33.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 5

బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

0

Top 5 Things You Need To Know About The New BYD Sealion 7: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఎలక్ట్రిక్ కారు ఎట్టకేలకు మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు తప్పకుండా 5 విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ ఐదు విషయాలను వివరంగా తెలుసుకుందాం.

1. ధర మరియు వేరియంట్స్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి ప్రీమియం (రూ. 48.90 లక్షలు), పెర్ఫామెన్స్ (రూ. 54.90 లక్షలు). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం సంస్థ 1000 కంటే ఎక్కువ ఆర్డర్స్ స్వీకరించినట్లు తెలుస్తోంది. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

2. డిజైన్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత బీవైడీ సీల్ మాదిరిగా ఉన్నప్పటికీ, పరీక్షగా గమనిస్తే.. ఇది సరికొత్త మోడల్ అని అర్థమవుతుంది. ఫ్రంట్ ఫాసియా యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్.. డీఆర్ఎల్‌తో కలిస్తుంది. ఇవి యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ల వెలుపల దిగువ వరకు విస్తరించి ఉంటాయి. వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లౌడింగ్.. రూఫ్‌లైన్ వాలుగా కూపే మాదిరిగా ఉంటుంది. రియర్ విండ్‌స్క్రీన్ కింద ఉన్న చిన్న బూట్ డెక్ కూడా ఇక్కడ గుర్తించదగిన మరో అంశం. వెనుక మొత్తం వెడల్పు అంతటా విస్తరించి ఉండే టెయిల్ లైట్.. రియర్ డిఫ్యూజర్‌ను కూడా పొందుతుంది.

3. ఫీచర్స్

కారు గురించి తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఫీచర్స్ గురించి తెలుసుకోవాల్సిందే. కాబట్టి బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారులో 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఏసీ వెంట్స్ టచ్‌స్క్రీన్ కింద ఉండటం చూడవచ్చు. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, హెడ్స్ ఆప్ డిస్‌ప్లే, పవర్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ అండ్ రియర్ కొలిషన్ వార్ణింగ్, ఆటోమాటిక్ బ్రేకింగ్‌తో ఫ్రంట్ అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్.. లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివాటితో కూడిన.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

4. బ్యాటరీ అండ్ రేంజ్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటార్ మరియు డ్యూయెల్ మోటార్ రెండింటిలోనూ లభిస్తుంది. రెండూ 82.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింగిల్ మోటార్ వేరియంట్ 308 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. డ్యూయెల్ మొదటి వెర్షన్ 523 Bhp పవర్ అందిస్తుంది.

సింగిల్ మోటార్ ప్రీమియం వేరియంట్ 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం (యాక్సిలరేషన్) కావడానికి 6.7 సెకన్లు మాత్రమే. డ్యూయెల్ మోటార్ పెర్ఫామెన్స్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. సింగిల్ మోటార్ వేరియంట్ వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 587 కిమీ రేంజ్ అందిస్తుంది. పెర్ఫామెన్స్ ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌లో 542 కిమీ రేంజ్ అందిస్తుంది.

Also Read: లాంచ్‌కు సిద్దమవుతున్న టయోటా కార్లు ఇవే: ఇక మార్కెట్లో రచ్చ.. రచ్చే!

5. ప్రత్యర్థులు

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీవైడీ కంపెనీ యొక్క కార్లకు ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ ఉంది. కాబట్టి ఈ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కూడా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఇండియన్ మార్కెట్లోని బీవైడీ కార్లు

బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) కంపెనీ చైనా బ్రాండ్ అయినప్పటికీ.. కార్లన్నీ సరికొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండటం వల్ల మరియు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం వల్ల ఎక్కువమందిని ఆకర్షిస్తున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు ఆట్టో 3, సీల్ మరియు ఈ మ్యాక్స్ 7 వంటి వంటి వాటిని మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా సీలియన్ 7 లాంచ్ చేసింది.

Also Read: సరికొత్త ఏప్రిలియా టువోనో 457.. రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!

ఎలక్ట్రిక్ కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉండటం వల్ల.. చాలా కంపెనీలు తమ కార్లను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ, వోల్వో మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసి.. అత్యుత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నాయి.

సరికొత్త ఏప్రిలియా టువోనో 457: రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!

0

Aprilia Tuono 457 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘ఏప్రిలియా టువోనో 457’ (Aprilia Tuono 457) భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ EICMA 2024 కార్యక్రమంలో కనిపించిన తరువాత.. మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. ఈ బైక్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ఇంజిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఏప్రిలియా టువోనో 457 బైక్ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్ – షోరూమ్, మహారాష్ట్ర). ఈ బైక్ ఆర్ఎస్ 457 బైక్ ఆధారంగా రూపొందించినప్పటికీ.. ఇది స్పోర్ట్ నేక్డ్ బైక్. కానీ యాంత్రికంగా ఆర్ఎస్ 457 మాదిరిగానే ఉంటుంది. ఎలాంటి మార్పులు ఉండవు. ఇంజిన్ ఒకేలా ఉన్నప్పటికీ.. స్టైలింగ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టెస్ట్ రైడ్ మరియు డెలివరీలు 2025 మార్చిలో ప్రారంభమవుతాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

ఏప్రిలియా టువోనో 457 బైక్.. బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో చిన్న కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్.. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు భాగంలోని ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్.. టువోనో 1000 ఆర్ బైకును గుర్తుకు తెస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ ఆర్ఎస్ 457 మాదిరిగా ఉంటుంది. స్టెప్ అప్ సీటు ఇందులో చూడవచ్చు. ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టువోనో 457 బైక్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి పిరాన్హా రెడ్ మరియు ప్యూమా గ్రే కలర్స్. ఈ రెండూ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కొనుగోలుదారులు.. ఇందులో తమకు నచ్చిన కలర్ బైక్ ఎంచుకోవచ్చు.

ఇంజిన్ వివరాలు

కొత్త ఏప్రిలియా టువోనో 457 బైక్.. సాధారణ ఆర్ఎస్ 457 బైకులో ఉండే అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ 9400 rpm వద్ద 47.6 హార్స్ పవర్ మరియు 6700 rpm వద్ద 43.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో పాటు.. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అనేది ఆప్షనల్. ఇక ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేక్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా సాధారణ ఆర్ఎస్ 457 మాదిరిగానే ఉంటాయి.

ఏప్రిలియా టువోనో 457 బైక్ యొక్క ముందు భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ యూఎస్డీ పోర్క్, 120 మిమీ వీల్ ట్రావెల్ మరియు వెనుక భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్, 130 మిమీ వీల్ ట్రావెల్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ ఉంటుంది. బైక్ యొక్క రెండు చివర్లలో 17 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. దీని బరువు 175 కేజీలు.. కాగా ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.7 లీటర్లు కావడం గమనార్హం.

ఫీచర్స్

టువోనో 457 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 5.0 ఇంచెస్ TFT కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఏప్రిలియా రైడ్ బై వైర్ సిస్టం పొందుతుంది. కాబట్టి బైక్ గురించి చాలా సమాచారం అందిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ మాత్రమే కాకుండా ఎకో, స్పోర్ట్స్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు.. ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

యాక్ససెరీస్ మరియు ప్రత్యర్థులు

ఏప్రిలియా టువోనో 457 బైకును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి బ్రాండ్ యొక్క యాక్సెసరీస్ ఉపయోగించుకోవచ్చు. ఇందులో క్విక్‌షిఫ్టర్, ఎలక్ట్రానిక్ యాన్తి తెఫ్ట్ సిస్టం, ఫోర్క్ స్లైడర్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలనవెన్నో ఉన్నాయి. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ యమహా ఏంటీ-03 మరియు కేటీఎమ్ డ్యూక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కంపెనీ లాంచ్ చేసిన టువోనో 457 బైక్ ధర (రూ. 3.95 లక్షలు).. ఆర్ఎస్ 457 ధర కంటే కూడా రూ. 25000 తక్కువ. ధర తక్కువైనా.. అద్భుతమైన ఫీచర్స్.. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉండటం వల్ల.. ఇది తప్పకుండా గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. సంస్థ ఇప్పటికే.. ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎంతమంది కస్టమర్లను ఆకర్శించనుంది అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Also Read: రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..

ఇండియన్ మార్కెట్లోని ఏప్రిలియా టూ-వీలర్స్

భారతీయ విఫణిలో ఏప్రిలియా టువోనో 457 మరియు ఆర్ఎస్ 457 మాత్రమే కాకుండా ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125, ఆర్‌ఎస్‌వీ4, ఆర్ఎస్ 660, ఎస్ఎక్స్ఆర్ 160, స్ట్రోమ్ 125, ఎస్ఎక్స్ఆర్ 125 మరియు టువోనో 660 వంటి బైకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి.

తమన్‏కు డాకు మహారాజ్ కాస్ట్‌లీ గిఫ్ట్: కారు రేటు తెలిస్తే షాకవ్వడం పక్కా!

0

Balakrishna Porsche Cayenne Gift To Thaman: ఆరు పదుల వయసుదాటినా యువ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసుదోచుకుంటున్న ‘నందమూరి బాలకృష్ణ’ (Nandamuri Balakrishna) ఇటీవల.. మ్యూజిక్ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ అయిన ‘ఎస్ఎస్ తమన్’కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ బాలయ్య ఇచ్చిన కారు ఏది?.. దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బాలకృష్ణ గిఫ్ట్ ఇచ్చిన కారు.. పోర్స్చే కంపెనీకి చెందిన ‘కయెన్’ (Porsche Cayenne) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమా విజయవంతం అయిన సందర్భంగా.. తమన్‏కు కాస్ట్లీ కారును గిఫ్ట్ ఇచ్చారు. కారును గిఫ్ట్ ఇచ్చిన తరువాత తమన్‏ను.. బాలయ్య ఆశీర్వదించడం కూడా ఫోటోలలో చూడవచ్చు.

తమన్‏కు ఇచ్చిన పోర్స్చే కయెన్ కారు క్వార్ట్జ్ గ్రే మెటాలిక్ షేడ్‌లో ఉంది. ఈ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 1.42 కోట్లు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 2 కోట్లు వరకు ఉంటుంది. అయితే తమన్‏కు ఇచ్చిన పోర్స్చే కారు ఏ వేరియంట్ అనేది తెలియాల్సి ఉంది.

పోర్స్చే కయెన్

భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన పోర్స్చే కయెన్ కారు.. ఎంతోమంది సెలబ్రిటీల లేదా ప్రముఖుల మనసు దోచింది. కంపెనీ 2023లో కయెన్ కూపేతో పాటు.. ఫేస్‌లిఫ్టెడ్ కయెన్‌ను లాంచ్ చేసింది. ఈ కారు డెలివరీలు కూడా గత ఏడాది జులైలోనే ప్రారంభమయ్యాయి. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ కాస్మొటిక్ డిజైన్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఆప్షనల్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటివి ఉన్నాయి. నెంబర్ ప్లేట్ అనేది టెయిల్‌గేట్ మీద కాకుండా బంపర్ మీద ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. పోర్స్చే కయెన్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ పొందుతుంది. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు ప్రయాణికుల కోసం 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. ప్యాసింజర్ స్క్రీన్ అనేది ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుంది. స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

పోర్స్చే కయెన్ కారులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ6 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఇంజిన్ 353 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

కయెన్ కారును పోర్స్చే కంపెనీ ఈ-హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా విక్రయిస్తోంది. ఇది 470 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఆడి క్యూ8 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కార్ల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

డాకు మహారాజ్

నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్.. గొప్ప విజయం సాధించిందో. బాబీ కొల్లి దర్శకత్వంలో.. నాగవంశీ (సితారా ఎంటర్‌టైన్‌మెంట్) నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ మరియు ఊర్వశి రౌతేలా వంటి ప్రముకులు నటించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సుమారు 125 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగానే బాలయ్య.. తమన్‏కు ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చారు.

డాకు మహారాజ్ సినిమాకు.. బాలయ్య నటన ఒక ఎత్తు అయితే, తమన్ మ్యూజిక్ మరింత ఊపునిచ్చాయి. మొత్తం మీద ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించింది. ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. అఖండ పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

సినీ హీరోలు కార్లను గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు

నిజానికి సినిమా హీరోలు కార్లను గిఫ్ట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. భీష్మ సినిమా ఘన విజయం సాధించిన తరువాత.. ‘నితిన్’ దర్శకుడు ‘వెంకీ కుడుముల’కు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. నటుడు ప్రభాస్ కూడా.. తన జిమ్ ట్రైనర్‌కు ఓ ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే.. చాలా రోజుల క్రితం నుంచి హీరోలు ఖరీదైన కార్లను గిఫ్ట్ ఇస్తున్న ట్రెండ్ చాలా రోజుల నుంచే సాగుతోందని స్పష్టమవుతోంది. ఇది హీరోలకు.. సన్నితులపై ఉన్న అభిమానాన్ని గుర్తుకు తెస్తుంది. ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా గిఫ్ట్స్ ఇచ్చే సాంప్రదాయం కోలీవుడ్, బాలీవుడ్ వంటి చిత్ర సీమలో కూడా కొనసాగుతూనే ఉంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న టయోటా కార్లు ఇవే: ఇక మార్కెట్లో రచ్చ.. రచ్చే!

0

Upcoming Toyota Cars in India 2025: 2024లో లెక్కకు మించిన వాహనాలను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ ‘టయోటా’ (Toyota) ఈ ఏడాది మరో నాలుగు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో అర్బన్ క్రూయిజర్ ఈవీ, హైరైడర్ 7 సీటర్, ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ మరియు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban Cruiser EV)

ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. టయోటా కంపెనీ తన అర్బన్ క్రూయిజర్ కారును.. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీని ఉత్పత్తి ఈ ఏడాది రెండో అర్థ భాగంలో.. పండుగ సీజన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది త్వరలో మార్కెట్లో లాంచ్ అయ్యే ఈవిటారా ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్ (49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్) పొందనుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు ముందు ఇరుసుపై ఫిక్స్ చేయబడి ఉంటాయి. వేరియంట్‌ను బట్టి పవర్ డెలివరీ మారుతూ ఉంటుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

డిజైన్ విషయానికి వస్తే.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, గ్రాండ్ విటారాకు భిన్నంగా ఉంటుంది. క్రోమ్ బార్‌ను కనెక్ట్ చేసే సన్నని హెడ్‌ల్యాంప్, అందంగా కనిపించే గ్రిల్, రెండు వర్టికల్ ఎయిర్ వెంట్‌లతో కూడిన బంపర్ ఇందులో చూడవచ్చు. ఇంటీరియర్ మరియు ఫీచర్స్ గురించి అధికారికంగా వెల్లడికావాల్సి వుంది. అయితే ఇందులో 10.1 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు టూ స్పోక్ ప్లేట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేషన్ సీట్లు, లెవెల్ ఏడీఏఎస్ మరియు 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి ఉండనున్నాయి.

టయోటా హైరైడర్ 7 సీటర్ (Toyota Hyryder 7 Seater)

ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్లలో టయోటా హైరైడర్ 7 సీటర్ కూడా ఉంది. కంపెనీ ఇప్పటికే ఈ వెర్షన్‌ను అభివృద్ధి చేసేపనిలో ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం వెల్లడికాలేదు. బహుశా 2025 చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

టయోటా హైరైడర్ 7 సీటర్ డిజైన్.. దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ, పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇంటీరియర్ కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఇందులో ఏడీఏఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉంటాయి.

ఇంజిన్ వివరాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది కూడా సాధారణ మోడల్ యొక్క అదే ఇంజిన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 1.5 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్డ్ పొందనుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ను పొందనున్నట్లు సమాచారం.

టయోటా ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ (Toyota Fortuner MHEV)

కంపెనీ లాంచ్ చేయనున్న మరో కారు టయోటా ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ. ఇది ఇటీవలే మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ పొందుతుంది. కాగా ఇప్పుడు మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ కారు 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్.. హైబ్రిడ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ద్వారా.. 16 Bhp పవర్, 42 Nm టార్క్ అందిస్తుందని సమాచారం. డీజిల్ ఇంజిన్ మరియు హైబ్రిడ్ సిస్టం ద్వారా.. 201 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 2 వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్ ఇందులో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇందులోని ఐడిల్ స్టార్ట్ – స్టాప్ ఫీచర్ వల్ల కొంత ఇంధనం పొదుపు అవుతుంది. ఈ కారులో కూడా ఏడీఏఎస్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో (Toyota Land Cruiser Prado)

కంపెనీ లాంచ్ చేయనున్న కార్లలో మరొకటి ‘టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో’. దీనిని 2025 చివరిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనిని కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU)గా దిగుమతి చేసుకుంటారు. కాబట్టి దీని ధర ఎక్కువగానే ఉంటుంది. ఇది టయోటా పోర్ట్‌ఫోలియోలో ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సీ300 కింద ఉంటుంది. కాగా ల్యాండ్ రోవర్ డిఫెండర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టయోటా.. కంపెనీ లాంచ్ చేయనున్న ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు . అయితే ఇందులో 2.8 లీటర్ ఇంజిన్ పొందనుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సిగ్నేచర్ మోనికర్‌తో కొత్త స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రెండవ మరియు మూడవ వరుసలలో ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

0

Alia Bhatt Net Worth Car Collection And Remuneration: సినీ ప్రపంచంలో అలియా భట్ (Alia Bhatt) పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే.. ఈమె ఒక స్టార్ హీరోయిన్, ఓ స్టార్ హీరోకు (రణ్‌బీర్ కపూర్) భార్య, స్టార్ డైరెక్టర్ (ప్రకాష్ పదుకొనె) కుమార్తె.. సుమారు మూడు పదుల వయసు దాటినా కూడా, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్న ఈ అమ్మడు, భర్త కంటే కూడా ఎక్కువ సంపాదిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతోంది. ఈమె గురించి మరిన్ని ఆసక్తికరమైన ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

దాదాపు ఐదేళ్లు ప్రేమించుకుని రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న అలియా భట్‌కు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ పాపా పేరు ‘రహ’. 1999లో బాలనటిగా సంఘర్ష్ సినిమాలో కనిపించిన అలియా.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రికార్డ్ బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్ర పోషించింది. అంతకంటే ముందు గంగూభాయ్ సినిమాలో నటించి ఎంతోమంది హృదయాలను గెలుచుకోవడం మాత్రమే కాకుండా.. ఉత్తమ నటి అవార్డును సైతం సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటికీ… స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. తన అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న దీపికా పదుకొనె మోడల్ కూడా. అటు బాలీవుడ్, మరోవైపు తెలుగులో కూడా తెరంగేట్రం చేసిన ఈమె ఆస్థి విషయంలో.. భర్తనే మించిపోయింది. ఈమె మొత్తం ఆస్తి ఏకంగా రూ. 550 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. పైగా సుమారు 300 కోట్ల విలువ చేసే ఒక బంగ్లాలో నివసిస్తూ.. ఖరీదైన అన్యదేశ్య కార్లను ఎన్నో ఉపయోగిస్తోంది.

నటుడు రణ్‌బీర్ ఆస్తుల విలువ రూ. 345 కోట్లు అని సమాచారం. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న అలియా భట్.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు బిజినెస్ కూడా చేస్తోంది. ఎడ్-ఏ-మమ్మా పేరుతో పిల్లల స్పోర్ట్స్‌వేర్ వ్యాపారంలో కూడా రాణిస్తోంది. ఈ సంస్థ కూడా బాగా అభివృద్ధి చెందింది. దీని విలువ రూ. 150 కోట్ల కంటే ఎక్కువని సమాచారం. సినిమా రంగంలో మాత్రమే కాకుండా.. దీపికా పదుకొనె వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తోంది.

అలియా భట్ కార్ కలెక్షన్ (Alia Bhatt Car Collection)

నటి అలియా భట్ ఉపయోగించే కార్లలో.. ఖరీదైన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఏ6 మరియు బీఎండబ్ల్యూ 7 సిరీస్ వంటివి ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ (Land Rover)

నటి అలియా ఉపయోగించే కార్ల జాబితాలో ఖరీదైన ల్యాండ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఉంది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ కారు.. వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. 2996 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 394 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇక డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఆడి క్యూ 5 (Audi Q5)

అలియా భట్ గ్యారేజిలోని కార్లలో ఆడి క్యూ 5 కూడా ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగి వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగిన ఈ కారు 1984 సీసీ ఇంజిన్ ద్వారా.. 245.49 Bhp పవర్, 370 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ కావడం గమనార్హం. ఈ కారు కేవలం దీపికా పదుకొనె గ్యారేజిలో మాత్రమే కాకుండా.. చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

Also Read: ప్రేమకు అర్థం ఏమంటే: చరిత్ర చెప్పిన సంగతులు.. తెలుసుకోవలసిన నిజాలు

ఆడి క్యూ7 & ఏ6 (Audi Q7 & A6)

ల్యాండ్ రోవర్ కారుతో పాటు.. రూ. 73.49 లక్షల ఖరీదైన ఆడి ఏ6 మరియు రూ. 86.92 లక్షల ఖరీదైన ఆడి క్యూ7 వంటి కార్లు ఉన్నాయి. క్యూ5తో కలిపి.. దీపికా పదుకొనె గ్యారేజిలో మొత్తం 3 ఆడి కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆడి క్యూ7 మరియు ఏ6 రెండూ కూడా అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతాయి. పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే.. చాలామంది ప్రముఖులు ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

దీపికా పదుకొనె గ్యారేజిలోని మరో ఖరీదైన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ 730ఎల్‌డీ. దీని ప్రారంభ ధర రూ. 1 కోటి కంటే ఎక్కువే. 2993 సీసీ ఇంజిన్ కలిగిన ఈ కారు 4000 rpm వద్ద 262 Bhp పవర్, 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. కాబట్టి దీనికి సెలబ్రిటీలు, క్రికెటర్స్ మాత్రమే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

Also Read: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

రణ్‌బీర్ కపూర్ కార్ కలెక్షన్ (Ranbir Kapoor Car Collection)

దీపికా పదుకొనె దగ్గర మాత్రమే కాకుండా.. నటుడు మరియు ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ దగ్గర కూడా చాలా కార్లు ఉన్నాయి. ఇందులో రూ. 5 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8, లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ), మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 (రూ. 2.28 కోట్లు), ఆడి ఏ8 ఎల్ (రూ. 1.71 కోట్లు), ఆడి ఆర్8 (రూ. 2.72 కోట్లు) మరియు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (రూ. 3.27 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.

రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..

0

Bajaj Pulsar NS125 Single Channel ABS:భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) 2025లో సరికొత్త పల్సర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బైక్ ‘పల్సర్ ఎన్ఎస్125’. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ధర ఇతర వేరియంట్స్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది.

బజాజ్ ఎన్ఎస్125 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే ఎన్ఎస్125 రూపంలో రెండు వేరియంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పుడు లాంచ్ అయిన బైక్.. ముచ్చటగా మూడోది. ఇది చూడటానికి.. కొంత దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.

ఇంజిన్ డీటైల్స్

ఆరంజ్, రెడ్, గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభించే బజాజ్ ఎన్ఎస్125.. 124.45 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 rpm వద్ద 11.82 Bhp పవర్, 7000 rpm వద్ద 11 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి వాహన ప్రియులు పనితీరు గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు.

బజాజ్ ఎన్ఎస్125 బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్లకు అందిస్తుంది. ఈ బైకును చాలామంది రోజువారి వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మరియు టీవీఎస్ రైడర్ 125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే.. బజాజ్ ఎన్ఎస్125 బైక్ స్ప్లిట్ సీటును పొందుతుంది. ఇది రైడర్ మరియు పిలియన్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ బైకును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బజాజ్ ఎన్ఎస్125 లాంచ్ సందర్భంగా.. బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్ సైకిల్ బిజినెస్ యూనిట్ హెడ్ ‘సారంగ్ కనడే’ మాట్లాడుతూ.. ఇప్పటికి జనరేషన్ ఏమి కోరుకుంటుందో మాకు తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ లేదా కొత్త బైకులు లాంచ్ చేస్తోంది. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త ఏబీఎస్ పల్సర్ ఎన్ఎస్125 తప్పకుండా బైక్ రైడర్లకు గొప్ప రైడింగ్ అనుభూతిని అందిస్తుందని అన్నారు.

పల్సర్ ఎన్ఎస్125.. 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్స్, వెనుక భాగంలో మోనో షాక సస్పెన్షన్ పొందుతుంది. ఈ బైక్ బరువు 144 కేజీలు కాగా.. సీటు ఎత్తు 805 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మీమీ. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా ఉపయోగకరమైన బైక్ అని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ సేల్స్

భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకుల జాబితాలో పల్సర్ కూడా ఒకటి. ఇప్పటి వరకు పల్సర్ బైకును 1.4 మిలియన్ (14 లక్షలు) మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ బైకుకు మంచి డిమాండ్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

బజాజ్ పల్సర్ విభాగంలో.. పల్సర్ ఎన్125, పల్సర్ ఎన్ఎస్400జెడ్, పల్సర్ ఆర్ఎస్200, పల్సర్ ఎన్250, పల్సర్ 220ఎఫ్, పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్150, పల్సర్ 150, పల్సర్ ఎన్ఎస్125 మరియు పల్సర్ 125 వంటివి ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. ఈ కారణంగానే.. బ్రాండ్ బైకులు విపరీతమైన సేల్స్ పొందుతున్నాయి.

Also Read: 2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..

ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎన్ఎస్125 ఏబీఎస్ వేరియంట్.. దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా ఎక్కువ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది.. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీని ఎదుర్కోనుంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఇతర పల్సర్ బండి మాదిరిగానే ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

ప్రేమకు అర్థం ఏమంటే: చరిత్ర చెప్పిన సంగతులు.. తెలుసుకోవలసిన నిజాలు

0

Special Story of Valentines Day and Love: ముందుగా ప్రేముకులందరికీ.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమ (Love).. ఇది వినడానికి రెండక్షరాలే అయినా, సమస్తం ఇందులోనే దాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూపులతో మొదలై.. విశ్వాన్ని సైతం మరిపించే శక్తి బహుశా ప్రేమకే ఉందేమో. ప్రేమ కోసం ఖండాలు దాటిన వ్యక్తులను ఎందోమందిని చూశాము, చూస్తున్నాము, అంత పవిత్రమైన బంధం ప్రేమ. ఈ రోజు ప్రేమకు అర్థాలు మారిపోతున్నాయి. ఈ రోజు ప్రేమించుకుని.. రేపటికే విడిపోతున్నారు. దీన్నే నేడు ప్రేమ అంటున్నారు.

చరిత్రలో ప్రేమ..

ప్రేమంటే నమ్మకం, బాధ్యత, భరోసా.. ఇలా ఎన్ని చెప్పినా, ప్రేమను వర్ణించడం కష్టమే. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. ఒక అమ్మాయి లేదా అబ్బాయి నిజాయితీగా ప్రేమించుకుంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోకూడదు. దీనికి మన చరిత్రే సాక్ష్యం. ఎన్నో దశాబ్దాల క్రితం ప్రేమించుకున్న ఆంటోని – క్లియోపాత్ర, ముంతాజ్ – షాజహాన్, రోమియో – జూలియట్, షిరిన్ – ఫర్హాద్, లైలా – మజ్ను వంటివారి ప్రేమ కథలు ఈ రోజుకి మనకు వినిపిస్తున్నాయంటే.. వారి ప్రేమలోని నిజాయితీనే కారణం. అందుకే వీరి ప్రేమను చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఈ విశ్వం ఉన్నంతకాలం.. తప్పకుండా వీరి ప్రేమ కథలు వినిపిస్తూనే ఉంటాయి.

ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పేరుతో వంచించడం తప్పు. ఒక మూర్ఖుడిని మార్చాలన్నా?.. ఒక వ్యక్తిని సరైన దారిలో నడిచేలా చేయాలన్నా.. అది తప్పకుండా ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఎందోమంది యువకులు తాము ప్రేమించిన అమ్మాయికి నచ్చినట్లు ఉండాలని.. అహర్నిశలు పరితపిస్తుంటారు. అమ్మాయిలు సైతం.. తమకు నచ్చిన అబ్బాయి దగ్గర చంటిపిల్లలైపోతారు. అందుకే ”ప్రేమను ప్రేమతో.. ప్రేమగా ప్రేమిస్తే.. ప్రేమించబడిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది”.

ప్రేమ ఎలా పుడుతుందంటే?

సినిమాల్లో చూపించినట్లు.. ప్రేమ పుట్టునప్పుడు లేదా ప్రేమించాల్సిన వ్యక్తి కనిపించినప్పుడు.. గుండెల్లో గంటలు మోగడం, మెరుపులు మెరవడం, వర్షం పడటం లాంటి సంఘటనలు జరగవు. అసలు ప్రేమ అనేది.. ఎవరి మీద ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అసలు ఎందుకు పుడుతుందో కూడా తెలియదు. అందుకే లవ్ ఈస్ బ్లైండ్ అంటారు.

లేటెస్ట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే?

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో.. ప్రేమించుకోవడానికి కూడా టెక్నాలజీలనే వాడేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకునే.. ఎక్స్(ట్విటర్)లో పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. ఇలా జరిగిన పెళ్లిళ్లు కొన్ని రోజులకు పెటాకులవుతున్నాయి. ఆ తరువాత ఎవరిదారి వారిదే. ఇలా అందరి జీవితాల్లో జరుగుతాయని చెప్పలేము కానీ.. కొంతమంది టెక్నాలజీలను నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. మరికొందరు.. తెలియనివారని నమ్మి మోసపోయి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో.. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

ప్రేమించుకోవడం బాగానే ఉంటుంది.. ఆ తరువాత పెద్దలను కాదని పెళ్లి చేసుకుని జీవితం మొదలు పెడితే.. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు దూరం పెట్టేస్తే.. అప్పుడప్పుడే ఊహల ప్రపంచం వీడి జీవితంలో అడుగుపెట్టిన పసి మొగ్గలు.. ఓ పెను తుఫాన్ లాంటి కష్టాలను దాటాల్సి ఉంటుంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ కష్టాల కడలి దాటితేనే అసలైన అందమైన జీవితం మొదలవుతుంది. ఆ కష్టాలను తట్టుకోలేక కన్ను మూసిన హృదయాలు ఎన్నో ఉన్నాయి.

ప్రేమ తప్పు కాదు!

రెండు మనసులు ప్రేమించుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రేమించాల్సిన వ్యక్తిని సెలక్ట్ చేసుకోవడంలో తప్పటడుగు వేసినా.. తప్పుడు వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినా.. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్లే. అయితే పిల్లల ప్రేమ విషయంలో పెద్దలు కూడా జాగ్రత్త వహించాలి. వారు ఎలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నారు? ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటున్నారు? అనే విషయాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వారిని దూరం చేసుకోకూడదు. పిల్లలు చేసిన తప్పును కొంత పెద్ద మనసుతో క్షమించి.. వారిని దగ్గర పెట్టుకుని కొంత ఎదగటానికి సహాయం చేయాలి. ప్రేమించడం తప్పని.. వారిని దూరం పెడితే, కష్టాలు తట్టుకోలేక కన్ను మూసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. కన్నబిడ్డలకు తల్లిదండ్రులే కడసారి వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది.

2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..

0

2025 Honda Shine 125 Launched In India: రోజువారీ వినియోగానికి లేదా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటైన ‘హోండా షైన్ 125’ (Honda Shine 125) ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. కంపెనీ ఈ బైకును ఓబీడీ2బీ (OBD2B) నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. కాబట్టి ధరలలో కూడా కొంత వ్యత్యాసం ఏర్పడింది.

కొత్త ధరలు

హోండా కొత్త షైన్ 125 బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్, మరొకటి డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 84,493 మరియు రూ. 89,245 (ధరలు, ఎక్స్ షోరూమ్ – ఢిల్లీ). ఈ ధరలు స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా రూ. 1242 (డ్రమ్ వేరియంట్) మరియు రూ. 1994 (డిస్క్ వేరియంట్) ఎక్కువ.

కొత్త హోండా షైన్ 125 బైక్ 123.94 సీసీ ఇంజిన్.. లేటెస్ట్ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఇది 7500 rpm వద్ద 14.9 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పనితీరు పరంగా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని సమాచారం. ఇంధన సామర్థ్యాన్ని పెంచే ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం కూడా ఈ బైకులో ఉంటుంది.

ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?

2025 హోండా షైన్ 125 లేదా కొత్త షైన్ 125 బైక్ ఇప్పుడు డిజిటల్ అనలాగ్ యూనిట్ స్థానంలో.. డిజిటల్ డ్యాష్ బోర్డు పొందుతుంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు.. మునుపటి బైకులోని సర్వీస్ డ్యూ ఇండికేటర్ మరియు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా కొత్త బైకులో లభిస్తాయి.USB టైప్ సీ పోర్ట్ కూడా కొత్త షైన్ 125లో కనిపిస్తుంది.

అప్డేటెడ్ హోండా షైన్ 125 బైక్ యొక్క వెనుక టైర్ ఇప్పుడు 90 సెక్షన్ యూనిట్, ఇది మునుపటి 80 సెక్షన్ టైర్ స్థానంలో ఫిక్స్ చేయబడింది. ఈ బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ మరియు పెర్ల్ సైరెన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల.. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ బైక్ కొనుగోలు చేయవచ్చు.

షైన్ 125 బైక్ మార్కెట్లో టీవీఎస్ కంపెనీకి చెందిన రేడియన్ మరియు హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన సూపర్ స్ప్లెండర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. షైన్ 125 మాత్రమే కాకుండా.. దీని ప్రత్యర్థులు కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. కాబట్టి 2025 షైన్ 125 బైక్ అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుంది.

హోండా షైన్ 125 అమ్మకాలు

కంపెనీ యొక్క హోండా షైన్ బైక్.. మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దాదాపు కోటి యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందింది. అంటే ఈ బైకును కోటి మంచి కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ బైకుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ మరింత ఆధునిక హంగులతో లాంచ్ అవ్వడంతో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Also Read: నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

హోండా షైన్ బైకును ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఈ బైక్ యొక్క సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా.. మంచి మైలేజ్ కూడా. ఈ బైక్ 55 కిమీ / లీ నుంచి 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకుండా లోడింగ్ కెపాసిటీ లేదా బరువులు మోయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణాల వల్లనే ఈ బైకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

చెప్పకనే చెప్పేసిన టిమ్ కుక్.. ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది: పూర్తి వివరాలివిగో..

0

Apple iPhone SE 4 Launch Date Revealed: ప్రపంచ మార్కెట్లో యాపిల్ కంపెనీ యొక్క ‘ఐఫోన్’లకు అధిక ప్రజాదరణ ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్లకు అభిమానుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త ఫోన్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు యాపిల్ మొబైల్స్ జాబితాలోకి మరో ఫోన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ టిమ్ కుక్ (Tim Cook) పరోక్షంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసాడు.

టిమ్ కుక్ షేర్ చేసిన ఏడు సెకండ్స్ వీడియోలో.. యాపిల్ లోగో మాత్రమే ఉంది. అయితే 2025 ఫిబ్రవరి 19వ తేదీ యాపిల్ కుటుంబంలో కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉందని అని ట్వీట్ చేసారు. దీన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే వారంలో యాపిల్ ఎస్ఈ 4 (Apple SE 4) లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విటర్)లో కూడా ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్ కూడా.

యాపిల్ ఎస్ఈ 4

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అనేక యాపిల్ మొబైల్స్ ఉన్నాయి. కాగా కంపెనీ త్వరలో ఓ కొత్త మోడల్ తీసుకురావడానికి సిద్ధమైంది. బహుశా ఇదే ‘ఎస్ఈ 4’ అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఐఫోన్ మొబైల్స్ కన్నా.. తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు.

ఎస్ఈ లైనప్ కొత్తేమీ కాదు. కాబట్టి కొందరు రాబోయే ఎస్ఈ 4 మొబైల్ పాత డిజైన్ కలిగి ఉంటుందని భావించవచ్చు. కానీ కంపెనీ దీనికి కొత్త డిజైన్ అందించే అవకాశం ఉంది. బహుశా దీని డిజైన్ ఐఫోన్ 14 మాదిరిగా ఉండే అవకాశం ఉంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు కూలంకశంగా తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

డిజైన్

ఇప్పటికి అందుబాటులో ఉండే సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్ దాదాపు ఐఫోన్ 14 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో ఎస్ఈ 14 ఫోన్స్ విక్రయిస్తోంది. కానీ ఎస్ఈ 4 లాంచ్ తరువాత ఐఫోన్ 14 కనుమరుగయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎస్ 4లో బయోమెట్రిక్ కోసం పేస్ ఐడీ అందించనున్నారు. ఎస్ఈ 3లో జనిపించే 4.7 ఇంచెస్ స్క్రీన్ మాదిరిగా కాకుండా.. ఎస్ఈ 4లో 6.06 ఇంచెస్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుంది.

