Do You Know Who Owns Dhirubhai Ambani Cadillac Car: అంబానీ అంటే ఈ రోజు అందరికీ ముకేశ్ అంబానీ మాత్రమే గుర్తొస్తారు. కానీ ముకేశ్ అంబానీ ఈ రోజు ఇంతలా ఎదగడానికి మూలకారణమైన ధీరూభాయ్ అంబానీ గురించి బహుశా కొందరికి తెలుసుండకపోవచ్చు. ఈ రోజు యాంటాలియాలో నివాసం, ఖరీదైన కార్లలో ప్రయాణం.. ఇదంతా ధీరూభాయ్ చలవే.
తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముకేశ్, అనిల్ ఇద్దరూ కూడా వ్యాపార సామ్రాజ్యాలను ఖండాంతరాలకు విస్తరించారు. అయితే ఒక కారును మాత్రం దూరం చేసుకున్నారు. అంబానీ గ్యారేజిలో ప్రస్తుతం 170 కంటే ఎక్కువ ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. కానీ ముకేశ్ అంబానీ.. తన తండ్రి ధీరూభాయ్ అంబానీకి ఇష్టమైన కారును మాత్రం తన గ్యారేజిలోకి తెచుకోలేకపోయారు.
వింటేజ్ కాడిలాక్
ధీరూభాయ్ అంబానీని ఇష్టమైన మరియు తాను ఉపయోగించిన కార్లలో ఒకటైన వింటేజ్ కారు ‘కాడిలాక్’ ఇప్పుడు మలయాళ నటుడు మోహన్ లాల్ దగ్గర ఉంది. దీనిని మోహన్ లాల్ మామ కే బాలాజీ కొనుగోలు చేసారు. ఆపై నుంచి ఆ కారు చెన్నైలోనే ఉంది. ఈ కారు అనేక సినిమాలలో కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ కారును కొచ్చిలో పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.
వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీకి చెందిన ఈ కారు మెరూన్ రంగులో ఉండేది. తరువాత కాలంలో దీనికి కొత్త పెయింట్ వేశారు. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఏఎస్ 2100 కావడం విశేషం. ఇది చాలా విలువైన ఆస్తి అని మోహన్ లాల్ అనేక సందర్భాల్లో చెప్పారు.
మోహన్ లాల్ కార్ల ప్రపంచం
నటుడు మోహన్ లాల్ స్వయంగా ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఈ కారణంగానే ఈయన ఎప్పటికప్పుడు తనకు నచ్చిన ,మరియు ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఈ కారు మాత్రమే కాకుండా ఆయన గ్యారేజిలో టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా వెల్‌ఫైర్, రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ వీ8 ఆటోబయోగ్రఫీ కూడా ఉంది.
అంబానీ గ్యారేజిలోని కార్లు
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఖరీదైన రోల్స్ రాయిస్, ఫెరారీ, లంబోర్ఘిని , మెర్సిడెస్ బెంజ్ మరియు ల్యాండ్ రోవర్స్ వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఖరీదైన విమానాలు, హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి.
వింటేజ్ కాడిలాక్ కారు.. అనిల్ అంబానీ మరియు ముకేశ్ అంబానీ వద్ద లేకపోవడానికి కారణం, వారి చిన్నప్పుడే బహుశా ధీరూబాయ్ ఆ కారును అమ్మేసి ఉంటారు. ఆ సమయంలో కే బాలాజీ దీనికి కొనుగోలు చేసి చెన్నైలో పెట్టుకున్నాడు. అయితే ఈ కారు భవిష్యత్తులో అంబానీ గ్యారేజిలోకి చేరుతుందా? మోహన్ లాల్ వద్దనే ఉంటుందా? అనేది సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలిపోయింది.
Also Read: బంగారం కొనడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు!: నాలుగు రోజుల్లో రూ.3650 తగ్గిన రేటు
ధీరూబాయ్ అంబానీ
రిలయన్స్ సంస్థ, అంబానీ కుటుంబం నేడు దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రగామిగా ఉన్నారంటే.. ధీరూబాయ్ అంబానీ మార్గదర్శకాలు కారణం అని తెలుస్తోంది. తండ్రి స్థాపించిన వ్యాపారాలను అనిల్ అంబానీ పోగొట్టుకున్నప్పటికీ.. ముకేశ్ అంబానీ వాటిని మరింత విస్తరించారు. ప్రస్తుతం ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఉంది.