అర్జున్ కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరు కొనేస్తారు!

Arjun Kapoor Buys New BGauss RUV350 Electric Scooter: సెలబ్రిటీ అంటేనే చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు, ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారని అందరూ భావిస్తారు. కానీ అందరు సెలబ్రిటీలు ఒకేలా ఉండరు. ఇప్పటికి కూడా ఖరీదైన లగ్జరీ కారు లేకుండా జీవిస్తున్న దిగ్గజ నటులు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ బాలీవుడ్ స్టార్ ‘అర్జున్ కపూర్’ (Arjun Kapoor) ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా కార్లు, బైకుల మీద ఆసక్తి కలిగిన అర్జున్ కపూర్ ఇప్పటికే ఖరీదైన మసెరటి లెవాంటే, ఆడి క్యూ5 వంటి కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా బిగాస్ కంపెనీకి చెందిన ‘ఆర్‌యూవీ350’ (BGauss RUV350) ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. ఈ స్కూటర్ రైడ్ చేసుకుంటూ అర్జున్ కపూర్ రావడం వంటివి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అర్జున్ కపూర్ గ్యారేజిలోని మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.

బిగాస్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఆర్‌యూవీ అంటే ‘రైడర్ యుటిలిటీ వెహికల్’ అని అర్థం. ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఐఈఎక్స్, ఈఎక్స్ మరియు మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.09 లక్షలు, రూ. 1.24 లక్షలు మరియు రూ. 1.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

నటుడు అర్జున్ కపూర్ బిగాస్ ఆర్‌యూవీ350 యొక్క టాప్ వేరియంట్ మ్యాక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది సొగసైన రెట్రో డిజైన్ కలిగి.. ఇన్‌వీల్ హైపర్‌డ్రైవ్ మోటరుతో లభిస్తుంది. ఇందులోని 3 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 75 కిమీ వంరకు వేగవంతం అవుతుంది.మిగిలిన రెండు వేరియంట్లు 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 90 కిమీ రేంజ్ అందిస్తుంది.

బిగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హోల్ హోల్డ్ అసిస్ట్, నోటిఫికేషన్ అలర్ట్, న్యావిగేషన్ ప్రాంప్ట్, ఫాల్ సేఫ్ టెక్నాలజీ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అన్ని వేరియంట్లు డ్రమ్ బ్రేక్స్ పొందుతాయి. కాబట్టి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

అర్జున్ కపూర్ గ్యారేజిలోని లగ్జరీ కార్లు

నిజానికి అర్జున్ కపూర్ గతంలో ఎప్పుడూ బైక్ లేదా స్కూటర్ రైడ్ చేసిన సంఘటనలు వెలుగులోకి రాలేదు. మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేస్తూ కనిపించరు. అర్జున్ కపూర్ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350, వోల్వో ఎక్స్సీ90, మసెరటి లెవాంటే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ల వల్ల ఉపయోగాలు

రోజువారీ వినియోగానికి లేదా తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఎంపిక అవుతాయి. ఇది మెయింటెనెన్స్ ఖర్చులను కూడా బాగా తగ్గిస్తుంది. ట్రాఫిక్ వంటి సమయాల్లో కూడా సజావుగా ముందుకు సాగటానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది సాధారణ ప్రజలు మరియు సెలబ్రిటీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి మార్కెట్లో లాంచ్ అవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

Don’t Miss: యమహా కొత్త స్కూటర్ ఇదే: రూ. 98130 మాత్రమే

ఆటో రంగంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా అగ్రగ్రామి దేశాల జాబితాలో ఉంది. దేశీయ ఆటోమొబైల్ రంగం దేశ ఆర్ధిక వ్యవస్థను పెంచడానికి చాలా ఉపయోగపడుతుందని పలువురు రాజకీయం నాయకులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. రాబోయే రోజుల్లో భారత్ ఆటోమొబైల్ రంగంలో చైనాను దాటేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ప్రస్తుతం పెట్రోల్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.