BMW CE 02 Electric Two Wheeler Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) మార్కెట్లో తన సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన టూ వీలర్ల జాబితాలో ఒకటిగా ఉంది.
బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02)
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ డిజైన్ పొందుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 4.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) కావడం గమనార్హం. ధరను బట్టి చూస్తే.. మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా ఉంది.
బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటికే మార్కెట్లో రూ. 14.90 లక్షల ఖరీదైన సీఈ 04 లాంచ్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త సీఈ 02 స్కూటర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయితే సీఈ 02 తమిళనాడు హోసూర్‌లోని టీవీఎస్ ఫెసిలిటీలో తయారవుతుంది.
భారతదేశంలో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలంటే కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ బైక్ చిన్నదిగా ఉన్నప్పటికీ.. బేర్‌బోన్స్ డిజైన్ పొందుతుంది. ఇతర బైకులతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారంగా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇందులో చూడవచ్చు. ఇన్‌స్ట్రుమెట్ కన్సోల్, రివర్స్ గేర్, కీలెస్ ఆపరేషన్, 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్ వంటివి కూడా ఇందులో కనిపిస్తాయి.
బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్ సెటప్, అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే 239 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ రియర్ డిస్క్ ఉంటాయి. ఇందులో ఏబీఎస్ కూడా ఉంటుంది. ఇది 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ముందు భాగంలో 120/80 సెక్షన్ టైర్, వెనుకవైపు 150/70 సెక్షన్ టైర్స్ ఉంటాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవారు ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది 15 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక చార్జితో గరిష్టంగా 90 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిమీ కావడం గమనార్హం.
ఖరీదైన స్కూటర్లకు డిమాండ్ ఉందా?
నిజానికి భారతదేశంలో ఖరీదైన స్కూటర్లకు డిమాండ్ పెద్దగా లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు రోజువారీ వినియోగానికి ఎక్కువ మైలేజ్ లేదా రేంజ్ ఇచ్చే స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన సీఈ 04, సీఈ 02 రెండూ కూడా అధిక ధర కలిగి ఉన్నాయి. కాబట్టి ఇండియన్ మాకెట్లో ఇలాంటి వాటిని సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. కాబట్టి సెలబ్రిటీలు లేదా వాహనాలపై మక్కువ ఎక్కువ ఉన్నవారు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
Don’t Miss: కొత్త రంగులో టీవీఎస్ రేడియన్: రూ.59,880 మాత్రమే
బీఎండబ్ల్యూ కంపెనీ తన సీఈ 02 కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది. ఎలా అమ్ముడవుతుందనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ధర కొంత ఎక్కువే అయినప్పటికీ ఈ స్కూటర్ ధరకు తగిన ఫీచర్స్ కలిగి ఉంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల నగరంలో, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా దీనిని సులభంగా రైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు.