PV Sindhu Cars And Married Details: పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు).. క్రీడారంగంలో ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే 2016లో జరిగిన రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పతాకాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారతీయ మహిళగా సింధు ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత 2020 టోక్యోలో జరిగి ఒలంపిక్ క్రీడల్లో కూడా ఈమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని సింధు తండ్రి రమణ అధికారికంగా వెల్లడించారు.
సింధు పెళ్లి
పీవీ సింధు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి.. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయి అని తెలుస్తోంది. ఈయన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చాలా కాలం పరిచయం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న (డిసెంబర్ 22) వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరుగుతుంది. ఆ తరువాత 24వ తేదీ హైదరాబాద్‌లోనే రిసెప్షన్ జరగనుంది.
కేవలం క్రీడాకారిణిగానే తెలిసిన చాలామందికి సింధు ఖరీదైన కార్లను ఉపయోగిస్తుందని.. బహుశా తెలిసుండకపోవచ్చు. ఈమె ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 320డీ మరియు మహీంద్రా థార్ వంటి కార్లు ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5)
ఎక్కువమంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఎక్కువగా ఇష్టపడే కార్ బ్రాండ్లలో బీఎండబ్ల్యూ ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఎక్స్5 కారు సింధు గ్యారేజిలో ఉంది. దీనిని నటుడు అక్కినేని నాగార్జున ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 75 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును సునీల్ శెట్టి, సచిన్ టెండూల్కర్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.
పీవీ సింధు ఉపయోగించే ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 అద్భుతమైన డిజైన్ కలిగి.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. అయితే పీవీ సింధు ఉపయోగించే కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందనేది వెల్లడికాలేదు. ఈ కారు ప్రయాణికుల భద్రతకు కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.
బీఎండబ్ల్యూ 320డీ (BMW 320D)
పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో బీఎండబ్ల్యూ కారు 320డీ. ఈ కారు ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. దీనిని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒలంపిక్స్ క్రీడలలో మెడల్ సాధించినందుకు సచిన్ ఈ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కృతి సనన్ కూడా ఒకరు. ఇప్పటికే ఈమె ఈ కారును రోజువారీ వినియోగం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఎక్కువమంది ప్రముఖులు ఇష్టపడే కార్లలో బీఎండబ్ల్యూ ఒకటి. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇవి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ఇది అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. ఈ కారణంగానే చాలామంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.
Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?
మహీంద్రా థార్ (Mahindra Thar)
పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో కారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కూడా ఒకటి. దీనిని దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అందించారు. భారతదేశంలో మహీంద్రా థార్ కారుకు అమితమైన ప్రజాదరణ ఉంది. ఇప్పటికే లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. అయితే సింధు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినందుకు ఆనంద్ మహీంద్రా థార్ కారును గిఫ్ట్ ఇచ్చారు.
మహీంద్రా థార్ రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. అద్భుతమైన పనితీరును అందించే మహీంద్రా థార్.. ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు 5 డోర్ రూపంలో (థార్ రోక్స్) కూడా అమ్మకానికి ఉంది. ఇది కూడా గొప్ప అమ్మకాలను పొందుతోంది.