37.1 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 4

కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?

0

MG Comet EV Blackstorm Edition Launched: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్.. జేఎస్‌డబ్ల్యూతో జత కట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఎంజీ కామెట్’ (MG Comet EV) ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎంజీ కామెట్ ఈవీ.. బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ధర

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ (MG Comet EV Blackstrom Edition) అనేది గ్లోస్టర్, హెక్టర్ మరియు ఆస్టర్ తరువాత బ్లాక్‌స్టోర్మ్ ట్రీట్‌మెంట్ పొందిన బ్రాండ్ యొక్క నాల్గవ మోడల్. ఇది కేవలం టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి దీని ధర రూ. 9.81 లక్షలు (బ్యాటరీ ప్యాక్‌తో పాటు). అయితే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) కింద దీనిని రూ. 7.80 లక్షలకే (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) కొనుగోలు చేయవచ్చు.

డిజైన్

కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ ధర.. దాని స్టాండర్డ్ ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ వేరియంట్ కంటే కూడా రూ. 13200 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఈంలాటెస్టర్ ఎడిషన్ స్పెషల్ బ్యాడ్జ్, వీల్ కవర్స్, హుద్ బ్రాండింగ్, కస్టమ్ స్కిడ్ ప్లేట్స్ వంటి వాటితో పాటు స్కిడ్ ప్లేట్స్, డోర్ ప్యానెల్స్, వీల్స్, లోయర్ గ్రిల్ మీద కనిపించే రెడ్ కలర్ హైలెట్ అన్నీ కూడా యాక్సెసరీస్ ప్యాకేజీలో భాగంగా సొంతం చేసుకోవచ్చు.

ఇంటీరియర్

ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలోని సీట్లు పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. డోర్ ప్యానెల్స్ బూడిద రంగులో ఉన్నాయి. కొన్ని ఇతర భాగాలు తెలుపు రంగులో ఉన్నాయి. హెడ్‌రెస్ట్‌ల మీద ఎరుపు రంగులో కుట్టబడిన బ్లాక్‌స్టోర్మ్ ఉండటం చూడవచ్చు.

ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో పాటు.. సాధారణ ఎంజీ కామెట్ ఈవీలో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ ఉంటాయి. అయితే ఈ స్పెషల్ ఎడిషన్‌లో అదనంగా నాలుగు స్పీకర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ మరియు రేంజ్

కొత్త ఎంజీ కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్‌ యొక్క డిజైన్ మరియు ఫీచర్లలో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కానీ బ్యాటరీ మరియు రేంజ్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో అదే 17.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 7.4 కేడబ్ల్యు ఏసీ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 3.5 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 2.8 గంటల సమయంలో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

బుకింగ్స్ & డెలివరీలు

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 11000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. ఎంజీ కామెట్ ఈవీ కారును మరింత ఆకర్షణీయంగా లేదా కొత్తగా కావాలని కోరుకునేవారికి కామెట్ ఈవీ బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ చాలా అద్భుతమైన ఆప్షన్.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

ఎంజీ కామెట్ ఈవీ సేల్స్

అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ‘ఎంజీ కామెట్ ఈవీ’ చెప్పుకోదగ్గ మోడల్. సింపుల్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందించడమే కాకుండా.. రోజువారీ ప్రయాణాలకు లేదా నగర ప్రయాణాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ కారు చిన్నదిగా ఉండటం వల్ల సజావుగా ముందుకు సాగిపోవచ్చు.

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లక్షల మంది.. ఈ కారును కొనుగోలు చేశారు. ఇందులో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడటానికి ఈ కారు చిన్నదిగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది.

Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

ఎంజీ మోటార్ కార్లు

భారతదేశంలో ఎంజీ మోటార్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇందులో ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్, జెడ్ఎస్ ఈవీ, విండ్సర్ ఈవీ మరియు కామెట్ ఈవీ వంటివి ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అంతే కాకుండా కంపెనీ కూడా.. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ కారణంగానే సంస్థ.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే, కస్టమర్లను కూడా ఆకర్శించడంలో విజయం పొందుతోంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయిన ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్ కూడా మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తోంది.

రూ.1.15 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ బైక్: రేంజ్ ఎంతో తెలుసా..

0

Revolt RV BlazeX Electric Bike Launched In India: భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors).. ఎట్టకేలకు మరో సరసమైన బైక్ ‘ఆర్‌వీ బ్లేజ్ఎక్స్’ (RV BlazeX) లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసిన ఆర్‌వీ 400 మరియు ఆర్‌వీ1 కంటే కూడా ఇది చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ధర & బుకింగ్స్

రివోల్ట్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 499తో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

చూడటానికి ఆర్‌వీ1 బైక్ మాదిరిగా కనిపించే.. ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్ కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్ వంటివి కూడా చూడచక్కగా ఉంటాయి. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్ గ్రాబ్ రైల్ కూడా పొందుతుంది. బ్లేజ్ఎక్స్ బైకులోని అతిపెద్ద మార్పు లేదా అప్డేట్ ఏమిటంటే.. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇప్పటికే ఉన్న బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే ఎక్కువ పవర్ డెలివరీ చేస్తుంది.

కలర్ ఆప్షన్స్ & ఫీచర్స్

కొత్త రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్ మరియు ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ కలర్స్.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ లేటెస్ట్ బైకులో 6 ఇంచెస్ LCD స్క్రీన్ (ఇది వాహనం గురించి సమాచారం అందిస్తుంది), మూడు రైడింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, జీపీఎస్ మరియు జియో ఫెన్సింగ్ వంటి యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

బ్యాటరీ అండ్ రేంజ్

రివోల్ట్ ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ బైక్ 3.24 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటార్ 5.49 Bhp పవర్ మరియు 45 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైకులోని బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జితో 150 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది సాధారణ ఆర్‌వీ1 బైక్ కంటే 10 కిమీ తక్కువ.

స్పెసిఫికేషన్స్

ఆర్‌వీ బ్లేజ్ఎక్స్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఆర్‌వీ1 బైక్ మాదిరిగానే.. బ్లేజ్ఎక్స్ కూడా 790 మిమీ ఎత్తైన సీటు, 1350 మిమీ వీల్‌బేస్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. అయితే ఈ బైక్ బరువు (113 కేజీలు) ఆర్‌వీ1 కంటే 3 కేజీలు ఎక్కువ. అయితే పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

0

Best Bikes Under Rs. 2 Lakh in India 2025: అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే బైకులను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి.. అందరికీ ఇష్టమే. అయితే కొన్ని అధిక ధరను కలిగి ఉంటాయి, మరికొన్ని ఓ స్థాయిలో ఉన్న ధరలో అందుబాటులో ఉంటాయి. ఈ కథనంలో రూ. 2 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద లభించే బెస్ట్ బైక్స్ గురించి తెలుసుకుందాం..

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 (Bajaj Pulsar RS200)

ఆర్ఎస్200 అనేది బజాజ్ కంపెనీ యొక్క చెప్పుకోదగ్గ బైక్. సుమారు 167 కేజీల బరువున్న ఈ బైక్ ధరలు రూ. 1.7 లక్షల నుంచి రూ. 1.8 లక్షల మధ్య ఉంది. విభిన్న రంగులలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ ద్వారా 9750 rpm వద్ద 24.5 హార్స్ పవర్, 8000 rpm వద్ద 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంచ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్250 (Bajaj Pulsar N250)

పల్సర్ ఎన్250 అనేది కూడా రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ బైక్. దీని ధర రూ. 1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్). 250 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 24 హార్స్ పవర్, 21.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 164 కేజీల బరువున్న ఈ బైక్ సిటీలో.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బజాజ్ డొమినార్ 250 (Bajaj Dominar 250)

మన జాబితాలో రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మరో బజాజ్ బైక్.. ఈ ‘డొమినార్ 250’. దీని ప్రారంభ ధర రూ. 1.8 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ బరువు 180 కేజీలు కాగా.. 250 సీసీ ఇంజిన్ ద్వారా 8500 rpm వద్ద 27 హార్స్ పవర్, 6500 rpm వద్ద 23.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ బైక్.. మంచి డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగి, అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 (Bajaj Pulsar NS200)

మరో బజాజ్ బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైక్. దీని ప్రారంభ ధర రూ. 1.42 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9750 rpm వద్ద 24.5 హార్స్ పవర్ మరియు 8000 rpm వద్ద 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 156 కేజీల బరువున్న ఈ బైక్ 10.98 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. పనితీరు దాని ప్రత్యర్థుల కంటే అద్భుతంగా ఉంటుంది.

హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ (Hero Karizma XMR)

ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించిన బైక్ ఈ ‘హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్’. దీని ధర రూ. 1.8 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 25.5 హార్స్ పవర్, 20.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. 163.5 కేజీల బరువున్న ఈ బైక్.. యమహా ఆర్15 కంటే 22 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Suzuki Gixxer SF 250)

జిక్సర్ ఎస్ఎఫ్ 250.. కూడా రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైక్. 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్.. 9300 rpm వద్ద 26.5 హార్ పవర్, 7300 rpm వద్ద 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 161 కేజీల బరువున్న ఈ బైక్ ధర రూ. 97720 మాత్రమే. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్.. రైడర్లకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతాయి. కాబట్టి ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

సుజుకి జిక్సర్ 250 (Suzuki Gixxer 250)

రూ.1.8 లక్షల ధర వద్ద లభించే.. ‘జిక్సర్ 250’ కూడా చెప్పుకోదగ్గ బైక్. 156 కేజీల బరువున్న ఈ బైక్.. 249 సీసీ ఇంజిన్ కలిగి.. 9300 rpm వద్ద 26.5 పీఎస్ పవర్, 7300 rpm వద్ద 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైకులకు అంత డిమాండ్ లేకపోవడం గమనార్హం.

ట్రయంఫ్ స్పీడ్ టీ4 (Triumph Speed T4)

ఎక్కువమందికి ఇష్టమైన బైకుల జాబితాలో ‘ట్రయంఫ్ స్పీడ్ టీ4’ ఒకటి. ఇది 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 31 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ బైక్.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, సుదూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆమె ఆస్తి రూ.4600 కోట్లు!

పైన చెప్పుకున్న బైక్స్ మాత్రమే కాకుండా.. రూ. 1.80 లక్షల వద్ద లభించే, హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250R), రూ. 1.85 లక్షల వద్ద లభించే బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ (Bajaj Pulsar NS400Z) మరియు రూ. 2.03 లక్షల వద్ద అందుబాటులో ఉన్న కేటీఎమ్ 200 డ్యూక్ (KTM 200 Duke) వంటివి కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైకులు (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆమె ఆస్తి రూ.4600 కోట్లు!

0

Richest Heroine in India and Net Worth: భారతదేశంలో అగ్ర కథానాయకి ఎవరంటే కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరని అడిగితే.. మరికొంతమంది పేర్లు చెబుతారు. కానీ ఇండియాలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ ఎవరంటే మాత్రం.. తప్పకుండా తడబడే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం..

అత్యంత ధనిక హీరోయిన్ ఎవరంటే.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, అలియా భట్ వంటి వారు మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశంలో నయనతార, త్రిష, రష్మిక మందన్న మొదలైన పేర్లు చెబుతారు. కానీ వీరికంటే రిచెస్ట్ హీరోయిన్ ఒకరున్నారు. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి జుహీ చావ్లా (Juhi Chawla).

ధనిక హీరోయిన్

నటి జుహీ చావ్లా ఆస్తి ఏకంగా రూ. 4000 కోట్ల కంటే ఎక్కువే అని సమాచారం. సినిమా ప్రపంచానికి దూరమైనప్పటికీ.. ఈమె ఐపీఎల్ టీమ్ ‘కేకేఆర్’ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా డ్రీమ్డ్ అన్‌లిమిటెడ్, జూహీ చావ్లా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి కూడా జుహీ చావ్లా సారథ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు తక్కువే.. కానీ పలు సంస్థలలో భాగస్వామిగా ఉండటం వల్ల, వచ్చిన డబ్బే చాలా ఎక్కువ.

సినీ కెరియర్

బాలీవుడ్ చిత్ర సీమలో ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా.. హమ్ హై రహీ ప్యార్ కే, ఖయామత్ సే ఖయామత్ తక్, యస్ బాస్, డర్ మరియు బోల్ రాధా బోల్ వంటి సినిమాల్లో నటించి 1990లలో సంచలనం సృష్టించింది. కాగా 2024 హురున్ ధనవంతుల జాబితాలో జుహీ చావ్లా నికర విలువ రూ. 4600 కోట్లు. ఈమె తరువాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. అంటే జుహీ చావ్లా ఆస్తి షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువే.

2019లో ఒక్క హిట్ కూడా లేదు

1990లలో మంచి పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా ఖాతాలో 2009లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అయినప్పటికీ దేశంలోని టాప్ 10 అత్యంత ధనవంత నటీమణుల జాబితాలో ఒకరుగా ఉంది. దీనికి కారణం కొన్ని సంస్థలలో భాగస్వామి కావడమే. ఈ విధంగానే ఈమెకు డబ్బు వస్తోంది. దీంతో నికర విలువ కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు ఈమె భర్త (జే మెహతా) ప్రముఖ వ్యాపారవేత్త.. కాబట్టి ఈ వైపు నుంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి.

రెమ్యునరేషన్

భారతదేశంలో అత్యంత ధనిక నటిగా పేరు తెచ్చుకున్న.. జుహీ చావాలా 90లలోనే ఒక్కో సినిమాకు రూ. 1 కోటి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది. ఆ తరువాత కాలంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. ఇది కూడా ఆమె సంపదను పెంచడానికి కారణం అయింది. టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్ జాబితాలో ఒకరని చేసింది.

కార్ కలెక్షన్స్

అత్యంత ధనిక నటిగా పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా.. ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తోంది. ఈ జాబితాలో ఆస్టన్ మార్టిన్ రాపిడ్ (రూ. 3.3 కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.8 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ – క్లాస్ (రూ. 1.7 కోట్లు), జాగ్వార్ ఎక్స్‌జే (రూ. 1.2 కోట్లు) మరియు పోర్షే కయెన్ (రూ. 1.36 లక్షల నుంచి రూ. 2 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.

Also Read: మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఒకటి. ఈ కారు ధర చాలా ఎక్కువ కావడం చేత, దీనిని చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. జుహీ చావ్లా ఈ కారును కూడా ఉపయోగిస్తోంది. ఇది కాకుండా బెంజ్, బిఎండబ్ల్యూ, పోర్షే మరియు జాగ్వార్ బ్రాండ్ కార్లను కూడా.. తన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తుందో. దీన్ని బట్టి చూస్తే.. ఖరీదైన కార్ల మీద జుహీ చావ్లాకు చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది.

ఇండియాలో ఇతర రిచెస్ట్ హీరోయిన్స్

నటి జుహీ చావ్లా తరువాత, అత్యంత ధనిక హీరోయిన్స్ జాబితాలో వరుసగా రెండో స్థానంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ (రూ. 850 కోట్ల కంటే ఎక్కువ), మూడో స్థానంలో ప్రియాంక చోప్రా (రూ. 650 కోట్లు) ఉన్నారు.

Also Read: జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

ఐశ్వర్య రాయ్ మరియు ప్రియాంక చోప్రాలు సినిమాల్లో నటించిన సంపాదించింది కొంత తక్కువే అయినా.. అంతర్జాతీయ ప్రాజెక్టులు, నిర్మాణ సంస్థలు మొదలైన వాటి నుంచి వచ్చిన డబ్బు ఎక్కువ. ఈ కారణంగానే వీరు ధనవంతుల జాబితాలో నిలిచారు. అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనె (రూ. 500 కోట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ధనవంతుల జాబితాలో టాలీవుడ్ హీరోయిన్స్

రిచెస్ట్ హీరోయిన్స్ జాబితాలోని టాలీవుడ్ తారల జాబితాలో.. లేడీ సూపర్ స్టార్ నయనతార (రూ. 200 కోట్ల కంటే ఎక్కువ), తమన్నా భాటియా (రూ. 120 కోట్లు), సమంత (రూ. 101 కోట్లు), త్రిష (రూ. 85 కోట్లు), కాజల్ ఆగర్వాల్ (రూ. 85 కోట్లు) మరియు రష్మిక మందన్న (రూ. 66 కోట్లు) మొదలైనవారు ఉన్నారు. వీరు సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఇతర వ్యాపారాల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు.

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

0

Best CNG Car Under Rs.10 Lakh in India: కొంత తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి సీఎన్‌జీ వాహనాలు ఉత్తమ ఎంపిక. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా ఈ సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను సీఎన్‌జీ విభాగంలోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఎక్కువ ధర ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపే అవకాశం తక్కువ. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద.. అందుబాటులో ఉన్న బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Swift CNG)

భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. అలాంటి ఈ కారు ప్రస్తుతం సీఎన్‌జీ రూపంలో కూడా అమ్మకానికి ఉంది. ఈ మోడల్ కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ.. జెడ్12ఈ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.58 పీఎస్ పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియయు 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది సీఎన్‌జీ రూపంలో.. 69.75 పీఎస్ పవర్, 101.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది.

