36.2 C
Hyderabad
Monday, March 31, 2025

టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

Lady Aghori Naga Sadhu Car Details: అఘోర అంటేనే.. అన్నీ త్యజించి జనసంచారానికి దూరంగా ఎక్కడో గుహల్లో, అడవుల్లో తపస్సు చేసుకుంటూ బతికేస్తారని చాలా వీడియోల్లో చెబుతుంటారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగ సాధువుగా చెప్పుకుంటూ నగ్నంగా తిరుగుతున్న ఓ మహిళ మాత్రం తాను ప్రయాణించడానికి ఓ కారును ఉపయోగిస్తోంది. ఇంతకీ ఈమె ఉపయోగించే కారు పేరు ఏంటి? దాని వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం..

మహిళా అఘోరి నాగసాధు ఉపయీగిస్తున్న కారు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 (Hyundai i20) అని తెలుస్తోంది. అయితే ఈ కారు సాధారణ కారు మాదిరిగా కాకుండా.. ముందు, వెనుక, సైడ్లలో ఎక్కడ చూసిన కొంత భయాన్ని కలిగించే దేవుని బొమ్మలతో నిండి ఉంది. కారులో లెక్కకు మించిన పుర్రెలు, రుద్రాక్షలు ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ తెలుసుకోవకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. అఘోరి ఉపయోగిస్తున్న కారుకు రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదు. ఆ ప్రదేశంలో అఘోరి నాగ సాధు అనే అక్షరాలు ఉన్నాయి. ఇది చట్ట రీత్యా నేరం. ఎందుకంటే ఎవ్వరైనా పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే వారి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరి. కానీ లేడీ అఘోరి నాగ సాధు కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

హ్యుందాయ్ ఐ20

ఇక హ్యుందాయ్ ఐ20 కారు విషయానికి వస్తే.. ఇది మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన బ్రాండ్ యొక్క పాపులర్ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ కారును సుమారు 18 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

2008లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఐ20.. కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందింది. ఇది 2023లో చివరిసారి అప్డేట్ పొందినట్లు సమాచారం. ఆరు ఎయిర్‌బ్యాగులు కలిగిన ఐ20 కారు 26 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో 60 కంటే ఎక్కువ బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇక లేడీ అఘోరీ నాగసాధు విషయానికి వస్తే.. ఈమె బట్టలు లేకుండా మేడలో రుద్రాక్ష మాలలు వేసుకుని, చేతిలో త్రిశూలం పట్టుకుని చాలా దేవాలయాలలోకి ప్రవేశిస్తుంది. దేవాలయాల్లో కూడా తనదైన శైలిలో పూజలు చేస్తుంది. కొంతమంది ఆమెను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు ఇళ్లకు పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో..

అఘోరి నాగసాధు చాలా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలలో అనేక సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మెదడును ఆహారంగా తింటానని, నెలసరి (ఋతుక్రమం) సమయంలో ఎవరికీ కనిపించకుండా ఉంటానని, ఇలా చాలా విషయాలను వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

కారును కూడా భయం కల్పించే విధంగా డిజైన్ చేసుకుని ఉండటం కూడా చూడవచ్చు. కాళీమాత బొమ్మలు, శివుని బొమ్మకు.. కారు ముందు భాగంలో పుర్రెలు.. అఘోరి అన్న పదానికి సరిగ్గా సూటయ్యే విధంగా కారును రెడీ చేసుకుంది. ఈమె ఎక్కడికెళ్లినా అక్కడ జనం తండోపతండాలుగా గుమికూడుతారు. దీనికి కారణం ఈమె విచిత్ర వేషధారణ అనే చెప్పాలి.

అఘోరి ఆత్మాహుతి..

కొంతమంది ఈ లేడీ అఘోరి నాగసాధుని దైవం భావిస్తే.. మరికొందరు ఈమెను వ్యతిరేకిస్తున్నారు. అఘోరాలు కంటికి కనిపించకుండా దైవధ్యానంలోనే ఉంటారని చెబుతూ.. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఆలా చేస్తుందని దూషిస్తున్నారు. మంగళగిరిలో కొంతమంది యువకులు ఆమెను నిలువరిస్తే, వారిపై రాళ్లతో దాటి చేయడమే కాకుండా.. త్రిశూలంతో కూడా వాళ్ళను భయపెట్టేసింది.

Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

కొన్ని రోజులకు ముందు లేడీ అఘోరి ఆత్మాహుతి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇలా ఎన్నో సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని భయభ్రాంతులను చేసింది. ఈమెకు వ్యతిరేఖంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు కూడా చాలామందే తెరమీదకు వచ్చారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగసాధు బాగా ఫేమస్ అయిపోయింది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు