ఇలాంటి స్కూటర్ భారత్‌లో మరొకటి లేదు!.. కొనాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే

BMW CE 02 Electric Scooter India Launch on 1st October 2024: ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ‘సీఈ 04’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు సరసమైన ధరలో సీఈ 02 (CE 02) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ప్రత్యేకంగా పట్టణ ప్రయాణాల కోసం రూపొందించినట్లు సమాచారం.

విడుదలకు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ మినిమలిస్టిక్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ పొందుతుంది. ఇలాంటి డిజైన్ కలిగిన స్కూటర్ బహుశా ఇండియన్ మార్కెట్లో మరొకటి లేదు. పరిమాణంలో చిన్నదిగా ఉండటం పార్కింగ్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

బ్యాటరీ మరియు రేంజ్

బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్.. సీఈ 04 కింద ఉంటుంది. ఇది 2 కిలోవాట్ ఎయిర్ అండ్ కూల్డ్ సింక్రోనస్ మోటార్ పొందుతుంది. కాబట్టి ఇది సింగిల్ చార్జితో 45 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ కావడం గమనార్హం. ఇది సిటీ రైడ్ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ పవర్ మరియు రేంజ్ వంటివి కావాలనుకున్నప్పుడు డ్యూయెల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్ ఎంచుకోవచ్చు.

సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయెల్ బ్యాటరీ ఆప్షన్ ద్వారా గరిష్టంగా 90 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 95 కిమీ కావడం గమనార్హం. సీఈ 02 డబుల్ లూప్ స్టీల్ ప్రేమ్ పొందుతుంది. ప్రీమియం అప్‌సైడ్ డౌన్ పోర్క్ మరియు సస్పెన్షన్ కోసం అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ పొందుతుంది. ఇది 14 ఇంచెస్ వీల్స్ మీద నడుస్తుంది. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో 239 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ బ్రేక్స్ ఉన్నాయి.

బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇది స్కూటర్ యొక్క స్పీడ్, రేంజ్ మరియు బ్యాటరీ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను చూపిస్తుంది. ఈ స్కూటర్ కేవలం రెండు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అవి సర్ఫ్ మోడ్ మరియు ప్లో మోడ్.

అంచనా ధర & బుకింగ్స్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను గురించి అధికారికంగా వెల్లడించలేదు. అయితే బీఎండబ్ల్యూ బ్రాండ్ కాబట్టి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నాము. దీని ధర బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే తక్కువే అయినప్పటికీ.. మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. కాగా ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2024 అక్టోబర్ 1 లాంచ్ చేయనుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ బైకులు మరియు కార్లను లాంచ్ చేస్తూ ఉత్తమ అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎండబ్ల్యూ మొటోరాడ్ ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ చేస్తోంది. అయితే వీటి ధరలు ఇతర బైకులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకే మార్కెట్లో లాంచ్ చేసిన సీఈ 04 స్కూటర్ ధర రూ. 14 లక్షల కంటే ఎక్కువ. ఇప్పుడు లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉండనుంది.

Don’t Miss: రూ.60000 తగ్గింపు!.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం: ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా?

ధర ఎక్కువగా ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు. ఇదే ధరలు మార్కెట్లో ఒక సెకండ్ హ్యాండ్ కారు వచ్చేస్తుంది. ఇలా ఆలోచించే చాలామంది ఈ బీఎండబ్ల్యూ బైకులను కొనుగోలు చేయడానికి ఒక్క అడుగు వెనుక వేస్తారు. అయితే లగ్జరీ అనుభూతిని పొందాలనుకునే వారు, ధనవంతులు లేదా సెలబ్రిటీలు మాత్రం ధర ఎక్కువైనా.. వాహనాల మీద ఉన్న ఆసక్తితోనే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. అయితే బీఎండబ్ల్యూ కంపెనీ లాంచ్ చేయనున్న సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలియాల్సి ఉంది.