Health Benefits of Mung Bean in Summer: అసలే ఎండాకాలం.. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ లేదా స్పైసీ ఫుడ్స్ వంటివి తినడం వల్ల, శరీరం వేడి చేస్తుంది. వేడి తగ్గాలంటే దానికోసం టాబ్లెట్స్ వేసుకోవడం వంటివి చేస్తుంటారు. మాత్రమే తక్షణ ఉపశమనం అనిపించినా.. ఆ తరువాత కడుపులో మంట లేదా ఇతర సమస్యలను కలిగిస్తాయి. అయితే మనం రోజూ చూసే.. వంటింట్లో దొరికే పెసలు (Mung Bean లేదా Green Gram) ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇంతకీ వీటిని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూసేద్దాం.
ఎలా తినాలి?
ఉదయం.. ఇడ్లీ, దోస వంటివి తీసుకోవడం కంటే, పెసలును హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మాదిరిగా తినడం మంచిది. ఉడకబెట్టి తినొచ్చు. మొలకెత్తించిన గింజలు తినడం చాలా ఉత్తమం. ఇందులో ఉడకబెట్టిన పెసలులో ఉండే పోషకాల కంటే.. మొలకెత్తిన పెసలులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజల్లో శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి.
పచ్చి మొలకలు తినలేనివారు, ఉడకబెట్టిన గింజలు తినడమే ఉత్తమం. ఇది ఫుడ్ పాయిజన్ సమస్యను తగ్గిస్తుంది. మనం రోజూ డైట్‌లో వీటిని తీసుకోవడం మంచిది. పెసరపప్పు చారు, టమోటా పెసరపప్పు, అరటికాయ పెసరపప్పు, పెసరపప్పు కర్రీ, పెసరపప్పు పులగం మొదలైన వంటలుగా చేసుకుని తినొచ్చు.
ఉపయోగాలు
హైబీపీ తగ్గించుకోవచ్చు: హైబీపీ ఉన్నవారికి పెసలు గొప్ప ఔషధం అనే చెప్పాలి. ప్రతి రోజూ ఏదో ఒకరకంగా.. మనం తీసుకునే భోజనంలో పెసలును తీసుకోవడం ఉత్తమం. ఇలా ప్రతి రోజూ పెసలును తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఇందులో ఉండే కాపర్ చర్మం మీద ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. అంతే కాకూండా యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి స్కిన్ డ్యామేజీని తగ్గిస్తాయి. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది. లావుగా ఉండేవారు సన్నబడటానికి పెసలు చాలా బాగా ఉపయోగపడతాయి.
షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి: బీపీని మాత్రమే కాకుండా.. ఇన్సులిన్ (షుగన్) స్థాయిని కూడా తగ్గించుకోవడానికి పెసలు ఉపయోగపడతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ మరియు ఫ్యాట్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంతో శరీరం బరువు సులభంగా తగ్గుతుంది. షుగర్ ఉన్నవాళ్లు ఎప్పుడూ పెసలును తినడం మంచిది. పెసలును రోజూ తీసుకోవడం వల్ల అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయని నిపుణులు కూడా నిర్దారిస్తున్నారు.
సరైన రక్తప్రసరణ కోసం: పెసలులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను సక్రమంగా ఉంచుతుంది. అంతే కాకుండా.. ఐరన్ అనేది శరీరంలోని అవయవాలకు కావలసినంత ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడుతుంది. దీంతో శరీరం ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ పెసలును తినడం మంచిది.
కండరాల పెరుగుదలకు: చాలామందికి కండలు పెంచుకోవడం ఫ్యాషన్. కాబట్టి వీరిలో చాలామంది మాంసాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే పెసలు కూడా కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. జిమ్ చేసేవారు మాత్రమే కాకుండా, మజిల్స్ మరియు మజిల్ పవర్ వంటివి పెంచుకోవాలనుకునేవారు పెసలును రోజూ తీసుకోవచ్చు. పెసలులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి.
Also Read: ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!
సరైన జీర్ణవ్యవస్థకు: ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పెసలులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. సరైన జీర్ణ వ్యవస్థ కావాలనుకునేవారు పెసలు తీసుకోవాలి. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను కూడా పెసలు దూరం చేస్తాయి. పెసలు బ్రెయిన్ పనితీరును కూడా పెంచుతాయి.
గమనించండి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు, కొన్ని అధ్యయనాల ఆధారంగా ఈ సమాచారం అందించడం జరిగింది. అయితే పెసలు లేదా ఇతర ఆహార పదార్థాలు అందరికి సెట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. మంచి డైటీషియన్‌ను సంప్రదించి పెసలును తీసుకోవడం మంచిది.