Janhvi Kapoor Gets Expensive Lamborghini Car To Ananya Birla: ఈ మధ్యకాలంలో నచ్చిన వారికి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో మనం తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. అయితే ఓ యువతి.. మరో యువతికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం గురించి మనం ఎప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యువతి ఎవరు?, తీసుకున్న యువతి ఎవరు అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నిజానికి కుమార్ మంగళం బిర్లా కుమార్తె.. అనన్య బిర్లా (Ananya Birla), తన ఫ్రెండ్ మరియు హీరోయిన్ ‘జాన్వీ కపూర్‘ (Janhvi Kapoor)కు బ్యూటిఫుల్ లంబోర్ఘిని కారును గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. ఓ వ్యక్తి ఖరీదైన పర్పుల్ కలర్ లంబోర్ఘిని కారును డ్రైవ్ చేస్తూ రావడం చూడవచ్చు. ఆ కారులో మరో పెద్ద గిఫ్ట్ బాక్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఆ గిఫ్ట్ బాక్స్ మీద ప్రేమతో అనన్య బిర్లా అని ఉండటం చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వికి లంబోర్ఘిని గిఫ్ట్
అనన్య బిర్లా ఇచ్చిన కారు లంబోర్ఘిని కంపెనీకి చెందిన గల్లార్డో స్పైడర్ (Lamborghini Gallardo Spyder) అని తెలుస్తోంది. దీని ధర ఇండియన్ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అనన్య బిర్లా ఈ కారును ముంబైలోని జాన్వీ కపూర్ ఇంటికి నేరుగా పంపించినట్లు తెలుస్తోంది.
వీడియోలో కనిపిస్తున్న ఖరీదైన లంబోర్ఘిని గల్లార్డో కారు.. రెండు డోర్స్ కలిగిన కన్వర్టిబుల్ అని తెలుస్తోంది. ఇందులో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు అని స్పష్టమవుతోంది. బహుశా ఒక ఫ్రెండుకు ఇంత ఖరీదైన కారును గిఫ్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అయి ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది మాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు.
లంబోర్ఘిని గల్లార్డో స్పైడర్
నిజానికి లంబోర్ఘిని కంపెనీ గల్లార్డో స్పైడర్ కారును 2003 నుంచి 2013 వరకు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆ తరువాత ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొన్నారేమో అనిపిస్తుంది. అయితే ఈ కారును ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొనుగోలు చేశారనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. ఈ కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేసి ఉంటే.. దీని ధర రూ. ఐదు కోట్లు ఉండే అవకాశం లేదు.
లంబోర్ఘిని గల్లార్డో స్పైడర్ కారు 5.2 లీటర్ వీ10 ఇంజిన్ పొందుతుంది. ఇది 560 Bhp పవర్ మరియు 540 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ సింగిల్ క్లచ్ ఆటోమాటిక్ అని తెలుస్తోంది. గంటకు 325 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఇది 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని (యాక్సలరేషన్) 3.8 సెకన్లలో చేరుతుంది.
Also Read: కొత్త కొరు కొన్న పుష్ప 2 కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ: కారు రేటెంతో తెలుసా?
ఎవరీ అనన్య బిర్లా?
ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా. వ్యాపార సామ్రాజ్యంలో తండ్రికి తగ్గ తనయగా ఎదుగుతున్న ఈమె బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, సింగర్ కూడా. అనన్య తాజాగా ఓ మేకప్ బ్రాండ్ స్టార్ట్ చేసింది. దీనికి జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనుంది. దీనికి కృతజ్ఞతగానే అనన్య.. జాన్వికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
View this post on Instagram