స్విఫ్ట్ సీఎన్‌జీ 32.85 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే సీఎన్‌జీ కారు ధరలు, పెట్రోల్ మోడల్ ధరల కంటే కొంత ఎక్కువే. కాబట్టి మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ ధర.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ. కాబట్టి దీని ప్రారంభ ధర రూ. 8,19,500గా (ఎక్స్ షోరూమ్) ఉంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)

నిజానికి టాటా మోటార్స్ అంటేనే.. ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ. కాబట్టి ఈ బ్రాండ్ కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సీఎన్‌జీ విభాగంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మరియు అత్యంత సురక్షితమైన మోడల్ ‘పంచ్ సీఎన్‌జీ’. ఇది మైక్రో SUV అయినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం అద్భుతాలు సృష్టించింది.

టాటా పంచ్ కేవలం నాలుగు సంవత్సరాల్లో 500000 అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2024లో 202031 యూనిట్ల అమ్మకాలతో.. భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా రికార్డ్ క్రియేట్ చేసి.. హ్యుందాయ్ కంపెనీని సైతం వెనక్కి నెట్టింది.

ఇక పంచ్ సీఎన్‌జీ విషయానికి వస్తే.. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 87.8 పీఎస్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతాయి.

Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

టాటా పంచ్ కారు సీఎన్‌జీ రూపంలో 73.5 పీఎస్ పవర్, 103 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది. ఇది డ్యూయెల్ సీఎన్‌జీ సిలిండర్స్ పొందుతుంది. కాబట్టి బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. టాటా పంచ్ సీఎన్‌జీ 27 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7,29,990 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ (Hyundai Aura CNG)

భారతదేశంలోని అత్యుత్తమ సీఎన్‌జీ కార్లలో హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ కూడా ఒకటి. రూ. 7,54,800 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఆరా సీఎన్‌జీ.. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 పీఎస్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. సీఎన్‌జీ వేరియంట్ 69 పీఎస్ పవర్, 95.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే పొందుతుంది.

Also Read: జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

ఇండియన్ మార్కెట్లోని సీఎన్‌జీ బ్రాండ్స్

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు అన్ని కంపెనీలు సీఎన్‌జీ విభాగాలోకి ప్రవేశించాయి. ఇందులో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ వంటి కార్ల తయారీదారులతో పాటు.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు టూవీలర్లను కూడా సీఎన్‌జీ విభాగంలోకి లాంచ్ చేస్తున్నాయి. సీఎన్‌జీ టూవీలర్స్ అమ్మకాలు కూడా ఇండియన్ మార్కెట్లో ఆశాజనకంగానే ఉన్నాయి.

సాధారణంగా సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే.. బూట్ స్పేస్ భాగంలో కంపెనీలు సీఎన్‌జీ సిలిండర్లను ఉంచడం వల్ల.. అక్కడ బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే బూట్ స్పేస్ పెంచడానికి.. కంపెనీ డ్యూయెల్ సిలిండర్లను అందిస్తుంది. వీటిని కారు యొక్క ముందు భాగంలో ఫిక్స్ చేయడం వల్ల బూట్ స్పేస్ సాధారణ కార్లలో లభించినట్లే.. లభిస్తుంది. మంచి మైలేజ్, ఎక్కువ బూట్ స్పేస్ వంటివి కలిగి ఉండటం వల్ల కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారిలో చాలామంది సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

జావా స్పెషల్ ఎడిషన్.. మొదటి 500 మందికే బెనిఫిట్: ధర కూడా తక్కువే!

0

Jawa 350 Legacy Edition launched: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో కొత్త బైకులు ఉన్నాయి, అప్డేటెడ్ బైకులు ఉన్నాయి. ఈ తరుణంలో జావా మోటార్‌సైకిల్ (Jawa Motorcycle) కంపెనీ సరికొత్త ‘జావా 350 లెగసీ ఎడిషన్’ (Jawa 350 Legacy Edition) లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కొత్త ఎడిషన్

జావా 350 లెగసీ ఎడిషన్.. చూడటానికి దాని సాధారణ మోడల్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మొదటి 500 మంది కస్టమర్లకు ఇది రూ. 1.99 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ధర రూ. 16,000 పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని బైక్ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.

కొత్త జావా 350 లెగసీ ఎడిషన్ బైకులో టూరింగ్ వైజర్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, క్రాష్ గార్డ్ వంటి సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా లెదర్ కీచైన్, జావా 350 యొక్క కలెక్టర్ ఎడిషన్ మినియేచర్ మోడల్‌ను కూడా కొనుగోలుదారులు పొందుతారు. కలర్ ఆప్షన్ మారింది. కానీ యాంత్రికంగా ఈ బైకులో ఎటువంటి మార్పు లేదు.

ఇంజిన్ డీటెయిల్స్

జావా 350 లెగసీ ఎడిషన్ స్టాండర్డ్ బైకులో ఉన్న అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7000 rpm వద్ద, 22.5 హార్స్ పవర్, 5000 rpm వద్ద 28.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు లేదు.

కంపెనీ కొత్త వేరియంట్స్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా సంస్థ స్పోక్ వీల్ బేస్ వేరియంట్ (రూ. 1.99 లక్షలు), అల్లాయ్ వీల్స్ వేరియంట్ (రూ. 2.08 లక్షలు) మరియు టాప్ ఎండ్ క్రోమ్ వేరియంట్స్ అయిన స్పోక్ వీల్ (రూ. 2.15 లక్షలు), అల్లాయ్ వీల్ వేరియంట్ (రూ. 2.23 లక్షలు, అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లాంచ్ చేసింది.

ఇండియాలోని జావా బైకులు

భారతీయ మార్కెట్లో జావా బైకులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అవి జావా 42 బాబర్, జావా 42, జావా 42 ఎఫ్‌జే, జావా పెరాక్ మరియు జావా 350. ఇవన్నీ మార్కెట్లో ఒకప్పుడు మంచి అమ్మకాలు పొందినప్పటికీ.. ప్రస్తుతం ప్రత్యర్థులకు పోటీ ఇవ్వడంలో కొంత విఫలమైనట్లే తెలుస్తోంది. అయితే కస్టమర్లను ఆకర్శించడానికే.. ఇప్పుడు జావా 350 లెగసీ ఎడిషన్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో.. తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందిన.. జావా బైకులు ఇప్పుడు సరైన అమమకాలు పొందకపోవడానికి కారణం, బహుశా వాటి డిజైన్ అనే అనిపిస్తోంది. ఎందుకంటే.. యువత ఇప్పుడు సరికొత్త డిజైన్స్ కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. వారిని ఆకర్శించడానికే లేటెస్ట్ డిజైన్ బైకులను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ విషయంలో జావా కంపెనీ ఇంకా వెనుకబడి ఉందనే చెప్పాలి.

Also Read: మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

ప్రారంభం నుంచి.. జావా కంపెనీ లాంచ్ చేస్తున్న బైకులు దాదాపు ఒకే డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో చొచ్చుకుని వచ్చిన లైట్, ఎత్తు వంటివి చూడటానికి అంత ఆకర్షణీయంగా లేదని అనిపిస్తోంది. దీని ప్రత్యర్థి రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం అన్ని విభాగాల్లోనూ.. బైకులను లాంచ్ చేస్తోంది. ఇవి ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఆకర్షనీయమైన పెయింటింగ్ స్కీమ్ కూడా పొందాయి.

లెగసీ ఎడిషన్

ప్రస్తుతం కంపెనీ లాంచ్ చేసిన జావా 350 లెగసీ ఎడిషన్.. డిజైన్ దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, కలర్ ఆప్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని అనిపిస్తోంది. కాబట్టి ఈ బైక్ తప్పకుండా మంచి అమాంకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇలాంటి కొత్త నవీనీకరణలతో కంపెనీ మున్ముందు మరిన్ని కొత్త బైక్స్ లాంచ్ చేస్తే.. గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే కంపెనీ ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎలాంటి బైకులను లాంచ్ చేయనుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!

0

Janhvi Kapoor BoyFriend Shikhar Pahariya New Land Rover: అతి తక్కువ కాలంలోనే.. బాగా పాపులర్ అయిన యువ సినీతారలలో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor). బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ అమ్మడు, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక పోతే రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటించే అవకాశం ఉంది.

సినీ రంగంలో దినదినాభివృద్ధి చెందితున్న జాన్వీ.. గత కొన్ని రోజులకు ముందు రూ. 3.5 కోట్ల ఖరీదైన ‘లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్’ (Lexus LM 350h) కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు ఆమె ప్రియుడు శిఖర్ పహరియా రూ. 5.76 కోట్ల ‘రేంజ్ రోవర్ ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్’ (Range Rover SV Serenity Edition) కొనుగోలు చేసాడు. ఈ కారు గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

శిఖర్ పహారియా కొనుగోలు చేసిన కొత్త కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు కారులో నుంచి దిగి.. విమానాశ్రయానికి వెళ్లడం చూడవచ్చు. అదే సమయంలో ఫోటోలకు పోజులిస్తూ.. శిఖర్ ముందుకు వెళ్లిపోవడం కనిపిస్తుంది.

రేంజ్ రోవర్ ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్

భారతదేశంలోని అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కార్లలో ‘ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్’ చెప్పుకోదగ్గ మోడల్. దీని ధర రూ. 5.76 కోట్లు అని తెలుస్తోంది. దీనిని శిఖర్ పహారియా కొనుగోలు చేసాడు. ఇది తెలుపు రంగులో.. గోల్డెన్ యాక్సెంట్స్ కలిగిన వీల్స్ పొందుతుంది. ఇది బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగా కాకుండా.. చాలా హుందాగా ఉంటుంది. ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

ఎస్‌వీ సెరినిటీ ఎడిషన్.. ఇతర రేంజ్ రోవర్ కార్ల మాదిరిగా కాకుండా, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుక భాగంలో కెప్టెన్ సీట్లు ఉండటం కూడా చూడవచ్చు. లోపలి భాగంలో 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 13.1 ఇంచెస్ రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా మెరిడియన్ 3డీ సరౌండ్ సిస్టం ఉంటుంది. ఇవన్నీ ప్రయాణికులకు.. ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

రేంజ్ రోవర్ ఎస్‌వీ సేరినిటీ ఎడిషన్ 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. దీనికి హైబ్రిడ్ అసిస్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

జాన్వీ కపూర్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్

నటి జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 3.5 కోట్లు. ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. క్రోమ్ బిట్స్.. దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. శిఖర్ పహారియా యొక్క కొత్త రేంజ్ రోవర్ మాదిరిగానే.. జాన్వీ కపూర్ లెక్సస్ కారులోని వెనుక సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇవి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారులో ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు ఒట్టోమన్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రిజ్ వంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటు.. వెనుక గ్లోవ్ బాక్స్‌లు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, అంబ్రెల్లా హోల్డర్, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సిస్టం మొదలైనవి ఉన్నాయి.

