Viswavasu Nama Samvatsara Rasi Phalalu 2025 March 30th: పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు. ఆదివారం (మార్చి 30). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్ల పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు.
మేషం
ఈ రాశివారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో చికాకులు, గందరగోళ వాతావరణం.
వృషభం
అవసరాన్ని మించిన ఖర్చులు ఉన్నాయి. చేతికందాల్సిన డబ్బు సమయానికి అందదు. వృత్తి మరియు వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దైవ చింతన పెరుగుతుంది.
మిథునం
ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణంలో అవరోధాలు ఎదురవుతాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
సింహం
అనుకూల వాతావరణం నడుస్తోంది. విందువినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతూంది. ఉద్యోగుణాలకు శుభయోగం. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
కన్య
చేపట్టిన పనులకు అనుకున్న విధంగా సాగవు. ఆశించిన ఫలితాలు లభించవు. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. కుటుంబంలో చికాకు కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది.
తుల
దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలను చవిచూస్తారు.
వృశ్చికం
ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అనుకూల వాతావరణం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
ధనుస్సు
కుటుంబంలో మాటపట్టింపులు. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలను కొనితెస్తాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మకరం
ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. సన్నిహితులతో వివాదాలు. ఉద్యోగంలో నూతన అవకాశాలు. ఇంటాబయట ప్రతికూల ప్రభావం. అవసరానికి అందవలసిన ధనం అందదు. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం
శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన యోగం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం, శుభయోగం నడుస్తోంది.
గమనించండి: రాశిఫలాలు అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే దీనికి ఎలాంటి శాస్త్రీయమైన అధరాలు లేదు. అంతే కాకుండా రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. గ్రహాలు ఒకేచోట ఉండవు, కాబట్టి రాశిఫలాల్లో కూడా అనుకోని మార్పులు సంభవించవచ్చు.