21.7 C
Hyderabad
Friday, April 4, 2025

అర్థంకాని మేధావి RGV.. ఎలాంటి కార్లు ఉపయోగించారో తెలుసా..

Do You Know What Kind of Cars Ram Gopal Varma Used: రామ్ గోపాల్ వర్మ అలియార్ RGVగా పిలువబడే ప్రముఖ దర్శకుడు మరియు సినిమా రచయిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాల క్రితమే సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు గొప్ప దర్శహకులుగా పేరుపొందుతున్న పూరీ జగన్నాథ్ వంటి ఎంతోమందికి డైరెక్టర్లకు గురువు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ గురించి ఓ పుస్తకమే రాసేయొచ్చు. అయితే.. సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వాహనాలను ఉపయోగిస్తారు? అసలు ఈయనకు వాహనాలంటే ఇష్టం ఉందా? లేదా? అనే మరిన్ని విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం..

నిజానికి రామ్ గోపాల్ వర్మ తన రేంజ్‌కు తగిన విధంగా ఒకప్పుడు రేంజ్ రోవర్ కారును వాడేవారని సమాచారం. ఆ తరువాత కొన్ని రోజులు మెర్సిడెస్ బెంజ్ కారును కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మ ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. అంతే కాకుండా.. రామ్ గోపాల్ వర్మ ఓ సారి ఎంతోమందికి ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బైకుపై కూడా కనిపించారు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కార్లను ఉపయోగిస్తున్నారనేది స్పష్టంగా తెలియదు.

సినీ పరిశ్రమలో ఎక్కువమంది ఉపయోగించే కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు రేంజ్ రోవర్. రేంజ్ రోవర్ కార్లు ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతాయి. దీంతో వాహన వినియోగదారులు అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ కారణంగానే టాలివుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని రంగాలలో రేంజ్ రోవర్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది గ్యారేజిలో ఈ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి.

ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే మరో కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్. బెంజ్ కార్లను కూడా చాలామంది ప్రముఖుల గ్యారేజిలో ఉంది. అంబానీ దగ్గర నుంచి.. ఓ బుల్లితెర నటుల వరకు చాలామంది ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ధర సాధారణ కార్ల ధరల కంటే కూడా ఎక్కువ. ఈ కార్లు కూడా ఆధునిక ఫీచర్స్ కలిగి.. మంచి లగ్జరీ ప్రయాణ అనుభూతిని అందింస్తుంది.

ఇక చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బైక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది యువత కొనుగోలు చేస్తున్న బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ యొక్క క్లాసిక్ ఒకటి. ఈ బైకును చాలామంది సెలబిట్రీలు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ బైకును అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది బైక్ ప్రేమికులు దీనికి ఆకర్షితులవుతున్నారు. ఈ బైక్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 1.78 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రామ్ గోపాల్ వర్మ సినీ ప్రస్థానం

చిన్నప్పటి నుంచే సినిమాల మీద అమితాసక్తి కలిగిన రామ్ గోపాల్ వర్మ.. స్కూలుకి డుమ్మాకొట్టి చూసిన సినిమాలనే పదేపదే చూసేవాడిని కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినిమాల్లో కొన్ని సన్నీవేశాలు తనను తెగ ఆకర్శించేవని, ఈ కారణంగానే ఆయన చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూసేవాడిని వివరించారు. మొదటిసారి 1989లో అక్కినేని నాగేశ్వర్ రావు ‘శివ’ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టింది. దీంతో సినీ రంగంలో రామ్ గోపాల్ వర్మ విజయ యాత్ర ప్రారంభమైంది.

Don’t Miss: ఇలాంటి స్కూటర్ భారత్‌లో మరొకటి లేదు!.. కొనాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే

శివ సినిమా తరువాత క్షణక్షణం, గులాబీ, రక్త చరిత్ర మరియు రౌడీ వంటి సినిమాలు భారీ విజయం సాధించాయి. తెలుగులో మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్‌లో కూడా ప్రవేశం ఉందని సమాచారం. బాలీవుడ్‌లో కూడా రామ్ గోపాల్ వర్మ తన ట్యాలెంట్ నిరూపించుకున్నారు. ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మన లెజండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శారీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి.ఈ సినిమా అక్టోబర్ నెలలో తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు