Disabled Man Takes Delivery Of His Dream Bike: ”కర్తవ్యం కళ్ళెదుట ఉంటే.. జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి” అని చెప్పిన మహానుభావుని మాటలను నిజం చేసిన వారు ఎందరో. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఇటీవల వెలుగులోకి వచ్చారు. ఇంతకీ అతడెవరు? అతడు ఏం చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం.
చాలామందికి కేటీఎం బైక్ అంటే ఇష్టం. కాబట్టి కొందరు కొందరు కొనుగోలు చేస్తారు, మరికొందరికి సాధ్యం కాకపోవచ్చు. ఇది వారి ఆర్ధిక స్థోమతను బట్టి ఉంటుంది. అయితే ఒక దివ్యాంగుడు తనకు నచ్చిన ‘కేటీఎం 390 డ్యూక్’ బైకును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. ఒక దివ్యాంగుడు కర్ర సాయంతో కేటీఎం షోరూముకు వస్తారు. సిబ్బంది అతనికి సాదర స్వాగతం పలుగుతారు. ఆ తరువాత బైకుపై కప్పిన క్లాత్ తీసివేస్తారు. సిబ్బంది అతనితో కేక్ కట్ చేయిస్తారు. ఆ తరువాత అతడు బైక్ రైడ్ చేసుకుంటూ బయటకు వెళ్లడం చూడవచ్చు.
ఈ వీడియో కేటీఎం చంద్రశేఖర్‌పుర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు చెబుతూ.. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కొంతమంది నచ్చిన బైకును కొనుక్కున్నందుకు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు.
2025 కేటీఎం 390 డ్యూక్
మార్కెట్లో ఎక్కువమంది యువతను ఆకట్టుకున్న బైకులలో ఒకటి కేటీఎం కంపెనీకి చెందిన ‘390 డ్యూక్’ (KTM 390 Duke) ఒకటి. మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది. ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మంచి అమ్మకాలను పొందుతూ.. ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
2025 కేటీఎం 390 డ్యూక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ఈ బైకును గన్‌మెటల్ గ్రే కలర్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఇందులో.. రోడ్, రెయిన్ మరియు ట్రాక్ అనే రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేక్ బ్రేకింగ్ సిస్టం వంటి ఫీచర్స్ కూడా ఉండటంతో.. ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
స్టైలిష్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన కేటీఎం 390 డ్యూక్ 5 ఇంచెస్ TFT డిస్‌ప్లే, డే టైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి పొందుతుంది. ఈ బైకులోని 399 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 46 Bhp పవర్ మరియు 39 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా లభిస్తుంది.
Also Read: భారత్‌లో టెస్లా షోరూమ్‌లు అక్కడే!.. ఫస్ట్ ఆ కారుతోనే సేల్స్?
మంచి డిజైన్, వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ ఉండటంతో పాటు.. గొప్ప పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే కేటీఎం 390 బైకును ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంది. కంపెనీ కూడా తన వినియోగదారుల సౌకర్యార్థం.. ఎప్పటికప్పుడు సరికొత్త బైకులు లాంచ్ చేస్తోంది. ఇందేలో భాగంగానే కంపెనీ ఇటీవల కేటీఎం 390 ఎండ్యూరో ఆర్ (KTM 390 Enduro R) బైకును రూ. 3.37 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద లాంచ్ చేసింది.
View this post on Instagram