భారత్‌లో అడుగెట్టిన BMW కొత్త కారు – ధర తెలిస్తే షాకవుతారు!

BMW iX xDrive50 Launched in India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) దేశీయ విఫణిలో మరో కొత్త కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఆ కొత్త కారు ఏది? ధర ఎంత, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Price)

బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన కొత్త కారు ‘ఎక్స్‌డ్రైవ్50’ (xDrive50). ఇది ఐఎక్స్ యొక్క హై-స్పెక్ వేరియంట్. కంపెనీ యొక్క ఈ కొత్త కారు ధర రూ. 1.40 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘ఎక్స్‌డ్రైవ్40’ (రూ. 1.21 కోట్లు) వేరియంట్ కంటే ఇది ఎక్కువ ధర వద్ద లాంచ్ అయింది. ఈ కొత్త ఎక్స్‌డ్రైవ్50 మోడల్ చిన్న ఎక్స్టీరియర్ అప్డేట్స్ మరియు ఇంటీరియర్ అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్ అండ్ ఫీచర్స్ (Design and Features)

చూడటానికి ఎక్స్‌డ్రైవ్50 మరియు ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ కార్లు రెండూ ఒకేలా కనిపించినప్పటికీ కొన్ని చిన్న అప్డేట్స్ పొందుతాయి. అయితే ఫీచర్స్ మరియు సేఫ్టీ పరంగా రెండూ దాదాపు సమానంగా ఉంటాయి. ఎక్స్‌డ్రైవ్50 కారు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు అడాప్టివ్ సస్పెన్షన్‌ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా లేజర్‌లైట్ హైలెట్స్, టైటానియం బ్రాంజ్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్ మరియు యాక్టివ్ సీట్ వెంటిలేషన్ వంటివి పొందుతాయి.

రేంజ్ అండ్ బ్యాటరీ (Range and Battery)

కంపెనీ యొక్క కొత్త ఎక్స్‌డ్రైవ్50 కారు పెద్ద 111.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 635 కిమీ రేంజ్ అందిస్తుంది సర్టిఫైడ్ చేయబడింది. వాస్తవ ప్రపంచంల.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో రేంజ్ కొంత మారవచ్చు. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 523 హార్స్ పవర్ మరియు 765 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా ఎక్స్‌డ్రైవ్40 మోడల్ 76.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ చార్జితో 425 కిమీ రేంజ్ అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 ఎలక్ట్రిక్ కారు 195 kW డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చేసుకోగలదు. అదే విధంగా 50 kW డీసీ ఛార్జర్ సాయంతో 97 నిముషాలు, 22 kW ఏసీ ఛార్జర్ ద్వారా 5.5 గంటలు మరియు 11 kW AC ఛార్జర్ ద్వారా 11 గంటల సమయం పడుతుంది.

వారంటీ (Warranty)

ఇక చివరగా వారంటీ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 స్టాండర్డ్ 2 ఇయర్స్ / అన్‌లిమిటెడ్ కిమీ వారంటీ మరియు 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్యాటరీ మీద 8 సంవత్సరాలు / 1.6 లక్షల కిమీ వారంటీ లభిస్తుంది.

ప్రత్యర్థులు (Rivals)

బీఎండబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్50 ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ SUV (రూ. 1.39 కోట్లు), జాగ్వార్ ఐ-పేస్ (రూ. 1.26 కోట్లు) మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (రూ. 1.14 కోట్లు) వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: దేశీయ మార్కెట్లో BMW కొత్త కారు లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

బీఎండబ్ల్యూ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ దాని ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తాగాజా మరో కొత్త కారు ఎక్స్‌డ్రైవ్50 లాంచ్ చేసింది. ఈ కొత్త కారు ఇండియన్ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేస్తుందని ఆశిస్తున్నాము.