37.1 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 47

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

0

Mahindra 2023 October Discount Offers: భారతదేశంలో సాధారణ రోజుల్లో పోలిస్తే పండుగ సీజన్లలో ఎక్కువమంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ తరుణంలో కంపెనీలు కూడా అమ్మకాలను పెంచుకోవడానికి డిస్కౌంట్స్, ఆఫర్స్ వంటివి అందిస్తాయి. ఈ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400)

మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ400 మీద రూ. 1.25 లక్షల క్యాష్ డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే ప్రస్తుతం మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇది. దీనిపైన ఎటువంటి ఫ్రీ యాక్ససరీస్ లభించే అవకాశం లేదు. ఈఎస్‌సీ లేని మోడల్‌లపై మాత్రం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఇది ఉంటే కేవలం రూ. 50,000 మాత్రమే క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ EC మరియు EL అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇవి వరుసగా 34.5 కిలోవాట్, 39.4 కిలోవాట్ బ్యాటరీ కలిగి.. 375 కిమీ మరియు 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ రెండూ 150 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ద్వారా శక్తిని పొందుతాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ300 విషయానికి వస్తే, ఈ కారు కొనుగోలుపైన రూ. 90,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లపై రూ. 4000 నుంచి రూ. 90000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ మరియు ఫ్రీ యాక్ససరీస్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

ఎక్స్‌యూవీ300 రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. అవి 110 హార్స్ పవర్ మరియు 131 హార్స్ పవర్ అందించే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 117 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్ పొందుతాయి.

మహీంద్రా మొరాజో (Mahindra Marazzo)

మొరాజో కారు మీద కంపెనీ ఈ నెలలో రూ. 73,300 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. సంస్థ అన్ని వేరియంట్ల మీద ఈ తగ్గింపుని అందిస్తుంది. ఈ క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా రూ. 15,000 విలువైన ఫ్రీ యాక్ససరీస్ కూడా అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 123 హార్స్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero)

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బొలెరో మీద మహీంద్రా రూ. 70,000 వరకు బెనిఫీట్స్ అందిస్తుంది. అయితే ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రూ. 35,000 నుంచి రూ. 70,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులోని మూడు వేరియంట్స్ రూ. 20,000 విలువైన యాక్ససరీస్ ఉచితంగా అందిస్తుంది.

B4, B6 మరియు B6 (O) వేరియంట్‌లు వరుసగా రూ. 30000, రూ. 15000, రూ. 50000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. బొలెరోలోని 1.5 లెటర్ డీజిల్ ఇంజిన్ 76 హార్స్ పవర్ మరియు 210 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)

బొలెరో నియో మీద మహీంద్రా రూ. 50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది N4, N8, N10 మరియు N10 (O) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎంచుకునే వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ లభిస్తుంది. N4, N8లు వరుసగా రూ. 5000 మరియు రూ. 11000 వరకు క్యాష్ డిస్కౌంట్ పొందుతాయి. కాగా N10, N10 (O)లు రూ. 30000 వరకు డిస్కౌంట్స్ పొందుతాయి.

Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరంలో వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా డిస్కౌంట్ అనేది స్టాక్ మీద ఆధారపడి ఉంటుంది. కావున ఖచ్చితమైన తగ్గింపులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ సందర్శించి తెలుసుకోవచ్చు.