కొత్త లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ 2.5 లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 పీఎస్ పవర్, 239 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

నిజానికి లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ కారు.. జాన్వీ కపూర్ దగ్గర మాత్రమే కాకుండా, చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఉంది. ఈ జాబితాలో రణ్‌బీర్ కపూర్, రాధికా మర్చంట్ అంబానీ, హార్దిక్ పాండ్యా మరియు షారుక్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. కారు ఖరీదైనదే అయినప్పటికీ, దీనిని కొనుగోలు చేస్తున్న ప్రముఖులు మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

0

2025 Toyota Land Cruiser 300 launched in India: రాజకీయ నాయకులకు మరియు పారిశ్రామిక వేత్తలకు ఇష్టమైన కార్లలో ఒకటైన ‘టయోటా ల్యాండ్ క్రూయిజర్’ ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. కంపెనీ 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 పేరుతో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి? ఫీచర్స్ మరియు ఇంజిన్ ఆప్షన్స్ వంటి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు

జపనీస్ బ్రాండ్ టయోటా.. అధికారిక వెబ్‌సైట్ నుంచి SUVని తొలగించిన నెల రోజుల తరువాత.. మళ్ళీ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 2.31 కోట్ల నుంచి రూ. 2.41 కోట్ల మధ్య ఉంది. ఇది జెడ్ఎక్స్ మరియు జీఆర్-ఎస్ అనే రెండు వేరియంట్లలో ఉంది. కొనుగోలుదారులు ఇందులో నచ్చిన వేరియంట్ ఎంచుకోవచ్చు. దీని కోసం బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 21 లక్షలు ఎక్కువ.

కంపెనీ లాంచ్ చేసిన 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్ కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. అయితే ధర, పరిమాణం మరియు పవర్‌ట్రెయిన్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే.. దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. కానీ రేంజ్ రోవర్ (రూ. 2.4 కోట్ల నుంచి రూ. 4.4 కోట్లు) మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ 63 (రూ. 3.6 కోట్లు) వంటి వాటికి ధరల పరంగా కొంత పోటీ ఇవ్వాల్సి ఉంది.

ఫీచర్స్

ఐదు మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే.. కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సన్‌రూఫ్, ఫ్రంట్ అండ్ రియర్ సీట్ వెంటిలేషన్, మాన్యువల్ లంబార్ అడ్జస్ట్‌మెంట్‌తో 8 వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కింద కూల్ బాక్స్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 కారులో టయోటా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి రిమోట్ ఏసీ, జియో లొకేషన్, ఫెన్సింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ఇందులో అనలాగ్ డయల్స్.. సెంట్రల్ మల్టీ ఇన్ఫో డిస్‌ప్లేతో వస్తాయి) గేర్ నాబ్ కోసం లెథరెట్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి.

ఇక జెడ్ఎక్స్ వేరియంట్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పవర్డ్ టెయిల్‌గేట్, ఫ్రంట్ అండ్ రియర్ డిఫరెన్షియల్ లాక్స్, వెనుక భాగంలో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్స్ వంటివి ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ కోసం క్రాల్ కంట్రోల్, హిల్ స్టార్ట్ మరియు డీసెంట్ అసిస్ట్, టెర్రైన్ మోడ్‌లు, యాంక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. ఆకర్షణీయమైన ఫ్రంట్ బంపర్, బ్లాక్ అల్లాయ్ బెల్ మరియు ఎక్స్‌టీరియర్‌లో జీఆర్ బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్

2025 టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారు.. ప్రెషియస్ వైట్ పెర్ల్ మరియు యాటిట్యూడ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. జీఆర్-ఎస్ వేరియంట్ బ్లాక్ మరియు ముదురు ఎరుపు రంగులో.. జెడ్ఎక్స్ వేరియంట్ లేత గోధుమ రంగు మరియు నలుపు రంగులలో లభిస్తుంది.

Also Read: సరికొత్త ఏప్రిలియా టువోనో 457: రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!

సేఫ్టీ ఫీచర విషయానికి వస్తే.. 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం కూడా ఉంది. అంతే కాకుండా అడాప్టివ్ హెడ్‌లైట్స్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్ రోడింగ్ సమయంలో కూడా మంచి భద్రతను అందిస్తాయి.

ఇంజిన్ డీటైల్స్

ల్యాండ్ క్రూయిజర్ అంటేనే పటిష్టమైన ఇంజిన్.. కాబట్టి 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 మరియు జీఆర్-ఎస్ రెండూ కూడా ఒకేరకమైన 3.3 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ పొందుతాయి. ఇది 309 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 10 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి నాలుగు చక్రాలకు పవర్ అందిస్తుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది సాధారణ రోడ్ల మీద మాత్రమే కాకుండా కఠినమైన భూభాగాల్లో కూడా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: భారత్‌లో టెస్లా షోరూమ్‌లు అక్కడే!.. ఫస్ట్ ఆ కారుతోనే సేల్స్?

నిజానికి ల్యాండ్ క్రూయిజర్ కార్లు మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారణంగా వీటిని పొలిటికల్ లీడర్స్ ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సినీ ప్రముఖులలో కూడా కొంతమంది ఈ కార్లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇండియన్ మార్కెట్లో ల్యాండ్ క్రూయిజర్ కార్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయాలు అధికారికంగా త్వరలోనే తెలుస్తాయి.

భారత్‌లో టెస్లా షోరూమ్‌లు అక్కడే!.. ఫస్ట్ ఆ కారుతోనే సేల్స్?

0

Tesla Showrooms in And First Car in India: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలో.. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా (Tesla) కంపెనీ, భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పుడు కంపెనీ తన షోరూమ్‌లను ఎక్కడ ప్రారంభిస్తుందని విషయం కూడా తెలిసిపోయింది.

