Do You Know About Delhi EV Policy 2.0: దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అక్కడి ప్రభుత్వం కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2.0’ (Delhi EV Policy 2.0) వెలుగులోకి వచ్చింది. ఇంతకీ దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి?, పెట్రోల్, డీజిల్ కార్ల పరిస్థితి ఏమిటి అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఢిల్లీ ఈవీ పాలసీ 2.0
నగరంలో ఈవీ పాలసీ 2.0 కింది.. 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను గణనీయంగా పెరగనున్నాయి. మొత్తం వాహనాలలో ఎలక్ట్రిక్ వాహనాలు 95 శాతం వరకు ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో భారతదేశంలో ఢిల్లీ అగ్రగామిగా ఉండాలని.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త పాలసీ విధానం ప్రకారం.. అన్ని సీఎన్‌జీ ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలను దశల వారీగా.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా రవాణా కోసం బస్సులను కూడా ఎలక్ట్రిక్ రూపంలోనే ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం అందించనుంది.
ప్రోత్సాహకాలు
నిజానికి ప్రోత్సాహకాలు.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తప్పకుండా పెంచుతాయి. గతంలో చాలా రాష్ట్రాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించాయి. దీనికోసం ప్రత్యేకంగా స్టేట్ ఈవీ ఫండ్ ఏర్పాటు చేస్తారు. దీనిని గ్రీన్ లెవీలు, పొల్యూషన్ సెస్, అగ్రిగేటర్ లైసెన్స్ ఫీజులతో నింపుతారు. వాటిని ప్రోత్సాహకాలుగా అందిస్తారు.
ప్రస్తుతం దేశంలో.. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. కాబట్టి వాహన వినియోగదారులు తమకు నచ్చిన వాహనాలను ఎలక్ట్రిక్ రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలుపైన గణనీయమైన ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త నిబంధనలనకు అనుగుణంగా ఉండాలి.. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఢిల్లీలో కఠినమైన నియంత్రణ చర్యలు అమలులోకి రానున్నాయి.
స్క్రాపింగ్
ఢిల్లీలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం ఉండాలనే చర్యలో భాగంగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా.. కూడా కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్ లభిస్తుంది. పాత వాహనాల స్కాపేజ్ కోసం కావాల్సిన సదుపాయాలు పెంచనున్నారు.
మౌలిక సదుపాయాల వృద్ధి & కొత్త ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే.. మౌలిక సదుపాయాలు కూడా పెరగాలి. అంటే విస్తృత స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలన్న మాట. కాబట్టి ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ లేదా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనికోసం అవసరమైతే.. ప్రైవేట్ కంపెనీల మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉంది.
Also Read: సరికొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ఇదే: దీని గురించి తెలుసా?
ఢిల్లీలో ఈవీ పాలసీ 2.0 అమలులోకి వస్తే.. ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్, సర్వీస్, ఫైనాన్సింగ్, బ్యాటరీ నిర్వహణ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. తద్వారా కొంతవరకు నిరుద్యోగం తగ్గుతుంది.
నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 2020లో అమలు చేసింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించింది. ఇప్పుడు ఇదే 2.0 రూపంలో రానుంది. మొత్తం మీద దెస రాజధాని నగరంలో పెట్రోల్, డీజిల్ కార్లు కనుమరుగయ్యే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.