పవర్

కొత్త ఐఫోన్ ఎస్ఈ 4లో.. ఏ18 ప్రాసెసర్ ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్యాకేజీలో భాగమయ్యే అవకాశం కూడా ఎక్కువే అని తెలుస్తోంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా భారీగా పెరుగే అవకాశం ఉంది. ఇందులో ఒక ఫ్రంట్ కెమెరా, మరొకటి బ్యాక్ కెమెరా మాత్రమే ఉండండుంది. మొత్తం మీద కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ధర & వివరాలు

త్వరలో లాంచ్ కానున్న యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ 128 జీబీ, 256 జీబీ మరియు 512 జీబీ వేరియంట్ల రూపంలో విక్రయానికి రానుంది. దీని ప్రారంభ ధర రూ. 50000 వరకు ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ మొబైల్ లాంచ్ చేసిన తరువాత ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయి. ఆ తరువాత డెలివరీలు మొదలవుతాయి.

Also Read: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

తక్కువ ధరలో ఓ ఐఫోన్ కావాలనుకునేవారికి.. ఎస్ఈ 4 ఓ ఉత్తమ ఎంపిక. అయితే కొనుగోలుదారు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ధరలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది వివిధ రకాల స్టోరేజ్ ఎముకలతో వస్తుంది. కాబట్టి బేస్ వేరియంట్ ధర ఒకమాదిరిగానే.. టాప్ ఎండ్ మోడల్ కొంత ఎక్కువ ధరకు లభిస్తుందని సమాచారం. మొత్తం మీద ఎస్ఈ4 ఫోన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందా.. అని ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?

0

Rashmika Comments On Vijay Devarakonda Kingdom Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనగానే.. చాలామందికి విజయ్ దేవరకొండ కూడా గుర్తుకోచేస్తాడు. ఎందుకంటే వీరిరువురు డేటింగ్‌లో ఉన్నట్లు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీరు జంటగా కలిసి బయట కూడా ఎన్నోసార్లు కనిపించారు. గత సంవత్సరం దీపావళిని దేవరకొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన వీడీ 12 (VD 12) లేదా కింగ్‌డమ్ (Kingdom) టీజర్ లాంచ్‌పై రష్మిక స్పందించింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

నటి రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ చూసిన తరువాత, ‘దిస్ మ్యాన్ ఆల్వేస్ కమ్ విత్ సంథింగ్ మెంటల్.. చాలా గర్వంగా ఉంది విజయ్ దేవరకొండ” అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

రష్మిక మందన్న విజయ్ దేవరకొండ సినిమాలు లేదా టీజర్స్ మీద స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కూడా పోస్టులు చేసింది. కాగా మారోమారు ప్రశంసిస్తూ పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్ ఇంకాస్త ముదిరింది.

విజయ్ దేవరకొండ

2012లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా తరువాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్, వరల్డ్ ఫేమస్ లవర్, ఖుషి మరియు లైగర్ మొదలైన సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల కంటే కింగ్‌డమ్ చాలా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లవ్, రొమాంటిక్ సినిమాలకు పరిమితమైన దేవరకొండ ఇప్పుడు ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికి విడుదలైన టీజర్ దేవరకొండ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా గొప్ప సక్సెస్ సాధిస్తుందని పలువురు చెబుతున్నారు. ఈ సినిమా 2025 మే 30న రిలీజ్ అవుతుందని సమాచారం.

రష్మిక మందన్న (Rashmika Mandanna)

చలో సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం, మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఆ తరువాత పుష్ప, పుష్ప 2 సినిమాల్లో అల్లు అర్జున్ సరసన నటించి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఛావా సినిమాలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక రూ. 10 కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే భవిష్యత్తులో పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే.. అందులో కూడా రష్మిక మందన్న కనిపించనుంది.

నటి రష్మిక మందన్న సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. విలాసవంతమైన జీవితం గడుపుతూ, ఖరీదైన కార్లను ఉపయోగిస్తోంది. రష్మిక ఉపయోగించే కార్ల జాబితాలో రేంజ్ రోవర్ (Range Rover), ఆడి క్యూ3 (Audi Q3), మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ (Mercedes Benz C Class), టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) వంటివి ఉన్నాయి. రష్మిక మందన్న నెట్‍వర్త్ రూ. 70 కోట్లకంటే ఎక్కువే అనే తెలుస్తోంది.

Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

విజయ్ దేవరకొండ కార్ కలెక్షన్స్

నటుడు విజయ్ దేవరకొండ కూడా ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఈయన గ్యారేజిలోని కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5 Series), ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang), రేంజ్ రోవర్ (Range Rover) మరియు వోల్వో ఎక్స్‌సీ90 (Volvo XC90) మొదలైనవి ఉన్నాయి. ఇకపోతే విజయ్ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇతని నెట్‍వర్త్ వందల కోట్లలో ఉంటుందని సమాచారం.