Do You Know About RK Roja Mercedes Benz Car: సినీనటి, రాజకీయ నాయకురాలు ‘ఆర్కే రోజా’ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. రాయలసీమలో (చిత్తూరు) పుట్టిన రోజా.. తిరుపతి పద్మావతి యూనివర్సిటిలో చదివి, ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. అప్పట్లోనే డాక్టర్ శివ ప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమతపస్సు సినిమాలో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తనదైన రీతిలో అభిమానులను మెప్పించిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఖ్యాతి పొందారు.
తమిళ చిత్ర దర్శకుడు ‘సెల్వమణి’ని పెళ్లి చేసుకున్న రోజాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు రోజాకు రెండు కళ్లులాంటి వారు అని చెప్పడంలో సందేహం లేదు. బిడ్డలను ప్రేమగా పెంచుతూ అడిగింది కొనిచ్చే రోజా.. అక్టోబర్ 2022లో తన కొడుకు కోసం ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ తరువాత ఎన్నో విమర్శలకు గురయ్యారు. ఇంతకీ మాజీ మంత్రి రోజా తన కొడుకు కోసం కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కొడుకు కోసం బెంజ్ కారు
ఆంధ్రప్రదేశ్ పర్యాటకమంత్రిగా ఉన్నప్పుడు.. రోజా తన కొడుకు ‘క్రిష్ణ కౌశిక్’ కోసం కొనుగోలు చేసిన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్’ (GLS 400D 4Matic) అని తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు. రోజా కొనుగోలు చేసిన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి రోజా కొనుగోలు చేసిన బెంజ్ కారు తెలుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారును కొనుగోలు చేసిన తరువాత రోజా కారును డ్రైవ్ చేస్తూ ఉంటే.. ఆమె కొడుకు పక్కన సీటులో కూర్చుని ఉన్నారు. నిజానికి ఇది దాదాపు రెండు సంవత్సరాల క్రితం కొన్న కారు.
ఈ కారును కొనుగోలు చేసిన తరువాత ప్రతిపక్ష నాయకులు, నేతలు కూడా చాలా విమర్శించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. యాంకర్లుగా చేస్తున్న ఎంతోమంది ఖరీదైన కార్లు కొంటున్నారు. నేను అగ్ర సినీనటిగా ఎదిగాను, కస్టపడి డబ్బు సంపాదించాను. నా కష్టార్జితంతోనే ఈ కారును కొన్నానని చెప్పారు. అంతే కాకుండా తన కొడుక్కి బ్రాండ్స్ అంటే ఇష్టమని.. తన కోసమే ఆ కారు కొన్నానని కూడా వెల్లడించారు. నిజనఁ చెప్పాలంటే పిల్లల కోరికలను తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి రోజా కారును కొనుగోలు చేసిందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్
ఇక మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్ విషయానికి వస్తే.. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు, వాహనం వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాకుండా పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలకు కూడా ఈ మోడల్ అంటే చాలా ఇష్టమని సమాచారం.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం మీద ఇది ఒక్క చూపుతోనే ఆకర్శించే డిజైన్ పొందినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Don’t Miss: ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?
ఈ లగ్జరీ కారు యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వాయిస్ కమాండ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. ఇందులో వాహన వినియోగదారుల రక్షణకు కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు 2925 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 3600 rpm వద్ద, 1200 rpm వద్ద 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 238 కిమీ/గం కావడం గమనార్హం. మొత్తం మీద పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.