Richest Heroine in India and Net Worth: భారతదేశంలో అగ్ర కథానాయకి ఎవరంటే కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరని అడిగితే.. మరికొంతమంది పేర్లు చెబుతారు. కానీ ఇండియాలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ ఎవరంటే మాత్రం.. తప్పకుండా తడబడే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం..
అత్యంత ధనిక హీరోయిన్ ఎవరంటే.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, అలియా భట్ వంటి వారు మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశంలో నయనతార, త్రిష, రష్మిక మందన్న మొదలైన పేర్లు చెబుతారు. కానీ వీరికంటే రిచెస్ట్ హీరోయిన్ ఒకరున్నారు. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి జుహీ చావ్లా (Juhi Chawla).
ధనిక హీరోయిన్
నటి జుహీ చావ్లా ఆస్తి ఏకంగా రూ. 4000 కోట్ల కంటే ఎక్కువే అని సమాచారం. సినిమా ప్రపంచానికి దూరమైనప్పటికీ.. ఈమె ఐపీఎల్ టీమ్ ‘కేకేఆర్’ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా డ్రీమ్డ్ అన్‌లిమిటెడ్, జూహీ చావ్లా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి కూడా జుహీ చావ్లా సారథ్యంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు తక్కువే.. కానీ పలు సంస్థలలో భాగస్వామిగా ఉండటం వల్ల, వచ్చిన డబ్బే చాలా ఎక్కువ.
సినీ కెరియర్
బాలీవుడ్ చిత్ర సీమలో ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా.. హమ్ హై రహీ ప్యార్ కే, ఖయామత్ సే ఖయామత్ తక్, యస్ బాస్, డర్ మరియు బోల్ రాధా బోల్ వంటి సినిమాల్లో నటించి 1990లలో సంచలనం సృష్టించింది. కాగా 2024 హురున్ ధనవంతుల జాబితాలో జుహీ చావ్లా నికర విలువ రూ. 4600 కోట్లు. ఈమె తరువాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. అంటే జుహీ చావ్లా ఆస్తి షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువే.
2019లో ఒక్క హిట్ కూడా లేదు
1990లలో మంచి పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా ఖాతాలో 2009లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అయినప్పటికీ దేశంలోని టాప్ 10 అత్యంత ధనవంత నటీమణుల జాబితాలో ఒకరుగా ఉంది. దీనికి కారణం కొన్ని సంస్థలలో భాగస్వామి కావడమే. ఈ విధంగానే ఈమెకు డబ్బు వస్తోంది. దీంతో నికర విలువ కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు ఈమె భర్త (జే మెహతా) ప్రముఖ వ్యాపారవేత్త.. కాబట్టి ఈ వైపు నుంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి.
రెమ్యునరేషన్
భారతదేశంలో అత్యంత ధనిక నటిగా పేరు తెచ్చుకున్న.. జుహీ చావాలా 90లలోనే ఒక్కో సినిమాకు రూ. 1 కోటి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది. ఆ తరువాత కాలంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. ఇది కూడా ఆమె సంపదను పెంచడానికి కారణం అయింది. టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్ జాబితాలో ఒకరని చేసింది.
కార్ కలెక్షన్స్
అత్యంత ధనిక నటిగా పేరు తెచ్చుకున్న జుహీ చావ్లా.. ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తోంది. ఈ జాబితాలో ఆస్టన్ మార్టిన్ రాపిడ్ (రూ. 3.3 కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.8 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ – క్లాస్ (రూ. 1.7 కోట్లు), జాగ్వార్ ఎక్స్‌జే (రూ. 1.2 కోట్లు) మరియు పోర్షే కయెన్ (రూ. 1.36 లక్షల నుంచి రూ. 2 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.
Also Read: మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఒకటి. ఈ కారు ధర చాలా ఎక్కువ కావడం చేత, దీనిని చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. జుహీ చావ్లా ఈ కారును కూడా ఉపయోగిస్తోంది. ఇది కాకుండా బెంజ్, బిఎండబ్ల్యూ, పోర్షే మరియు జాగ్వార్ బ్రాండ్ కార్లను కూడా.. తన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తుందో. దీన్ని బట్టి చూస్తే.. ఖరీదైన కార్ల మీద జుహీ చావ్లాకు చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది.
ఇండియాలో ఇతర రిచెస్ట్ హీరోయిన్స్
నటి జుహీ చావ్లా తరువాత, అత్యంత ధనిక హీరోయిన్స్ జాబితాలో వరుసగా రెండో స్థానంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ (రూ. 850 కోట్ల కంటే ఎక్కువ), మూడో స్థానంలో ప్రియాంక చోప్రా (రూ. 650 కోట్లు) ఉన్నారు.
Also Read: జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!
ఐశ్వర్య రాయ్ మరియు ప్రియాంక చోప్రాలు సినిమాల్లో నటించిన సంపాదించింది కొంత తక్కువే అయినా.. అంతర్జాతీయ ప్రాజెక్టులు, నిర్మాణ సంస్థలు మొదలైన వాటి నుంచి వచ్చిన డబ్బు ఎక్కువ. ఈ కారణంగానే వీరు ధనవంతుల జాబితాలో నిలిచారు. అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనె (రూ. 500 కోట్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ధనవంతుల జాబితాలో టాలీవుడ్ హీరోయిన్స్
రిచెస్ట్ హీరోయిన్స్ జాబితాలోని టాలీవుడ్ తారల జాబితాలో.. లేడీ సూపర్ స్టార్ నయనతార (రూ. 200 కోట్ల కంటే ఎక్కువ), తమన్నా భాటియా (రూ. 120 కోట్లు), సమంత (రూ. 101 కోట్లు), త్రిష (రూ. 85 కోట్లు), కాజల్ ఆగర్వాల్ (రూ. 85 కోట్లు) మరియు రష్మిక మందన్న (రూ. 66 కోట్లు) మొదలైనవారు ఉన్నారు. వీరు సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఇతర వ్యాపారాల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు.