్ట్రిక్ బైక్ ‘ప్లయింగ్ ఫ్లీ ఎస్6’. ఇది కూడా రెట్రో డిజైన్ కలిగి.. చూడటానికి సీ6 బైక్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి, డ్యూయెల్ స్పోర్ట్ టైర్స్, ప్లాట్ సీటును పొందుతుంది. చైన్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ బైక్ స్పోక్ వీల్స్ పొందుతుంది.

ట్రాక్షన్ కంట్రోల్, కలర్ TFT డిస్‌ప్లే, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ఫ్లీ ఎస్6 బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైక్ యొక్క బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బహుశా లాంచ్ సమయానికి కంటే ముందు ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఈ బైక్ 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650)

ఈఐసీఎంఏ వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లాంచ్ చేసిన బైక్ ‘బేర్ 650’. రూ.3.39 లక్షల ధర వద్ద లాంచ్ అయిన ఈ బైక్ 650 సీసీ విభాగంలోకి అడుగుపెట్టింది. స్క్రాంబ్లర్ స్టైల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇంటర్‌సెప్టర్ 650 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది.

648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ 650 కంటే కూడా ఎక్కువ టార్క్ అందిస్తుంది. ఇది టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది. 184 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ 19 ఇంచెస్ ఫ్రంట్ టైర్ మరియు 17 ఇంచెస్ రియర్ టైర్ పొందుతుంది. ఇది హిమాలయన్ బైకులో కనిపించే TFT డాష్‌బోర్డు పొందుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 (Royal Enfield Classic 650)

కంపెనీ ఆవిష్కరించిన మరో బైక్ క్లాసిక్ 650. ఇది ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి 7250 rpm వద్ద 47 హార్స్ పవర్ మరియు 5650 rpm వద్ద 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి.. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. 243 కేజీల బరువున్న ఈ బైక్ బ్రాండ్ యొక్క అత్యంత బరువైన బైకుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైకులోని చాలా పార్ట్స్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న షాట్‌గన్ 650 నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 14.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైకులో ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్పర్ న్యావిగేషన్ పాడ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు. ఈ బైక్ 2025 ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

హిమాలయన్ ఈవీ 2.0 (Royal Enfield Himalayan 2.0)

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ మోడల్.. హిమాలయన్.. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈఐసీఎంఏ వేదికగా హిమాలయన్ ఎలక్ట్రిక్ 2.0 ప్రోటోటైప్ చూపరులను చాలా ఆకట్టుకుంది. దీనిని ‘హిమ్ ఈ’ అని కూడా పిలుస్తారు.

Don’t Miss: ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టిన ‘స్కోడా కైలాక్’: రేటు తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు!

హిమాలయన్ 2.0 ఎలక్ట్రిక్ బైక్ గోల్డ్ కలర్ వైర్ స్పోక్ వీల్స్, దృఢమైన స్వింగార్మ్, ఎల్ఈడీ రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం అప్డేటెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ బైకును కఠినమైన రోడ్లపై కూడా టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలు.. ఇంకా వెలువడలేదు. కాగా ఇవన్నీ లాంచ్ సమయంలో తెలుస్తాయి. మొత్తానికి మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హవా చూపించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టిన ‘స్కోడా కైలాక్’: రేటు తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు!

0

SKoda Kylaq India Launched: పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా కంపెనీలు కార్లను, బైకులను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే దసరా, దీపావళి పండుగల అయిపోయిన తరువాత కూడా స్కోడా కంపెనీ ఓ కొత్త కారును అధికారికంగా భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. స్కోడా లాంచ్ చేసిన కొత్త కారు పేరు ‘కైలాక్’ (Kylaq). ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. వచ్చేయండి.

కైలాక్ ధరలు

మార్కెట్లో అడుగుపెట్టిన కైలాక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారు కోసం వచ్చే నెల 2 నుంచి (డిసెంబర్ 2) నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. డెలివరీలు 2025 జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు స్కోడా ఈ కారును 2025 జనవరి 17న భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించనుంది.

కైలాక్ డిజైన్

లేటెస్ట్ సాలిడ్ డిజైన్ కలిగిన మొట్ట మొదటి స్కోడా కారు కైలాక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. ఫాసియా స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ విస్తరించి ఉంటుంది. సీతాకోక చిలుక మాదిరిగా ఉండే గ్రిల్‌ను కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ అనేది దాని కింద ఉంటుంది. బంపర్ సెంట్రల్ ఎయిర్ వెంట్స్ మరియు బేస్ వద్ద ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్‌ను కలిగి ఉంటుంది. డ్యూయెల్ టోన్ ఇక్కడా గమనించవచ్చు.

రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ బ్లాక్ ట్రిమ్ స్ట్రిప్‌తో అనుసంధానించబడిన సరళంగా కనిపించే చతురస్రాకార టెయిల్‌ల్యాంప్‌లను చూడవచ్చు. వెనుక బంపర్‌లో క్లాడింగ్ మరియు స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్ వంటివి ఉన్నాయి.మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నట్లు చూడగానే అర్థమైపోతుంది.

కైలాక్ ఫీచర్స్

స్కోడా కైలాక్ 10 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, టూ స్పోక్ స్టీరింగ్, రెండు చివర్లలో నిలువగా ఉన్న వెంట్స్ వంటివన్నీ బ్రాండ్ యొక్క కుషాక్ కారును తలపిస్తాయి. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవన్నీ ఉన్నాయి.

డైమెన్షన్స్ (కొలతలు)

కొత్త స్కోడా కైలాక్ యొక్క పరిమాణం విషయానికి వస్తే.. ఈ కారు పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,783 మిమీ, ఎత్తు 1619 మిమీ మరియు వీల్‌బేస్ 2,566 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 189 మిమీ కాగా.. బూట్ స్పేస్ 446 లీటర్ల వరకు ఉంది. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

కైలాక్ ఇంజిన్ వివరాలు

స్కోడా కైలాక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 114 Bhp పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

కైలాక్ ప్రత్యర్థులు

స్కోడా కైలాక్ దేశీయ మార్కెట్లో.. అమ్మకానికి ఉన్న మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుండై వెన్యూ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే స్కోడా కైలాక్ అనేది ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్, సరికొత్త డిజైన్ మరియు తక్కువ ధర కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Don’t Miss: మార్కెట్లో సరికొత్త డిజైర్: రూ. 11వేలకే బుకింగ్స్

భారతీయ మార్కెట్లో విక్రయానికి ఉన్న స్కోడా కార్లు

ఇండియన్ మార్కెట్లో స్కోడా కంపెనీ కుషాక్, స్లావియా, కొడియాక్ మరియు సూపర్బ్ వంటి కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు తాజాగా కైలాక్ కూడా చేరింది. ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న స్కోడా కొత్త కైలాక్ లాంచ్ చేయడంతో తప్పకుండా మరింతమంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం బుకింగ్స్ ప్రారంభమైన తరువాత తెలిసిపోతుంది.

మార్కెట్లో సరికొత్త డిజైర్: రూ. 11వేలకే బుకింగ్స్

0

New Maruti Suzuki Dzire Unveiled: ఎంత గొప్ప వెహికల్ అయినా.. ఎప్పటికప్పుడు అప్డేట్ చెందాలి. లేకుంటే కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పడిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి (Maruti Suzuki) 2017లో లాంచ్ చేసిన ‘డిజైర్’ (Dzire) కారును ఇప్పుడు ఆధునిక హంగులతో.. అప్డేటెడ్ రూపంలో మార్కెట్లో ఆవిష్కారించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.

లాంచ్ డేట్ & బుకింగ్ ప్రైస్

మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త 2025 మారుతి డిజైర్ సబ్‌కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. అయితే స్విఫ్ట్ మాదిరిగా.. అదే త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్ పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ ధరలను నవంబర్ 11న వెల్లడించనుంది. కాగా ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. కాబట్టి రూ. 11,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

సరికొత్త డిజైన్ & ఫీచర్స్

2025 మారుతి డిజైర్ కారు.. కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే హెడ్‌ల్యాంప్ ఇప్పుడు ఈ కారులో చూడవచ్చు. సిల్హౌట్ కూడా పాత మోడల్‌కు భిన్నంగా ఉంటుంది. బ్రాండ్ లోగో, కింద భాగంలో ఫాగ్ లాంప్ వంటివి చూడవచ్చు. కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వెనుక వైపు కొత్త టెయిల్ లాంప్ కూడా చూడవచ్చు.

విడుదలకు సిద్దమవుతున్న కొత్త డిజైర్ ఎక్స్టీరియర్.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ.. ఇంటీరియర్ మాత్రం పెద్ద మార్పులకు లేదా అప్డేట్లకు గురికాలేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో ప్రీస్టాండింగ్ 9.0 ఇంచెస్ డిస్‌ప్లే, స్టీరింగ్ వీల్, స్విచ్ గేర్, అనలాగ్ డయల్స్ వంటి రిటైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అనేది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

Don’t Miss: అన్నంత పని చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్: చెప్పినట్లుగానే మరో బైక్ లాంచ్

అంతే కాకుండా.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్, హోల్డ్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా డిజైర్ కారులో ఉన్నాయి.

ఇంజిన్ డీటైల్స్

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త మారుతి డిజైర్.. స్విఫ్ట్ మాదిరిగానే అదే జెడ్ సిరీస్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.5 Bhp పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

అన్నంత పని చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్: చెప్పినట్లుగానే మరో బైక్ లాంచ్

0

Royal Enfield Bear 650 Launched in India: దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. చెప్పినట్లుగా తన ‘బేర్ 650’ లేదా ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ బైకును అధికారికంగా లాంచ్ చేసింది. 650 సీసీ విభాగంలో గొప్ప ప్రజాదరణ పొందిన కంపెనీ.. ఇప్పుడు మరో 650సీసీ బైక్ లాంచ్ చేత మరింత బలమైన ఉనికిని చాటుకోనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 బైక్ డిజైన్, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మరియు ధరల వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 బైక్ ప్రారంభ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ బైక్ మొత్తం ఐదు వేరియంట్స్ లేదా ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ధర అనేది ఎంచుకునే వేరియంట్ / కలర్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

➤బోర్డ్‌వాక్ వైట్: రూ. 3.39 లక్షలు
➤పెట్రోల్ గ్రీన్: రూ. 3.44 లక్షలు
➤వైల్డ్ హానీ: రూ. 3.44 లక్షలు
➤గోల్డెన్ షాడో: రూ. 3.52 లక్షలు
➤టూ-ఫోర్-నైన్: రూ. 3.59 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా)

డిజైన్

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త బేర్ 650 బైక్.. బ్రాండ్ యొక్క 650 ట్విన్ ప్లాట్‌ఫామ్‌ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇంటర్‌సెప్టర్ 650 యొక్క కొన్ని ఫీచర్స్.. స్క్రాంబ్లర్ బైక్ యొక్క కొన్ని ఫీచర్స్ పొందుతుంది.

డిజైన్ పరంగా స్క్రాంబ్లర్ మాదిరిగా ఉన్న బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ స్టైల్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. డబుల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ కలిగి ఉన్న ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ పొందుతుంది. స్వింగ్‌ఆర్మ్ అనేది ఇంటర్‌సెప్టర్ కంటే కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్ సెటప్ మీటియోర్ 650 మాదిరిగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బైకులో ఎక్కువ గ్రాఫిక్ డిజైన్స్ చూడవచ్చు.

పొడవుగా, స్టైల్‌గా ఉన్న సీటు వెనుక భాగం కొంత పైకి లేచి ఉంటుంది. సైడ్ ప్యానెల్ మీద నెంబర్స్ వంటివి స్క్రాంబ్లర్ బైకును గుర్తుకు తెస్తుంది. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 650 విభాగంలో టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టం పొందిన మొదటి బైక్ ఈ బేర్ 650.

ఫీచర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది గెరిల్లా మోడల్ మాదిరిగా 4.0 ఇంచెస్ రౌండ్ డాష్ పొందుతుంది. 650 సీసీ విభాగంలో సింగిల్ పాడ్ క్లస్టర్ పొందిన మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్.. బేర్ 650 కావడం గమనార్హం. ఈ డిస్‌ప్లే.. ఫోన్ కనెక్టివిటీ, మ్యాప్ న్యావిగేషన్, రోజువారీ రైడింగ్ డేటా వంటివి చూపిస్తుంది. హ్యాండిల్ బార్ రేక్ వద్ద యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్ట్ చూడవచ్చు.

ఇంజిన్ వివరాలు

కొత్త బేర్ 650 బైక్.. 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7240 ఆర్‌పీఎమ్ వద్ద 47 బిహెచ్‌పీ పవర్ మరియు 5150 ఆర్‌పీఎమ్ వద్ద 56.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. టార్క్ అనేది ఇంటర్‌సెప్టర్ కంటే కూడా 4.2 Nm ఎక్కువ కావడం గమనించదగ్గ విషయం.

మెకానికల్స్

బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగా అదే చాసిస్ పొందినప్పటికీ.. సస్పెన్షన్ మరియు వీల్స్ భిన్నంగా ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 130 మిమీ ట్రావెల్‌తో షోవా యూఎస్డీ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయెల్ షాక్స్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు 270 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.

Don’t Miss: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: ఫిదా చేస్తున్న లుక్ & వేరే లెవెల్ ఫీచర్స్

ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన.. 216 కేజీల బరువున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ఇది బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మరియు సొంత బ్రాండ్ అయిన ఇంటర్‌సెప్టర్ 650 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.