గతంలో టెస్లా కంపెనీ బెంగళూరులో, ముంబైలో తన షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు తన రెండు షోరూమ్‌లలో.. ఒకదాన్ని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో, మరొకదాన్ని ఢిల్లిలోని ఏరోసిటీలో ప్రారంభించనుంది. దీనికోసం ఇక్కడా స్థలాలను కూడా లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కూడా విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి.

ఉద్యోగుల కోసం అన్వేషణ

కంపెనీ ప్రారంభించనున్న కొత్త షోరూమ్‌లలో పని చేయడానికి.. స్టోర్ మేనేజర్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాల కోసం నిపుణులను కూడా వెతుకుతోంది. కాగా.. కంపెనీ కార్లను కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా టెస్లా మోడల్ 3 కార్లను.. మాత్రమే మొదట ఇండియన్ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని సమాచారం.

టెస్లా కంపెనీకి.. భారతదేశంలో తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన లేనట్లే తెలుస్తోంది. ఈ కారణంగానే టెస్లా కార్లు సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి వస్తాయి. ఇండియన్ గవర్నమెంట్ కూడా 40000 డాలర్ల కంటే ఎక్కువ.. ఖరీదైన కార్ల మీద సుంకాలను 100 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ.. టెస్లా కార్లు ఖరీదైనవిగానే ఉండే అవకాశం ఉంది. మోడల్ 3 కార్ల ధరలు రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే అమెరికా విధించే సుంకాల కారణంగా.. ఎలక్ట్రిక్ కార్లపైన భారత్ సుంకాలను మరింత తగ్గిస్తుందా?.. లేదా? విషయం తెలియాల్సి ఉంది.

భారతదేశం కోసం తీసుకొచ్చే టెస్లా కార్ల యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న టెస్లా కార్లు.. ఎలాంటి డిజైన్? ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటాయనేది తెలియాల్సి ఉంది.

మోదీతో మస్క్ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం తరువాత, ఇండియాలో టెస్లా అరంగేట్రం ఖాయమైంది. ఈ కారణంగానే.. కంపెనీ కూడా ఉద్యోగుల కోసం నియమాలను చేస్తోంది. కాగా కంపెనీ ప్రారంభించనున్న ఒక్కో షోరూమ్ 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ షోరూమ్‌లను కంపెనీ ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయం మాత్రమే అధికారికంగా వెల్లడి కాలేదు.

టెస్లా మోడల్ 3 (Tesla Model 3)

అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం.. టెస్లా భారతదేశంలో లాంచ్ చేయాలని భావిస్తున్న ‘మోడల్ 3’, బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి బీఎండబ్ల్యూ 3 సిరీస్ మాదిరిగా ఉంటుంది. బ్యాటరీ ఎంపికలను బట్టి ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇండియన్ మార్కెట్లో టాప్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయ్యే సూచనలు ఉన్నాయి.

Also Read: బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

చూడటానికి అద్భుతంగా కనిపించే.. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ లాంగ్ రేంజ్ మోడల్ 78.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా.. ఒక సింగిల్ ఛార్జితో 678 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. 977 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఈ కారు 5 సీటింగ్ ఆప్షన్ పొందుతుంది. అంతే కాకుండా ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుందని సమాచారం.

ఫీచర్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు 15.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, క్లైమేట్ కంట్రోల్ వంటివన్నీ పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఇవి కాకుండా ఇతర ఫీచర్స్ ఏమైనా ఉంటాయా?.. ధరలు ఎలా ఉండనున్నాయి? అనే వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Also Read: ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్: టెస్లాతో ఎలా పోటీ పడతామంటే?

టెస్లా కార్ల విక్రయాలు 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. కంపెనీ అప్పటికి షోరూమ్‌లను సిద్ధం చేయాలి.

మస్క్ సంపద మరియు కార్ కలెక్షన్స్ (ELon Musk Networth and Car Collection)

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో టెస్లా మాత్రమే కాకుండా, ఎక్స్ (ట్విటర్), స్పేస్ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత.. మస్క్ షేర్స్ భారీగా పెరిగాయి. దీంతో ఈయన సంపద భారీగా పెరిగిపోయింది. మొత్తం మీద ఈయన సంపద రూ. 34 లక్షల కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈయన ఉపయోగించే కార్ల జాబితాలో పోర్స్చే 911 టర్బో, హామాన్ బీఎండబ్ల్యూ ఎం5, 1920 ఫోర్డ్ మోడల్ టీ, 2010 ఆడి క్యూ7, 2008 టెస్లా రోడ్‌స్టర్, 1997 మెక్‌లారెన్ ఎఫ్1, టెస్లా మోడల్ ఎక్స్, టెస్లా మోడల్ ఎస్ మరియు టెస్లా సైబర్ ట్రక్ మొదలైనవి ఉన్నాయి.

ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్: టెస్లాతో ఎలా పోటీ పడతామంటే?

0

Anand Mahindra Tweet About Plans To Take Giant Tesla in India: చాలా సంవత్సరాలుగా అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla).. భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్దమవుతూనే ఉంది. కాగా ఇప్పుడు త్వరలోనే రానున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) యొక్క టెస్లా, ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే.. దేశీయ వాహన తయారీ సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) టెస్లా కంపెనీని ఎలా ఎదుర్కొనబోతున్నారో వెల్లడించారు.

టెస్లాతో మీరు ఎలా పోటీ పడతారు? అనే ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా సమాధానమిస్తూ.. 1991లో ఇండియన్ ఎకానమీ ప్రారంభమైనప్పటి నుంచి మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. టాటా, మారుతి మరియు ఇతర ఎమ్‌ఎన్‌సీ కంపెనీలతో పోటీ పడుతున్నాము. ఎలాంటి సంస్థతో అయినా మేము పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాము. దానికి తగినట్లు పనిచేస్తామని అన్నారు.

