Bollywood Actor Sunil Shetty New Car MG Comet EV: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘సునీల్ శెట్టి’ (Sunil Shetty) ఓ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సునీల్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు మోరిస్ గ్యారేజ్ (MG) కంపెనీకి చెందిన ‘ఎంజి కామెట్’ (MG Comet). దేశీయ మార్కెట్లో ఈ ఏడాది విడుదలైన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు.
నటుడు సునీల్ శెట్టి కొనుగోలు చేసిన ఈ కారుకి సంబంధించిన ఫోటోలు ఎంజి మోటార్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ‘నా మొదటి ఈవీ, ఎంజి కామెట్ లవ్ ఇట్’ అని చూడవచ్చు. స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్ మరియు యాపిల్ గ్రీన్ విత్ స్టార్రీ బ్లాక్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో సునీల్ శెట్టి కొనుగోలు చేసిన కారు స్టార్రీ బ్లాక్ షేడ్‌లో చూడచక్కగా ఉంటుంది.
ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
భారతీయ మార్కెట్లో విడుదలైన తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గది, ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన ‘కామెట్ ఈవీ’ ఒకటి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అయితే ఇది కేవలం రెండు డోర్లను మాత్రమే కాలిగి ఉండి, నాలుగు సీట్లను పొందుతుంది.
ఎంజి కామెట్ ఈవీ క్వాడ్రిసైకిల్ బేస్డ్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌లైట్స్, వాహనం యొక్క వెడల్పులో విస్తరించి ఉన్న ఎల్ఈడీ ఎలిమెంట్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పొడవైన సీ పిల్లర్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ జాబ్ వంటి ఉన్నత స్థాయి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల భాగంలో 2 స్పోక్ స్టీరింగ్‌తో పాటు ట్విన్ 10.25 ఇంచెస్ స్క్రీన్‌లతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ కీ, పవర్ విండోస్, గ్రే ఇంటీరియర్ థీమ్ మరియు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటివి ఉంటాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 42 పీఎస్ పవర్ 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. కామెట్ ఈవీ 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.
Don’t Miss: దివికేగిన ‘కెప్టెన్’ – విజయకాంత్ గురించి ఆసక్తిర విషయాలు
సునీల్ శెట్టి కార్ కలెక్షన్ (Suniel Shetty Car Collection)
నటుడు సునీల్ శెట్టి గ్యారేజిలో తాజాగా చేరిన ఎంజి కామెట్ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ (Mercedes Benz G63 AMG), ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, హమ్మర్ హెచ్2, బీఎండబ్ల్యు ఎక్స్5, జాగ్వార్ ఎక్స్ఎఫ్, జీప్ రాంగ్లర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350, మెర్సిడెస్ ఈ క్లాస్, రేంజ్ రోవర్ వోగ్, టయోట ప్రాడో వంటి కార్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. నటుడు సునీల్ శెట్టికి కార్ల మీద ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అర్థమైపోతుంది.