34.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 35

హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్.. మైండ్ బ్లోయింగ్ డిజైన్ – ధర ఎంతంటే?

0

Hyundai Exter Knight Edition Launched in India: హ్యుందాయ్ కంపెనీకి దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రెటా వంటి కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసి అత్యధిక అమ్మకాలతో దూసుకెళ్తోంది. అంతే కాకుండా గతేడాది ఈ కంపెనీ ఎక్స్‌టర్ కారును లాంచ్ చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలిగింది. కాగా ఇప్పుడు ‘ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్’ (Exter Knight Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంత? స్టాండర్డ్ మోడల్‌కు.. నైట్ ఎడిషన్‌కు మధ్య తేడాలు ఏంటి అనేవి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్

హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయెల్ టోన్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ మరియు ఎస్ఏసీ (ఓ) కనెక్ట్ డ్యూయెల్ టోన్ వేరియంట్స్.. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతాయి. మిగిలిన ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ డ్యూయెల్ టోన్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ మరియు ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ డ్యూయెల్ టోన్ అనేవి ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ధరలు రూ. 8.38 లక్షల నుంచి రూ. 10.43 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఎక్స్‌టర్ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా కంపెనీ ఈ నైట్ ఎడిషన్ లాంచ్ చేసింది.

డిజైన్

కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ ఎడిషన్ కేవలం ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్లకు మాత్రమే పరిమితమై ఉంది. ఇది బ్లాక్ పెయింటెడ్ సైడ్ గార్నిష్, ఫ్రంట్ బంపర్ మరియు టెయిల్‌గేట్‌ మీద రెడ్ యాక్సెంట్స్, రెడ్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ వంటివి పొందుతుంది.

ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, హ్యుందాయ్ మరియు ఎక్స్‌టర్ బ్యాడ్జ్‌లు వంటివి పొందుతుంది. కాంట్రాస్టింగ్ రెడ్ యాక్సెంట్స్ అండ్ స్టిచ్చింగ్, రెడ్ ఫుట్‌వెల్ లైటింగ్, బ్లాక్ శాటిన్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ మెటల్ స్కప్ ప్లేట్, ప్లోర్ మ్యాట్ మీద రెడ్ స్టిచ్చింగ్ మరియు సీటు అంచులలో రెడ్ పైపింగ్ వంటివి చూడవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి అబిస్ బ్లాక్ మరియు షాడో గ్రే కలర్స్. ఇవి కాకూండా స్టార్రీ నైట్, అట్లాస్ వైట్ మరియు రేంజర్ ఖాకీ వంటి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే షాడో గ్రే మరియు రేంజర్ ఖాకీ అనేవి బ్లాక్ రూప్ కలిగి డ్యూయెల్ టోన్‌లో లభిస్తాయి.

ఫీచర్స్

డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ స్టాండర్డ్ మోడల్ యొక్క అదే ఫీచర్స్ పొంది ఉంటుందని సమాచారం. కాబట్టి అదే టచ్ స్క్రీన్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ స్పెషల్ ఎడిషన్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ [అనితీరునుఅందిస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!

ప్రత్యర్థులు

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!

0

Bharateeyudu 2 Actor Kamal Haasan Car Collection: కమల్ హాసన్ (Kamal Haasan).. ఈ పేరుకు యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే మూడున్నర సంవత్సరాల పసి వయసులోనే కలత్తూర్ కన్నమ్మ అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన కేవలం నటుడుగా మాత్రమే కాకుండా.. గాయకుడుగా, నిర్మాతగా, కథా రచయితగా, రాజకీయ నాయకుడుగా.. అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టి లోక నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. కాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న (జులై 12) విడుదులకానుంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని భావిస్తున్నాము.

సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసి ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న కమల్ హాసన్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు. వాటి ధర ఎంత? వాటి వివరాలు ఏంటి అనేది వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

కమల్ హాసన్ కార్లు

నటుడు కమల్ హాసన్ ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ, లెక్సస్ ఎల్ఎక్స్ 570, టయోటా ప్రాడో, మిత్సుబిషి పజెరో, మెర్సిడెస్ బెంజ్ ఈ 220, హమ్మర్ హెచ్3, రేంజ్ రోవర్ ఎవోక్ మరియు ఆడి ఏ8 ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ (BMW 730Ld)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన 730ఎల్‌డీ కారు కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.35 కోట్లు వరకు ఉంటుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 2993 సీసీ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 262 Bhp పవర్ మరియు 2000 rpm వద్ద 620 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం.ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 (Lexus LX 570)

భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన జపాన్ కార్ల తయారీ సంస్థ లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎక్స్ 570 కారు కూడా కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 2.33 కోట్లు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఒక్క చూపుతోనే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు 5663 సీసీ 8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5600 rpm వద్ద 362 Bhp పవర్ మరియు 3200 rpm వద్ద 530 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 220 కిమీ కావడం గమనార్హం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో (Toyota Landcruiser Prado)

ఒకప్పుడు ఎక్కువమంది సెలబ్రటీలకు ఇష్టమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసిన టయోటా కంపెనీకి చెందిన ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కూడా నటుడు కమల్ హాసన్ గ్యారేజిలో ఉంది. దీని ధర సుమారు రూ. కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని దేశీయ మార్కెట్లో నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ల్యాండ్ క్రూయిజర్ అప్డేటెడ్ మోడల్స్ మాత్రం అమ్మకానికి ఉన్నాయి.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కారు 2982 సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి 171 Bhp పవర్ మరియు 410 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే పనితీరు పరంగా ఇది చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero)

సుమారు రూ. 30 లక్షల ఖరీదైన మిత్సుబిషి పజెరో కూడా కమల్ హాసన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. నిజానికి ఈ కారు ఒకప్పుడు అత్యుత్తమ అమ్మకాలు పొంది ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఆ తరువాత కాలంలో కంపెనీ ఇందులోనే అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేసింది. మిత్సుబిషి పజెరో కేవలం కమల్ హాసన్ గ్యారేజిలో మాత్రమే కాకుండా ఇతర ప్రముఖుల గ్యారేజిలో కూడా ఉందని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ ఈ220 (Mercedes Benz E220)

కమల్ హాసన్ గ్యారేజిలోని మరో జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ యొక్క ఈ220. దీని ధర రూ. 72.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 1950 సీసీ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 3800 rpm వద్ద 192 Bhp పవర్ మరియు 1600 – 2800 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 240 కిమీ/గం.

హమ్మర్ హెచ్3 (Hummer H3)

మహేంద్ర సింగ్ ధోని, అల్లు అర్జున్ వంటి ప్రముఖుల గ్యారేజిలో కూడా హమ్మర్ కార్లు ఉన్నట్లు గతంలో తెలుసుకున్నాం. కాగా హమ్మర్ హెచ్3 కారు కమల్ హాసన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 3700 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque)

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు ఈ రేంజ్ రోవర్ ఎవోక్. ఇది కమల్ హాసన్ గ్యారేజిలో కూడా ఉంది. దీని ధర రూ. 67.90 లక్షలు ఎక్స్ షోరూమ్). ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి కమల్ హాసన్ గ్యారేజిలోని కారు ఏ ఇంజిన్ ఆప్షన్ పొంది ఉందని ఖచ్చితంగా తెలియడం లేదు. అయితే ఈ మోడల్ టాప్ 213 నుంచి 221 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది దాని ప్రత్యర్థుల కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది.

Don’t Miss: లక్షల ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి – ఫోటోలు చూశారా?

ఆడి ఏ8 ఎల్ (Audi A8 L)

కమల్ హాసన్ గ్యారేజిలోని మరో కారు ఆడి కంపెనీకి చెందిన ఏ8 ఎల్. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే. ఇది 2995 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 344 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఆధునిక డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో విరివిగా అందుబాటులో ఉన్నాయి.

ఆరు దేశాలకు పయనమవుతున్న బజాజ్ బైక్ ఇదే!.. దీని గురించి తెలుసా?

0

Bajaj Freedom 125 CNG Bike Will Be Exported To Six Countries: పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో బజాజ్ ఆటో టూ వీలర్ విభాగంలోనే ‘సీఎన్‌జీ’ బైక్ లాంచ్ చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికింది. కంపెనీ లాంచ్ చేసిన సీఎన్‌జీ బైక్ ‘బజాజ్ ఫ్రీడమ్ 125’ (Bajaj Freedom 125). ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ప్రపంచ వ్యాప్తంగా మరో ఆరు దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆరు దేశాలకు

బజాజ్ ఆటో లాంచ్ చేసిన కొత్త ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్.. త్వరలో కొలంబియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పెరూ, ఇండోనేషియా మరియు టాంజానియా వంటి ఆరు దేశాలకు ఎగుమతికానుంది. అయితే కంపెనీ ఎగుమతులను ప్రారంభించడానికి ముందు భారతదేశంలో ఈ బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేస్తుంది. ఇది పూర్తయిన తరువాత విదేశాలకు ఎగుమతి చేయనుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ

ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఈ నెల ప్రారంభంలో (జులై 5) న దేశీయ విఫణిలో బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. ఇది భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్లో మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ కావడం గమనార్హం.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో బైక్ రైడర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంకులను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 2 కేజీలు మాత్రమే. ఈ ట్యాంక్ సీటు కింద అమర్చబడి ఉంటుంది. రెండు కేజీల సీఎన్‌జీతో ఈ బైక్ 200 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బైక్ సీఎన్‌జీలో పనిచేసేటప్పుడు టాప్ స్పీడ్ కొంత తక్కువగా ఉంటుంది.

ఈ బైకులోని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 2 లీటర్లే. ఇది ఈ రెండు లీటర్ల పెట్రోలుతో ఏకంగా 100 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సాధారణ ఫ్యూయెల్ ట్యాంక్ మాదిరిగానే ఉంటుంది. దీనికి ఫ్యూయెల్ క్యాప్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 330 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.4 Bhp పవర్, 9.7 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ పరంగా ఈ బైక్ ఈ విభాగంలోని ఇతర బైకులకంటే ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నెగిటివ్ ఎల్‌సీడీ క్లస్టర్ మొదలైనవి ఇందులో ఉంటాయి.

Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇది అత్యంత సురక్షితమైన బైకుగా కంపెనీ నిర్దారించింది. కంపెనీ ఈ బైక్ యొక్క సేఫ్టీని టెస్ట్ చేయడానికి 11 విధాలుగా పరీక్షించినట్లు తెలుస్తోంది. కాబట్టి సీఎన్‌జీ బైక్ వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అపోహపడేవారు.. నిశ్చింతగా ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని సీఎన్‌జీ బైకులు మార్కెట్లో లాంచ్ అవుతాయా?

నిజానికి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ అనేది ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్. ఈ ఘటన బజాజ్ ఆటో సొంతం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే బజాజ్ ఇప్పుడు సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. కాబట్టి ప్రత్యర్థులైన హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు సీఎన్‌జీ బైక్ లాంచ్ చేస్తాయా? లేదా? అనేది సమాధానం లభించాల్సిన ప్రశ్నగా మిగిలింది. భవిష్యత్తులో ఈ ప్రశ్నకు తప్పకుండా జవాబు లభిస్తుంది.

రూ.2 లక్షల స్కూటర్ కొన్న వేలకోట్ల అధిపతి.. డిస్కౌంట్ ఇవ్వలేదంటూ..

0

Zerodha CEO Nikhil Kamath Buys Ather Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తేడాలేకుండా రోజు వారీ వినియోగానికి లేదా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీతారలు, పారిశ్రామిక వేత్తలు సైతం తమ గ్యారేజిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ చేశారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త జెరోధా కో-ఫౌండర్ ‘నిఖిల్ కామత్’ (Nikhil Kamath) ఓ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నిఖిల్ కామత్ కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఏథర్’ (Ather) కంపెనీకి చెందిన ‘450అపెక్స్’ అని స్పష్టమవుతోంది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తరువాత నిఖిల్ రద్దీగా ఉన్న రోడ్ల మీద రైడ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వేలకోట్ల సంపద గలిగిన ఈయన కేవలం రూ.1.96 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే స్కూటర్ కొనుగోలు చేయడం చాలామందిలో ఒకింత ఆశ్చయాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఈయనకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీదున్న ఆసక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జెరోదా సీఈఓ నిఖిల్ కామత్ ఫోటోలను షేర్ చేస్తూ.. తాను ఏథర్ 450అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంఆర్‌పీ ధరకే కొన్నాను. కంపెనీ నాకు ఎలాంటి డిస్కౌంట్ అందించలేదని అన్నారు. అంతే కాకుండా.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గొప్ప ఉత్పత్తులని ప్రశంసించారు. మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతున్నాయని అన్నారు. అయితే కంపెనీ మార్కెటింగ్ తీరుపైన అంత సంతోషంగా లేనని పేర్కొంటూ.. సారీ తరుణ్ అని పేర్కొన్నారు.

ఒకప్పుడు తాను ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తితో పోలిస్తే.. అమ్మకాలు వేగంగా సాగుతాయని ఆయన అన్నారు. అయితే తాను ఏథర్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా చొరవే.. అని అన్నారు. ఈ చొరవలో భాగంగానే చాలామంది విదేశీ బ్రాండ్ వాహనాల కంటే స్వదేశీ బ్రాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని అన్నారు.

ఏథర్ ఎనర్జీ

ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీ కంపెనీని 2013లో తరుణ్ మెహతా మరియు స్వప్నిల్ జైన్ స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ప్రస్తుతం కంపెనీ రెండు తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఇందులో ఒకటి వైట్‌ఫీల్డ్‌లో (బెంగళూరు), మరొకటి హోసూర్ (తమిళనాడు).

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ కంపెనీ.. ప్రస్తుతం ఏథర్ 450ఎస్, ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450ఎక్స్ ప్రో, ఏథర్ 450 అపెక్స్ మరియు ఏథర్ రిజ్టా స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో తరువాత భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థగా అవతరించింది. ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ అని పిలువబడే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది.

ఏథర్ 450 అపెక్స్

ఇక నిఖిల్ కామత్ కొనుగోలు చేసిన ఏథర్ 450 అపెక్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది ఒకటి. ఇప్పటికే కంపెనీ ఈ స్కూటర్ డెలివరీలను కూడా ప్రారంభించింది. అయితే ఇది ప్రస్తుతం బెంగళూరు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా కంపెనీ ఈ స్కూటర్ ఉత్పత్తిని మారినిత్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

కంపెనీ అమ్మకాలపై ద్రుష్టి సారించడం కంటే కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తి అందించడానికి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే డెలివరీలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి, దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

ఏథర్ 450 అపెక్స్ కొంత ఖరీదైనదే అయినప్పటికీ.. బ్రాండ్ యొక్క అత్యంత శక్తివంతమైన స్కూటర్ కూడా. ఇది 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 7kW మోటారును పొందుతుంది. గంటకు 100 కిమీ వేగంతో.. 157 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇది స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్స్, వార్ప్ మరియు వార్ప్ ప్లస్ అనే ఆరు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులో రైడర్లకు కావాల్సిన దాదాపు అన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎక్కువమంది ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్.. ధరకు తగ్గ రేంజ్!

