22.2 C
Hyderabad
Friday, April 4, 2025

భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

BYD Seal EV  Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసీల్ ఎలక్ట్రిక్ కారును ‘బీవైడీ’ (బిల్డ్ యూర్స్ డ్రీమ్) కంపెనీ ఎట్టకేలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధర

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 41 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా), టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). సీల్ ఈవీ డైనమిక్, ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది.

  • బీవైడీ సీల్ ఈవీ డైనమిక్ – రూ. 41 లక్షలు
  • బీవైడీ సీల్ ఈవీ ప్రీమియం – రూ. 45.55 లక్షలు
  • బీవైడీ సీల్ ఈవీ పర్ఫామెన్స్ – రూ. 53 లక్షలు

డిజైన్

అద్భుతమైన డిజైన్ కలిగిన బీవైడీ సీల్ ‘ఓషన్ ఈస్తటిక్స్’ డిజైన్ లాంగ్వేజ్ పొందుతుంది. ఇది ఆల్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్‌లోకి విస్తరించి ఉన్న సీ షేప్ ఎలిమెంట్స్ కలిగిన స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఉన్నాయి. వెనుకవైపు వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ చూడవచ్చు.

19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4800 మిమీ, వెడల్పు 1875 మిమీ, ఎత్తు 1460 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.

ఫీచర్స్

సీల్ ఈవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 16.6 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్‌, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లో క్రిస్టల్ టోగుల్ డ్రైవ్ సెలెక్టర్, హీటెడ్ విండ్‌స్క్రీన్, ఆడియో సిస్టమ్ కోసం వాల్యూమ్ కంట్రోల్ వంటి వాటితో పాటు రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ల వంటి ఫంక్షన్‌ల కోసం కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్, రేంజ్ మరియు బ్యాటరీ

కొత్త బీవైడీ సీల్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. అవి 61.44 కిలోవాట్ మరియు 82.56 కిలోవాట్. ఈ రెండూ కూడా కంపెనీ యొక్క పేటెంట్ బ్లేడ్ టెక్నాలజీని పొందుతాయి. 61.44 కిలోవాట్ బ్యాటరీ ఒకే మోటారును కలిగి 204 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 510 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఇక రెండో బ్యాటరీ 82.56 కిలోవాట్ విషయానికి వస్తే.. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది. సింగిల్ మోటార్ RWD రూపంలో 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ మోటార్ AWD కాన్ఫిగరేషన్‌లో 530 హార్స్ పవర్ మరియు 670 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది సింగిల్ చార్జితో 650 కిమీ మరియు 580 కిమీ రేంజ్ అందిస్తాయి. టాప్ స్పెక్ వేరియంట్ కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: మీకు తెలుసా.. Skoda లాంచ్ చేయనున్న నాలుగు కొత్త కార్లు ఇవే!

ఛార్జింగ్ & వారంటీ

సీల్ ఈవీ 150 kw ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అయితే స్టాండర్డ్ 11 kW ఏసీ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 8.6 గంటల సమయం పడుతుంది. కంపెనీ బ్యాటరీ మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. ఇక మోటార్ మీద 8 సంవత్సరాలు / 150000 కిమీ వారంటే అందిస్తుంది.
admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు