Do You Know About New Fastag Rules: జాతీయ రహదాలు లేదా హైవేలమీద ప్రయాణించే వాహనాలు తప్పకుండా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. గతంలో ట్యాక్స్ కట్టడానికి.. టోల్ గేట్ దాటడానికి ఎక్కవ సమయంలో వేచి ఉండాల్సి వచ్చేది. దీనిని సులభతరం చేయడానికి, టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చింది. ప్రస్తుతం అన్ని వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు (ఆగష్టు 1 నుంచి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ సిస్టంలో కొన్ని కీలక చేసింది. వాటిని వాహనదారులు తప్పకుండా తెలుసుకోవాలి.
ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపుల కోసం కొత్త మార్గదర్శకాలు
👉విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్ అనేది తప్పకుండా వాహనం యొక్క విండ్‌షీల్డ్ మీదనే అతికించి ఉండాలి. ఈ నియమం ఉల్లంగిస్తే డబుల్ టోల్ ఫీజు వసూలు చేయబడుతుంది. అంటే వాహనదారుడు రెట్టింపు డబ్బు చెలాయించాల్సి ఉంటుంది.
ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌షీల్డ్ మీద కాకుండా ఎక్కడైనా వాటికిస్తే టోల్ గేట్ వద్ద సమయం వృధా అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాహనదారులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాల్సిందే.
👉కేవైసీ పూర్తి చేయాలి
ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించే వాహనదారులు తప్పకుండా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మూడు నుంచి ఐదు సంవత్సరాలా మధ్య ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నవారికి ఈ రూల్ వర్తిస్తుంది. కేవైసీ పూర్తి చేయడానికి చివరి గడువు 2024 అక్టోబర్ 31. కస్టమర్లు ఫాస్ట్‌ట్యాగ్ సేవను నిరంతరం ఉపయోగించుకోవడానికి ఈ కేవైసీ తప్పనిసరి. ఫాస్ట్‌ట్యాగ్ పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా ఇది అడ్డుకట్ట వేస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేయకపోతే.. బ్లాక్ లిస్టింగ్ చేయబడుతుంది. ఈ విషయం వాహనవినియోగదారులు లేదా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
👉ఐదేళ్ల కంటే ముందు ఫాస్ట్‌ట్యాగ్ లేదా పాత ఫాస్ట్‌ట్యాగ్ మార్చేయాలి
5 సంవత్సరాల కంటే ఎక్కువ పాత ఫాస్ట్‌ట్యాగ్స్ మార్చేయాలి. వాటి స్థానంలో కొత్త వాటిని అతికించాలి. కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కోసం అప్లై చేసుకుంటే.. పాత ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. అప్పుడు పాతది పనిచేయదు, దాని స్థానంలో కొత్తవి ఉపయోగించాలి. ఇది మళ్ళీ ఐదు సంవత్సరాలు పనికొస్తుంది.
👉90 రోజుల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్
మీరు కొత్త కారు కొన్నట్లయితే.. కొనుగోలు చేసిన 90 రోజులు లేదా మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఫాస్ట్‌ట్యాగ్ అందించే సంస్థలు డేటాబేస్‌లను ధ్రువీకరించడం మరియు అప్డేట్ చేయడం వంటివి చేస్తాయి. కాబట్టి వాహనాదరూ ఖచ్చితమైన వివరాలను అందించేలా చూసుకోవాలి. గతంలో మొబైల్ నెంబర్ లింక్ చేసేవారు. కానీ ఇకపైన ఫాస్ట్‌ట్యాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఛాసిస్ నెంబర్‌తో అనుసంధానించబడుతుంది. ఓకే ఫాస్ట్‌ట్యాగ్‌ను చాలా వాహనాల్లో ఉపయోగించకుండా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది.
👉మొబైల్ నెంబర్‌కు కనెక్ట్ చేయాలి
ఇదివరకే చెప్పుకున్నట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ను మొబైల్ నెంబర్‌తో కనెక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్స్ చేస్తూ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ టోల్ గేట్ వద్ద వేగంగా టోల్ చెల్లించడానికి సహాయపడతాయి. కాబట్టి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించేవారు తప్పకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలి.
త్వరలో జీపీఎస్ టెక్నాలజీ
టోల్ ఫీజును వసూలు చేయడానికి జీపీఎస్ టెక్నాలజీని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇది విజయవంతమైంది. కాబట్టి ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని మరిన్ని హైవేల మీద ఈ టెక్నాలజీ సాయంతోనే టోల్ వసూలు చేస్తారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ ట్యాక్స్ చెల్లించడానికి వాహనదారుల ఎక్కడా వాహనం ఆపుకోవాల్సిన అవసరం లేదు.
Don’t Miss: వచ్చేసింది ఫ్రెంచ్ బ్రాండ్.. టాటా కారుకు సరైన ప్రత్యర్థి ‘సిట్రోయెన్ బసాల్ట్’: ధర ఎంతో తెలుసా?
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకం తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైనా రోడ్డుమీద గాయపడితే లేదా ఇతర ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఉచిత చికిత్సను అందిస్తారు. అస్సాంలో ఈ పథకం అమలు చేయడం ప్రారంభించినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.