0

Mercedes Benz EQB And EQA launched India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్, మరొకటి మెర్సిడెస్ ఈక్యూఏ. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్ (Mercedes Benz EQB Facelift)

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బెంజ్ కార్లలో ఒకటి ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్. దీని ధర 250 ప్లస్ 7 సీటర్ మరియు 350 4 మ్యాటిక్ 5 సీటర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 70.90 లక్షలు, రూ. 77.50 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్).

అద్భుతమైన డిజైన్ కలిగిన కొత్త ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్.. కొత్త గ్రిల్, అప్డేటెడ్ బంపర్స్, వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్, డాల్బీ అట్మోస్‌తో కూడిన సౌండ్ సిస్టం, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ ఎలక్ట్రిక్ కారు ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం), ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు 5 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ ఈక్యూబీ ఫేస్‌లిఫ్ట్‌ 250 ప్లస్ వేరియంట్ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒకే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక పుల్ చార్జితో 535 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈక్యూబీ 350 4మ్యాటిక్ వేరియంట్ కూడా 70.5 కిలోవాట్ బ్యాటరీనే పొందుతుంది. ఇందులో డ్యూయెల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 292 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 447 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ (Mercedes Benz EQA)

బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన ఈక్యూఏ విషయానికి వస్తే.. ఇది ఈక్యూఏ 250 ప్లస్ అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కారును కేవలం 7 సీటర్ రూపంలో లాంచ్ చేసింది. దీనికోసం ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది క్రాస్‌ఓవర్ లాంటి స్టైలింగ్ పొందుతుంది. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ ఫీచర్స్ వంటివి పొందుతాయి.

కొత్త బెంజ్ ఈక్యూఏ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పోలార్ వైర్, మౌంటెన్ గ్రే, పటగోనియా రెడ్ మెటాలిక్, హైటెక్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్, మౌంటెన్ గ్రే మాగ్నో మరియు స్పెక్ట్రల్ బ్లూ కలర్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

Don’t Miss: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

వోల్వో XC40 రీఛార్జ్ మరియు బీఎండబ్ల్యూ ఐఎక్స్1 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇందులో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్ మరియు 385 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మొత్తం మీద ఈ బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన ఈక్యూబీ మరియు ఈక్యూఏ ఎలక్ట్రిక్ కార్లు అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. అయితే ఈ కార్లు మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతాయి? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

0

Top 10 Highlights Of Bajaj Freedom 125 CNG Bike: ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైకును ఇటీవల బజాజ్ ఆటో కంపెనీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ పెద్ద విప్లవం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎన్‌జీ బైకులు వస్తాయి అనటానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ బైక్ కోసం సంస్థ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుంది? మార్కెట్లో విజయం సాధిస్తుందా? లేదా?.. అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అంతకంటే ముందు ఈ బైక్ కొనాలనుకునే వారు తప్పకుండా ఈ బైక్ గురించి తెలుసుకోవలసిన 10 అంశాలను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన సరికొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్ పొందుతుంది. ఇది బైక్ యొక్క సీటు కింద ట్రెల్లీస్ ఫ్రేమ్‌లో అమర్చబడి ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ తక్కువే అయినా ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకులోని సీఎన్‌జీ ట్యాంక్ మాదిరిగానే.. 2 లీటర్ల కెపాసిటీ కలిగిం పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఇది అన్ని బైకులలో ఉన్నట్లే సీటుకు కొంచెం ముందు భాగంలో ఉంటుంది. ఫ్యూయల్ క్యాప్ కూడా కనిపిస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా తక్కువే అయినా.. సీఎన్‌జీ మరియు పెట్రోల్ ద్వారా వినియోగదారుడు ఉత్తమ మైలేజ్ పొందవచ్చు.

సీఎన్‌జీతో బైక్ మైలేజ్

కేవలం 2 కేజీల కెపాసిటీ కలిగిన బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ఒక కేజీ సీఎన్‌జీతో ఏకంగా 102 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని ప్రకారం 2 కేజీల సీఎన్‌జీతో బజాజ్ సీఎన్‌జీ 200 కంటే ఎక్కువ కిమీ మైలేజ్ అందిస్తుంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునేవారికి ఇది ఒక ఉత్తమ ఆప్షన్ అనే చెప్పాలి. సాధారణ పెట్రోల్ బైకుతో పోలిస్తే సీఎన్‌జీ బైక్ నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే.

పెట్రోల్‌లో బైక్ మైలేజ్ & మొత్తం మైలేజ్

బజాజ్ సీఎన్‌జీ బైకులోని పెట్రోల్ ట్యాంక్ 102 కిమీ మైలేజ్ అందిస్తుంది. అంటే ఒక లీటరుతో బజాజ్ సీఎన్‌జీ బైక్ 50 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందన్నమాట. కాగా సీఎన్‌జీ మరియు పెట్రోల్ రెండూ కలిసి 330 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో ఈ మైలేజ్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

సీటు పరిమాణం

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ పొడవైన సీటును పొందుతుంది. సీటు పొడవు ఏకంగా 785 మిమీ వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే బజాజ్ సీఎన్‌జీ బైక్ ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బజాజ్ బైకుల కంటే పొడవైన సీటును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ బైక్ రైడర్లకు మాత్రమే కాకుండా పిలియన్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

125 సీసీ ఇంజిన్

బజాజ్ సీఎన్‌జీ బైక్ 125 సీసీ విభాగంలో లాంచ్ అయింది. కాబట్టి ఇది 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 9.4 బిహెచ్‌పీ పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుందనే చెప్పాలి. అయితే బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పర్ఫామెన్స్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టాప్ స్పీడ్

ఒక బైక్ ఎంత మంచి డిజైన్ కలిగి ఉన్నప్పటికీ స్పీడ్ కూడా ముఖ్యమే. కాబట్టి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ సీఎన్‌జీతో నడిచేటప్పుడు గంటకు 90.5 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే పెట్రోల్‌తో నడిచేటప్పుడు గంటకు 93.4 కిమీ వరకు వేగవంతం అవుతుంది. సీఎన్‌జీతో నడిచేటప్పుడు కంటే కూడా పెట్రోల్‌తో నడిచేటప్పుడు ఈ బైక్ స్పీడ్ కొంత ఎక్కువని తెలుస్తోంది.

గేర్‌బాక్స్ ఆప్షన్

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఇతర బైకుల మాదిరిగానే 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరు గురించి వాహన వినియోగదారుడు ప్రేత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

వేరియంట్స్

ఇటీవలే దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్.. ముచ్చటగా మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్ మరియు డిస్క్ ఎల్ఈడీ వేరియంట్. ఇవి మూడు చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్ల విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది.

Don’t Miss: వాహన ప్రపంచానికి మకుటం లేని మహారాజు.. ‘MS ధోని’ మైండ్ బ్లోయింగ్ కార్లు

ధరలు

ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం బైక్ యొక్క ధరలు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బేస్ వేరియంట్ (డ్రమ్ వేరియంట్) ధర రూ. 95000. మిగిలిన రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 1.05 లక్షలు (డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్), రూ. 1.10 లక్షలు (డిస్క్ ఎల్ఈడీ).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.

వాహన ప్రపంచానికి మకుటం లేని మహారాజు.. ‘MS ధోని’ మైండ్ బ్లోయింగ్ కార్లు

0

Mind Blowing Car Collection Of Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే భారత క్రికెట్ ప్రపంచంలో అలుపెరుగని ధీరుడు, అనితరసాధ్యుడుగా.. మేరునగధీరుడుగా ఎదిగిన ఎమ్ఎస్ ధోని.. ఎంతోమంది యువతకు రోల్ మోడల్. క్రికెట్ అంటే మాత్రమే బైకులు మరియు కార్ల పట్ల కూడా అమితమైన ఆసక్తి కలిగిన ధోని.. అతి పెద్ద వాహన ప్రపంచానికి మకుటంలేని మహారాజు. ఈ కథనంలో మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఉన్న చెప్పుకోదగ్గ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం..

హమ్మర్ హెచ్2

సుమారు రూ.75 లక్షల విలువైన హమ్మర్ హెచ్2 ఎమ్ఎస్ ధోని గ్యారేజిలో ఉంది. కఠినమైన డిజైన్ కలిగిన ఈ కారు.. అద్భుతమైన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది 6.2 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 398 హార్స్ పవర్ మరియు 574 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. విలాసవంతమైన ఫీచర కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు పలువురు ప్రముఖుల గ్యారేజిలో కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2

రూ. 43.66 లక్షల నుంచి రూ. 57.37 లక్షల విలువైన ‘ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2’ కూడా ధోని గ్యారేజిలో ఉంది. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ మరియు 3.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు చూడగానే ఆకట్టుకుంటుంది. ధోని ఈ కారును డ్రైవ్ చేస్తూ పలుమార్లు కనిపించారు.

నిస్సాన్ జొంగా

మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలోని మరో కారు నిస్సాన్ జొంగా. నిజానికి ఇదొక వింటేజ్ కారు. 2019లో ధోని ఈ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఈ మోడల్ కార్లను భారతీయ సాయుధ దళాలు ఉపయోగించేవి. కఠినమైన భూభాగాల్లో ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉండే.. ఈ కార్లను మిలటరీ ఉపయోగించేది. అలాంటి కారును ధోని తన గ్యారేజిలో చేర్చారు. దీనిని నిస్సాన్ 4డబ్ల్యు73 అని పిలుస్తారు. ఈ కారు 4 లీటర్ ఇంజిన్ కలిగి 3200 rpm వద్ద 110 Bhp మరియు 1200 rpm వద్ద 264 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 15 లక్షలు ఉంటుందని సమాచారం.

మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్

మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలోని మరో కారు మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. అసాధారణమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ కారు 2.8 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 118 హార్స్ పవర్ మరియు 292 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దృఢమైన నిర్మాణం కలిగిన ఈ కారు అద్బుతమైన ఇంటీరియర్ కూడా పొందుతుంది. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ కొంతమంది వాహన ప్రేమికులు మాత్రమే తమ గ్యారేజిలో ఈ కార్లను కలిగి ఉన్నారు.

కియా ఈవీ6

సౌత్ కొరియా కార్ల తయారీ కియా మోటార్స్ యొక్క ఈవీ6 కూడా ధోని గ్యారేజిలో ఉంది. దాదాపు రూ.60 లక్షల ఖరీదైన ఈ కారు ఒక ఫుల్ చార్జితో ఏకంగా 700 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ప్రస్తుతం దేశంలో ఎక్కువ రేంజ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఒకటిగా ఉంది.

ఆడి క్యూ7

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి క్యూ 7 కూడా మిస్టర్ కూల్ గ్యారేజిలో ఉంది. రూ. 88 లక్షల విలువైన ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు జాన్ అబ్రహం, విరాట్ కోహ్లీ వంటివారు కూడా తమ గ్యారేజిలో ఈ కార్లను చేర్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహీంద్రా స్కార్పియో

దేశీయ వాహన దిగ్గజం మహింద్ర అండ్ మహీంద్ర కంపెనీ యొక్క స్కార్పియో కూడా ధోని గ్యారేజిలోని అనేక కారులో ఒకటి. ఒకప్పటి నుంచి భారతీయ విఫణిలో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ కారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇది 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 140 హార్స్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. ఈ కారు సిటీ డ్రైవింగ్ కోసం మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా భారతీయులు ఎక్కువమంది కోరుకునే కార్ల జాబితాలో ఇది చెప్పుకోదగ్గ మోడల్.

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్

అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ కూడా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఉంది. దీని ధర ఏకంగా కోటి రూపాయలకంటే ఎక్కువ. ఇందులో 6.2 లీటర్ వీ8 ఇంజిన్ 707 హార్స్ పవర్, 875 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద ఈ కారు అత్యంత శక్తివంతమైన జీప్ కారుగా పరిగణించబడుతుంది.

రోల్స్ రాయిస్ సిల్వర్ వ్రైత్

బ్రిటీష్ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన సిల్వర్ వ్రైత్ కారు కూడా ధోని గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 6.75 లీటర్ వీ8 ఇంజిన్ కలిగి 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెషల్ డిజైన్ కలిగిన ఈ కారు అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ

బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఈ కారు కూడా ధోని ఉపయోగించే కార్ల జాబితాలో ఒకటి. రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన సొగసైన డిజైన్, ఆధునిక సాంకేతికతలను పొందుతుంది. అత్యాధునిక డ్రైవింగ్ అనుభవాన్ని పొందటానికి ఈ కారులో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారును ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.

హిందూస్తాన్ అంబాసిడర్

ఒకప్పుడు భారతదేశంలో అత్యతం ప్రజాదరణ పొందిన మరియు ప్రసిద్ధి చెందిన కార్లలో చెప్పుకోదగ్గది హిందూస్తాన్ అంబాసిడర్. దీని ధర అప్పట్లో తక్కువే అయినా.. నేడు ఇది మార్కెట్లో అమ్మకానికి లేదు. కొంతమంది వాహన ప్రేమికుల గ్యారేజిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అప్పుడప్పుడూ.. అక్కడక్కడా ఈ కారు రోడ్ల మీద కూడా దర్శనమిస్తుంది. ఇది 1.5 లీటర్ డీజిల్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.

Don’t Miss: 30 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. మరెన్నో విశేషాలు: రైడింగ్ చేయడానికి మినిమన్ ఉంటది!

పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో ఫెరారీ 599 జీటీఓ, పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఆమ్ వంటి వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. కార్లు కాకుండా హార్లే డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, కవాసకి నింజా హెచ్2, డుకాటీ 1098, యమహా ఆర్‌డీ350, సుజుకి హయబుసా, అపాచీ ఆర్ఆర్ 310 మరియు బీఎస్ఏ గోల్డ్ స్టార్ వంటి మరెన్నో బైకులు ఈయన గ్యారేజిలో ఉన్నాయని తెలుస్తోంది.

30 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. మరెన్నో విశేషాలు: రైడింగ్ చేయడానికి మినిమన్ ఉంటది!

0

BMW R 1300 GSA Bike Revealed: భారతదేశంలో వాహన వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. చాలామంది వాహన ప్రియులు మారుతున్న కాలానికి అనుగుణంగా మారటానికి, అదే సమయంలో లేటెస్ట్ బైకులను, కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) ఓ సరి కొత్త బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ కంపెనీ లాంచ్ చేయనున్న బైక్ ఏది? ఈ బైకులు ఉన్న స్పెషాలిటీ ఏంటి అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

బీఎండబ్ల్యూ బైక్స్ అంటేనే మంచి స్టైల్, అప్డేటెడ్ డిజైన్ అని అందరికి తెలుసు. చాలామంది సెలబ్రిటీలు ఈ బ్రాండ్ బైకులనే ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే అడ్వెంచర్ లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే సంస్థ లాంచ్ చేయనున్న సరికొత్త బైక్ ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ’ (BMW R 1300 GSA). ఇది ఆర్ 1300 జీఎస్ ప్లాట్‌ఫామ్‌ మీద ఆధారపడి ఉంటుందని సమాచారం. కాబట్టి ఇది దాని మునుపటి బైకులకంటే కూడా గణనీయమైన అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్

కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ దాని మునుపటి బైకులకంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రకాశవంతమైన హెడ్‌లైట్ కనిపిస్తుంది. అంతే కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ లేదా టెయిల్ సెక్షన్ కింద ముక్కు వద్ద ఎక్కువ ఎడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఏకంగా 30 లీటర్లు. ఇప్పటి వరకు ఏ బైకులోనూ ఇంత కెపాసిటీ కలిగి ఫ్యూయెల్ ట్యాంక్ లేదనే చెప్పాలి. లాంగ్ రైడ్ చేసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి కంపెనీ వారిని దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేస్తుందేమో అనిపిస్తోంది.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో బైక్ రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఎల్ఈడీ లైట్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, రాడార్ బేస్డ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటికెగ్రేటెడ్ యూఎస్‌బీ సాకేట్, 12 వోల్ట్స్ ఆన్ బోర్డ్ పవర్ సాకేట్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. ఇందులో ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది క్లచ్ కంట్రోల్ మరియు షిఫ్టింగ్ గేర్‌లను ఆటోమేట్ చేయడానికి రెండు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్‌లను పొందుతుంది. ఇది గేర్లు మార్చే పనిని తగ్గిస్తుంది. తద్వారా రైడర్ హ్యాపీగా రైడింగ్ మీద ద్రుష్టి పెట్టవచ్చు.

ఏకంగా 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్.. స్టాండర్డ్ జీఎస్ బైక్ కంటే కూడా 11 లీటర్లు ఎక్కువ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందింది. దీంతో ఈ బైక్ బరువు 32 కేజీలు పెరిగి 269 కేజీలకు చేరింది. 870 మిమీ నుంచి 890 మిమీ పొడవైన సీటును అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొట్టి రైడర్లకు కూడా అనుకూలంగా ఉండేలా కంపెనీ దీనిని రూపొందిస్తుంది.

ఇంజిన్

మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్ ఒక్క చూపుతోనే ఆకర్షించబడే డిజైన్ పొందుతుంది. ఇందులో 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అండ్ ఎండ్యూరో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. కాబట్టి ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

వేరియంట్స్ మరియు ధరలు

బీఎండబ్ల్యూ మోటోరాడ్ లాంచ్ చేయనున్న కొత్త ఆర్ 1300 జీఎస్ఏ బైక్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ మరియు ఆప్షన్ 719 కారాకోరం. దేశీయ మార్కెట్లో లాంచ్ అయితే ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 25 లక్షల నుంచి రూ. 26 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ధరలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Don’t Miss: రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?

కంపెనీ లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రాడార్ అసిస్టెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్‌లో ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, అడాప్టివ్ రైడ్ హైట్, ప్రో రైడింగ్ మోడ్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు లగేజ్ క్యారీయింగ్ కోసం కూడా కొన్ని యాక్ససరీస్ పొందవచ్చు. మొత్తం మీద ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ అక్టోబర్ 2024 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం.

లక్షల ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి – ఫోటోలు చూశారా?

0

Manisha Rani Gifts XUV 3XO to Father: సాధారణంగా ఎక్కడైనా తల్లిదండ్రులే తమ పిల్లలకు నచ్చిన వాటిని గిఫ్ట్ ఇస్తూ సంతోషపెడుతుంటారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. పిల్లలే తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించిన ‘మనీషా రాణి’ (Manisha Rani) తన తండ్రికి లక్షల ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చి నెటిజన్ల చేత శభాష్ అనిపించుకుంటోంది. ఇంతకీ ఈమె తన తండ్రికి ఏ కారును గిఫ్ట్ ఇచ్చింది. దాని ధర ఎంత? వివరాలు ఏంటి? అనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మనీషా రాణి బిగ్‌బాస్ ఓటీటీలో కూడా పాల్గొంది. అంతే కాకుండా ఈమె డ్యాష్ ఇండియా డ్యాన్స్ షోలో కూడా తన ప్రతిభను కనపరిచింది. ఇటీవల ‘ఝలక్ దిఖ్లా జా 11’ విజేతగా నిలిచింది. ఈమె ప్రముఖ డ్యాన్సర్ మాత్రమే కాదు.. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.

ఇక మనీషా రాణి ఇచ్చిన గిఫ్ట్ విషయానికి వస్తే.. ఇది మహీంద్రా కంపెనీకి చెందిన ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (Mahindra XUV 3XO) కారు. దీని ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మనీషా తన తండ్రితో డీలర్షిప్ చేరుకుంటుంది. అప్పటికే తనకోసం సిద్ధం చేసిన కారును ఆవిష్కరిస్తుంది. ఆ తరువాత తన తండ్రితో కలిసి ఫోటోలకు పోజులిస్తుంది. కేక్ కట్ చేయడం, తండ్రి కూతురు కేక్ తినిపించుకోవడం వంటివన్నీ కూడా ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ

గత కొన్ని రోజులకు ముందు మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ.. మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతోంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కావు రీడిజైన్ చేయబడిన గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్.. XUV 3XO అక్షరాలు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు సెంట్రల్ ఏసీ వెంట్స్, మెటాలిక్ పెడల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ టీజీడీఐ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 112 పీఎస్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 1.2 లీటర్ టీజీడీఐ ఇంజిన్ 130 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ మరియు డీజిల్ ఇంజిన్ 117 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఏడీఏఎస్ వంటి మరెన్నో ఫీహార్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Don’t Miss: రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?

భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రాబోయే స్కోడా సబ్ 4మీటర్ ఎస్‌యూవీలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయినప్పటికీ తన విభాగంలో మంచి అమ్మకాలను పొందుతోంది.

రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?

0

Bajaj Freedom 125 CNG Launched in India: ఇప్పటివరకు మీరు పెట్రోల్ బైకులను చూసారు, ఎలక్ట్రిక్ బైకులను చూసారు. కానీ ఎప్పుడైనా సీఎన్‌జీ చూశారా?. చూసి ఉండరు, చూసే ప్రసక్తే లేదు. ఎందుకంటే సీఎన్‌జీ బైక్ లాంచ్ అయిందే ఈ రోజు (జులై 05). కాబట్టి ఇంతకీ సీఎన్‌జీ బైక్ ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీని ధర ఎంత? బుకింగ్స్ ప్రారంభమయ్యాయి? డెలివరీలు ఎప్పుడు అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

సీఎన్‌జీ బైక్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto).. ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సీఎన్‌జీ బైక్ పేరు ‘ఫ్రీడమ్ 125’ (Freedom 125). చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

వేరియంట్స్, ధరలు, బుకింగ్స్ మరియు డెలివరీలు

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ మరియు డిస్క్ ఎల్ఈడీ. వీటి ధరలు వరుసగా రూ. 95000, రూ. 1.05 లక్షలు మరియు రూ. 1.10 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మొదట మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దేశం మొత్తం మీద ప్రారంభమవుతాయి.

కలర్ ఆప్షన్స్

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కరీబియన్ బ్లూ, సైబర్ వైట్, రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ మరియు ప్యూటర్ గ్రే కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు తనకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ & మైలేజ్

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంకులను పొందుతుంది. సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 2 కేజీలు, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా రెండు లీటర్లు. సీఎన్‌జీ ట్యాంక్ అనేది సీటు కింద అమర్చబడి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ సీఎన్‌జీ ట్యాంకుకు ముందు భాగంలో ఉంటుంది.

పెట్రోల్ ద్వారా సీఎన్‌జీ బైక్ 102 కిమీ మైలేజ్.. సీఎన్‌జీ ద్వారా 200 కిమీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. మొత్తం మీద ఇది ఒక ఫుల్ ట్యాంకుతో ఏకంగా 300 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఈ బైకును ఏకంగా 11 సార్లు టెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 125 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9.4 Bhp పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ సీఎన్‌జీ నడుస్తున్నప్పుడు గంటకు 90.5 కిమీ, అదే పెట్రోల్ ద్వారా నడుస్తున్నప్పుడు ఈ బైక్ టాప్ స్పీడ్ 93.4 కిమీ వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్స్

కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ చూడటానికి సింపుల్ డిజైన్ పొందినప్పటికీ.. అధునాతన ఫీచర్స్ ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో టెలిస్కోపిక్ పోర్క్, లింక్డ్ టైప్ మోనో రియర్ షాక్ ఉంటాయి. ఈ బైక్ 785 మిమీ పొడవు ఉంటుంది. కాబట్టి ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన నెగిటివ్ ఎల్‌సీడీ క్లస్టర్ పొందుతుంది. ఇవన్నీ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

Don’t Miss: ఇంత ఖరీదైన స్కూటర్లను ఎప్పుడైనా చూశారా? ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!

ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకుకు ప్రధాన ప్రత్యర్థులు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు సీఎన్‌జీ విభాగంలో బైకులే లేదు. అయితే 125 సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125 మరియు హీరో గ్లామర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా బజాజ్ సీఎన్‌జీ బైక్ కొంత పొతే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.