భారీ తగ్గింపు.. టాటా కార్లపైన గొప్ప డిస్కౌంట్స్ – వివరాలు

Discounts on Tata Cars in Festive Season 2024: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ కొన్ని రోజులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఏ కారుపైన ఎంత డిస్కౌంట్స్ లభిస్తుందనే విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

టాటా హారియర్ (Tata Harrier)

హారియర్ కొనుగోలుపైన కంపెనీ ఏకంగా రూ. 1.33 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 2023 హారియర్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్ మీద రూ. 50000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కాగా 2024 మోడల్ మీద ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ కింద రూ. 25000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 170 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఎంజీ హెక్టర్ యొక్క ప్రత్యర్థిగా ఉన్న హారియర్ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ఉంది.

టాటా సఫారీ (Tata Safari)

ఈ నెలలో టాటా సఫారీ కొనుగోలుపైన కూడా రూ. 1.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 2023 మోడల్ మీద రూ. 50,000 తగ్గింపు, 2024 మోడల్ మీద రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV700 మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.79 లక్షల మధ్య ఉంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ మీద కూడా ఈ నెలలో గరిష్టంగా రూ. 95000 తగ్గింపు పొందవచ్చు. డీజిల్ వెర్షన్ మీద రూ. 80,000 తగ్గింపు లభిస్తుంది. నెక్సాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్ గత సెప్టెంబర్‌లో పరిచయం చేయడం జరిగింది. అయితే 2023 నెక్సాన్ మీద రూ. 40000 మరియు 2024 మోడల్ మీద రూ. 10000 నుంచి రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఇది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

నెక్సాన్ ప్రస్తుతం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120 హార్స్ పవర్) లేదా 1.5 లీటర్ డీజిల్ (115 హార్స్ పవర్) ఇంజిన్స్ పొందుతుంది. ఈ రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. నెక్సాన్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి. కాగా నెక్సాన్ ఐసీఎన్‌జీ ధరలు రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల ( అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంది.

టాటా టియాగో (Tata Tiago)

టియాగో కొనుగోలుపైన రూ. 90వేలు వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.75 లక్షల మధ్య ధర వద్ద లభించే ఈ కారు యొక్క 2023 మోడల్ మీద గరిష్టంగా రూ. 90000 వరకు తగ్గింపు పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ మీద రూ. 85000 వరకు తగ్గింపు లభిస్తుంది. 2024 టియాగో టాప్ వేరియంట్ కొనుగోలు మీద రూ. 30000 వరకు తగ్గింపు లభిస్తుంది. లో ట్రిమ్ వేరియంట్ మీద రూ. 20000 డిస్కౌంట్ లభిస్తుంది.

1.2 లీటర్ ఇంజిన్ అనేది టాటా టియాగో కారులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 86 హార్స్ పవర్ అందిస్తుంది. సిఎన్‌జీ వేరియంట్ మీద 73.4 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందిస్తుంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి స్విఫ్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టిగోర్ (Tata Tigor)

టిగోర్ కొనుగోలుపైన కంపెనీ రూ. 85000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ 2023 కారు కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. 2024 యొక్క అన్ని వేరియంట్స్ మీద రూ. 30000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా, మారుతి డిజైర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టిగోర్ 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.4 లక్షల మధ్య ఉంది.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ఆల్ట్రోజ్ కొనుగోలుపైన కంపెనీ రూ. 70000 వరకు తగ్గింపు లభిస్తుంది. 2023 పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్స్ మీద ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే గత ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ సిఎన్‌జీ వేరియంట్ మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది. 2024 మిడ్ స్పెక్ మరియు హై-స్పెక్ కొనుగోలుపైన వరుసగా రూ. 25000 మరియు రూ. 35000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ. 9.49 లక్షల నుంచి రూ. 10.99 లక్షల మధ్య ఉంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన BYD eMax 7: ధర ఎంతో తెలుసా?

టాటా పంచ్ (Tata Punch)

ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టాటా పంచ్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 18000 తగ్గింపు పొందవచ్చు. అయితే సిఎన్‌జీ వేరియంట్ మీద రూ. 15000 తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రత్యర్థిగా ఉన్న టాటా పంచ్ 1.2 లీటర్ ఇంజిన్ 88 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ధరలు మార్కెట్లో రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.12 లక్షల (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్-ఇండియా) మధ్య ఉంది.