EMotorad Kalki Limited Edition Doodle E Cycle Details: ప్రపంచం మొత్తం ఓవైపు త్వరలో విడుదలకానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం వేచి చూస్తోంది. మరోవైపు వాహన ప్రియుల కోసం ‘ఈమోటోరాడ్’ (EMotorad) కంపెనీ ‘కల్కి లిమిటెడ్ ఎడిషన్ డూడుల్’ (Kalki Limited Edition Doodle) అనే ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరించింది. ఇంతకీ ఈ సైకిల్ ధర ఎంత? బుకింగ్ ప్రైస్ ఎంత? డిజైన్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఎంత అనే మరిన్ని ఆస్కతికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర మరియు బుకింగ్స్
ఫేమస్ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ ఈమోటోరాడ్ లాంచ్ చేసిన ఈ కల్కి లిమిటెడ్ ఎడిషన్ సైకిల్.. కల్కి సినిమా స్ఫూర్తితో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 55999. ఈ సైకిల్ బుక్ చేసుకోవాలనుకునే వారు రూ. 2898 చెల్లించి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. సినిమా టైటిల్‌లో చూపించే అక్షరాలా ప్రకారం ఈ బుకింగ్ ప్రైస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.
డిజైన్
కొత్త కల్కి లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక అడ్వెంచర్ వెహికల్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు మరియు వెనుక భాగంలో సాధారణ సైకిల్స్‌కు ఉండే టైర్లు మాదిరిగా కాకుండా పెద్ద పెద్ద టైర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సైకిల్ కల్కి మరియు డూడుల్ అనే అక్షరాలను కూడా కలిగి ఉంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ సైకిల్ ఫోల్డబుల్.. అంటే దీన్ని మడతపెట్టి తీసుకెళదానికి అనుకూలంగా ఉంటుంది.
కంపెనీ ప్రభాస్ సినిమా థీమ్ ఆధారంగా రూపోంచిందిన ఈ సైకిల్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని కొంతమంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే కంపెనీ ఎన్ని యూనిట్లను విక్రయిస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు.
ఫీచర్స్ & రేంజ్
కొత్త కల్కి లిమిటెడ్ ఎడిషన్ సైకిల్ అనేది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకూండా.. వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఐదు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మోడ్స్ గురించి తెలుసుకోవడానికి హ్యాండిల్ బార్ మీద ఒక చిన్న డిస్‌ప్లే ఉండటం చూడవచ్చు. ముందు భాగంలో ఓ చిన్న లైట్.. బ్రేకింగ్ కోసం దృఢమైన సెటప్ వంటివి ఇందులో గమనించవచ్చు.
ఇక రేంజ్ విషయానికి వస్తే.. కల్కి లిమిటెడ్ ఎడిషన్ టాప్ స్పీడ్ 25 కిమీ అని తెలుస్తోంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 60 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాబట్టి దీన్ని రోజు వారీ వినియోగానికి నగరంలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ట్రాఫిక్ సమయంలో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది. ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ సైకిల్ కోసం రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ వంటివి అవసరమే లేదు. మొత్తం మీద ఇది వాహన ప్రియుల అభిరుచికి తగిన విధంగా ఉందని అర్థమవుతోంది.
ఈ కొత్త సైకిల్ ఆవిష్కరణ సందర్భంగా.. ఈమోటోరాడ్ కంపెనీ సీఈఓ ‘కునాల్ గుప్తా’ మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక లెజెండ్. మార్కెట్లో ఈ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ డూడుల్ వీ 3 ఈ సైకిల్‌ను పరిచయమ్ చేయడానికి కల్కితో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కస్టమర్ల ఆసక్తిని మాత్రమే కాకుండా అభిమానుల ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ సైకిల్ విడుదల చేయడం జరిగిందని, ఇది తప్పకుండా అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నానని అన్నారు.
Don’t Miss: తరాలు మారినా.. చరిత్రలో నిలిచిపోయే బైకులు ఇవే!.. ఒక్కొక్కటి ఓ అద్బుతం
కల్కి 2898 ఏడీ సినిమా..
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి సినిమా జూన్ 27న విడుదలకానుంది. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర సినీ ప్రముఖులు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కాగా.. ఈ సినిమా టికెట్స్ కోసం ఇప్పటికే ఫ్రీ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని అమ్ముడైపోయినట్లు వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారనేది ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాము.