30 లీటర్ల పెట్రోల్ ట్యాంక్.. మరెన్నో విశేషాలు: రైడింగ్ చేయడానికి మినిమన్ ఉంటది!

BMW R 1300 GSA Bike Revealed: భారతదేశంలో వాహన వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. చాలామంది వాహన ప్రియులు మారుతున్న కాలానికి అనుగుణంగా మారటానికి, అదే సమయంలో లేటెస్ట్ బైకులను, కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) ఓ సరి కొత్త బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ కంపెనీ లాంచ్ చేయనున్న బైక్ ఏది? ఈ బైకులు ఉన్న స్పెషాలిటీ ఏంటి అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

బీఎండబ్ల్యూ బైక్స్ అంటేనే మంచి స్టైల్, అప్డేటెడ్ డిజైన్ అని అందరికి తెలుసు. చాలామంది సెలబ్రిటీలు ఈ బ్రాండ్ బైకులనే ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే అడ్వెంచర్ లేదా ఆఫ్ రోడింగ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే సంస్థ లాంచ్ చేయనున్న సరికొత్త బైక్ ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ’ (BMW R 1300 GSA). ఇది ఆర్ 1300 జీఎస్ ప్లాట్‌ఫామ్‌ మీద ఆధారపడి ఉంటుందని సమాచారం. కాబట్టి ఇది దాని మునుపటి బైకులకంటే కూడా గణనీయమైన అప్డేట్స్ పొందుతుంది.

డిజైన్

కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ దాని మునుపటి బైకులకంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రకాశవంతమైన హెడ్‌లైట్ కనిపిస్తుంది. అంతే కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ లేదా టెయిల్ సెక్షన్ కింద ముక్కు వద్ద ఎక్కువ ఎడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఏకంగా 30 లీటర్లు. ఇప్పటి వరకు ఏ బైకులోనూ ఇంత కెపాసిటీ కలిగి ఫ్యూయెల్ ట్యాంక్ లేదనే చెప్పాలి. లాంగ్ రైడ్ చేసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి కంపెనీ వారిని దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేస్తుందేమో అనిపిస్తోంది.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో బైక్ రైడర్లకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఎల్ఈడీ లైట్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, రాడార్ బేస్డ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటికెగ్రేటెడ్ యూఎస్‌బీ సాకేట్, 12 వోల్ట్స్ ఆన్ బోర్డ్ పవర్ సాకేట్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. ఇందులో ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది క్లచ్ కంట్రోల్ మరియు షిఫ్టింగ్ గేర్‌లను ఆటోమేట్ చేయడానికి రెండు ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్‌లను పొందుతుంది. ఇది గేర్లు మార్చే పనిని తగ్గిస్తుంది. తద్వారా రైడర్ హ్యాపీగా రైడింగ్ మీద ద్రుష్టి పెట్టవచ్చు.

ఏకంగా 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్.. స్టాండర్డ్ జీఎస్ బైక్ కంటే కూడా 11 లీటర్లు ఎక్కువ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందింది. దీంతో ఈ బైక్ బరువు 32 కేజీలు పెరిగి 269 కేజీలకు చేరింది. 870 మిమీ నుంచి 890 మిమీ పొడవైన సీటును అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొట్టి రైడర్లకు కూడా అనుకూలంగా ఉండేలా కంపెనీ దీనిని రూపొందిస్తుంది.

ఇంజిన్

మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్ ఒక్క చూపుతోనే ఆకర్షించబడే డిజైన్ పొందుతుంది. ఇందులో 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అండ్ ఎండ్యూరో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. కాబట్టి ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

వేరియంట్స్ మరియు ధరలు

బీఎండబ్ల్యూ మోటోరాడ్ లాంచ్ చేయనున్న కొత్త ఆర్ 1300 జీఎస్ఏ బైక్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ మరియు ఆప్షన్ 719 కారాకోరం. దేశీయ మార్కెట్లో లాంచ్ అయితే ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 25 లక్షల నుంచి రూ. 26 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ధరలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Don’t Miss: రూ. 95000లకే ‘బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ’ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా?

కంపెనీ లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రాడార్ అసిస్టెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్‌లో ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, అడాప్టివ్ రైడ్ హైట్, ప్రో రైడింగ్ మోడ్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు లగేజ్ క్యారీయింగ్ కోసం కూడా కొన్ని యాక్ససరీస్ పొందవచ్చు. మొత్తం మీద ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ అక్టోబర్ 2024 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం.