Bollywood Actress Kirti Kulhari Buys New MG Comet EV: ఎంజీ కామెంట్ ఈవీ (MG Comet EV).. ఈ రోజు భారతదేశంలో సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అందరూ ఇష్టపడి కొనుగోలు చేస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ ఇవ్వడంలో రోజు వారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో కూడా ఇది సజావుగా ముందుకు దూసుకెళ్లగలుగుతుంది. ఈ కారును ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీ.. ప్రముఖ నటి ‘కిర్తీ కుల్హారీ’ (Kirti Kulhari) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
వీడియోలో గమనించినట్లయితే.. నటి కిర్తీ కుల్హారీ ఎంజీ కామెట్ ఈవీ కారును డెలివరీ తీసుకోవడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వంటివి మాత్రమే కాకుండా కేక్ కట్ చేయడం వంటివి చూడవచ్చు. ఆ తరువాత కారును డ్రైవ్ చేయడం వంటివి కూడా వీడియోలో చూడవచ్చు. ఫోటోలను షేర్ చేస్తూ ”మేరే ఘర్ ఆయీ ఏక్ నాన్హీ పరి” అని క్యాప్షన్ ఇచ్చింది. నేను భారతదేశంలోని అతి చిన్న కారును కొనుగోలు చేసాను.. దీనిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని కూడా వెల్లడించింది.
ఎంజీ కామెట్ ఈవీ
ప్రస్తుతం భారతదేశంలో తక్కువ ధరకు లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ మోటార్స్ యొక్క ”కామెట్ ఈవీ” ఒకటి. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.53 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
నటి కిర్తీ కుల్హారీ కొనుగోలు చేసిన కారు టాప్ స్పెక్ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ అని తెలుస్తోంది. దీని ధర రూ.9 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇది అరోరా సిల్వర్ క్లాసీ షేడ్ పొందుతుంది.చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది.
ఎంజీ కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. దీనిని సాధారణ హోమ్ సాకెట్ (3.3 కేడబ్ల్యు ఛార్జర్) ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని మోటారు 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కామెట్ ఈవీ ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
ఎంజీ కామెట్ ఈవీ కలిగిన ఇతర సెలబ్రిటీలు
చిన్న కారు.. పాపులర్ మోడల్ ఎంజీ కామెట్ ఈవీను కిర్తీ కుల్హారీ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారు. ఈ జాబితాలో కన్నడ స్టార్ హీరో సునీల్ శెట్టి, మలయాళీ నటి మీనాక్షి టెలివిజన్ స్టార్ రోహిత్ రాయ్ మొదలైనవారు ఉన్నారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా చాలామంది సంపన్నులు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం నగరప్రయాణానికి ఇది అనుకూలంగా ఉండటమే.
రోజు వారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ కారు హాలోజన్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ టెయిల్‌లాంప్, ఇల్యూమినేటెడ్ ఎంజీ బ్రాండ్ లోగో, వీల్స్ కవర్స్ కలిగిన 12 ఇంచెస్ స్టీరింగ్ వీల్ వంటివి పొందుతుంది. మూడు డోర్స్ కలిగిన ఈ కారులో నలుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
టాటా టియాగో ఈవీ మరియు సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ.. ఇప్పటికే దేశీయ మార్కెట్లో వేలసంఖ్యలో అమ్ముడైంది. ఈ కారు మొత్తం ఆరు కలర్ (గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్, స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్) ఆప్షన్లలో లభిస్తుంది.
Don’t Miss: హ్యుందాయ్ లాంచ్ చేసిన సరికొత్త పెద్ద కారు: ధర ఎంతో తెలుసా
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజీ కామెట్ ఈవీ కారు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం మీద పొట్టి కారు అయినప్పటికీ.. బహు గట్టి ఫీచర్స్ ఉండటం వల్ల ఎక్కువమంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.