ఈ మాటలను బట్టి చూస్తే.. దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా టెస్లా అరంగేట్రం పట్ల ఏ మాత్రం భయపడటం లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే కంపెనీ ఉత్పత్తులపై, దానికున్న ప్రగాఢ విశ్వాసమనే తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో అడుగుపెట్టిన ‘బీఈ 6 (BE 6) మరియు ఎక్స్ఈవీ 9 ఈ (XEV 9e)’ ఎలక్ట్రిక్ కార్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్మించబడ్డాయి. ఈ కార్ల కోసం బుకింగ్స్ ప్రారంభమైన ఒక్క రోజులోనే రూ. 8,472 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో మహీంద్రా కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.

ఐసీఈ వాహన రంగంలో ప్రధాన బ్రాండ్స్.. తప్పకుండా ఆటో దిగ్గజాలతో పోటీ పడాల్సిందే. భారతదేశంలోకి అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ వచ్చాయి.. పోయాయి. మహీంద్రా మాత్రం అనేక పరీక్షలలో నెగ్గి.. నేడు దిగ్గజ కంపెనీలకు సైతం పోటీ ఇస్తోంది. దీనికి కారణం ఉత్పత్తిలో నాణ్యత మరియు ఇంజినీర్స్ అద్భుత ప్రతిభ అని అన్నారు. టెస్లాను ఎదుర్కోవడం కూడా ఓ గొప్ప సవాలు అని ఆయన స్పష్టం చేశారు.

టెస్లాతో మహీంద్రా పోటీ..

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో ముందుకు సాగుతున్న టెస్లా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రచదారణ పొందిన అంతర్జాతీయ బ్రాండ్. ఇప్పటి వరకు టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లో టెస్లా కార్లను లాంచ్ చేయలేదు, దీనికి సంబంధించిన ఒక్క డీలర్షిప్ కూడా దేశంలో లేదు. అయితే ఇప్పుడు కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.

అంతర్జీతీయ మార్కెట్లో ఆధిపత్యాన్ని కలిగి ఉన్న టెస్లా కంపెనీకి.. గొప్ప టెక్నాలజీ ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మహీంద్రా కంపెనీకి ఒక ప్రత్యేకమైన ఆదరణ, డిమాండ్ ఉంది. కాబట్టి మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియన్ మార్కెట్లో టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా.. ఒకప్పటి నుంచే ప్రజల నమ్మకాన్ని పొందింది. ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో కొత్త కార్లను లాంచ్ చేస్తున్న మహీంద్రా కంపెనీ యొక్క కార్లు.. సరసమైనవి మరియు భారతీయ రోడ్లకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్లను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తోంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా మహీంద్రా.. దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. టెస్లా కూడా ఇండియన్ మార్కెట్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.

Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

భారతీయ మార్కెట్లో టెస్లా తన ‘మోడల్ 3’ను లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారు ధర రూ. 60 లక్షల నుంచి రూ. 90 లక్షల మధ్య ఉంటుంది. కాబట్టి ఇది ప్రీమియం విభాగంలోకి వస్తుంది. ఇంత డబ్బు వెచ్చించి.. కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య, మన దేశంలో చాలా తక్కువే. మహీంద్రా కార్ల ధరలు చాలా తక్కువాగే ఉన్నాయి. కాబట్టి ధరల పరంగా టెస్లా కొంత ఇబ్బంది పడవచ్చు. ధరలను తగ్గించడానికి టెస్లా.. దేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనుకున్నప్పటికీ.. దీనికున్న నెట్‌వర్క్ మహీంద్రాతో పోలిస్తే, చాలా తక్కువ. దీనిని టెస్లా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్న మహీంద్రా

మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ XUV400, XUV 9e మరియు BE 6 వంటి వాటిని లాంచ్ చేసింది. కాగా సంస్థ త్వరలోనే XEV 7e కారును కూడా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో కూడా టెస్లా మహీంద్రా కంపెనీతో పోటీ పడాల్సి ఉంటుంది.

Also Read: బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

టెస్లా కంపెనీకి.. తన అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి, సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి కొంత సమయం పడుతుంది.అయితే మహీంద్రా ఇప్పటికే దేశీయ విఫణిలో ఓ సుస్థిరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇందులో డీలర్షిప్స్ మాత్రమే కాకుండా సర్వీస్ సెంటర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ కస్టమర్లకు ఎలాంటి సర్వీస్ అందించడానికైనా సిద్ధంగా ఉంది.

మేక్ ఇన్ ఇండియా చొరవ

భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవతో.. మహీంద్రా మరియు టాటా కంపెనీలకు ప్రోత్సాహకాలను మరియు సబ్సిడీ వంటి వాటివి అందిస్తోంది. టెస్లా విదేశీ కంపెనీ కాబట్టి ఇలాంటి సదుపాయాలు బహుశా అందకపోవచ్చు. కాబట్టి ఆ కంపెనీ తన కార్లను ఎక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ప్రపంచ కుబేరుడైన మస్క్.. భారత ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రయోజనాలను పొందే అవకాశం కూడా లేకపోలేదు. కానీ దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా టెస్లా కంపెనీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్న సమయంలో.. టెస్లా భారతీయ మార్కెట్లో ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇండియాలో కంపెనీ సేల్స్ మరియు సర్వీస్ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి 13 ఉద్యోగులను నియమించుకోవడానికి ముందడుగు వేసింది. మొత్తం మీద అమెరికన్ బ్రాండ్ టెస్లా.. ఇండియాలో కూడా తన హవా చూపించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.